త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup 2026 | వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి నిష్క్ర‌మించ‌డం నిరాశ‌కు గురి చేసింది: మిచెల్ మార్ష్

T20 World Cup 2026 | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్నీలో ఆస్ట్రేలియా జ‌ట్టు లీగ్ ద‌శ‌లోనే నిష్క్ర‌మించ‌డంపై ఆ టీం కెప్టెన్ మిచెల్ మార్ష్ స్పందించారు. ఒమాన్‌తో శుక్ర‌వారం జ‌రిగిన మ్యాచ్ అనంత‌రం నిర్వ‌హించిన మీడియా సమావేశంలో మార్ష్ మాట్లాడుతూ త‌మ డ్రెస్సింగ్ రూమ్‌లో ప్ర‌స్తుతం పూర్తిగా నిరాశ నెల‌కొంద‌న్నారు.

S

Cricket | Published On Feb 21, 2026, 11.32 am IST

T20 World Cup 2026 | వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి నిష్క్ర‌మించ‌డం నిరాశ‌కు గురి చేసింది: మిచెల్ మార్ష్
Advertisement

T20 World Cup 2026 | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్నీలో ఆస్ట్రేలియా జ‌ట్టు లీగ్ ద‌శ‌లోనే నిష్క్ర‌మించ‌డంపై ఆ టీం కెప్టెన్ మిచెల్ మార్ష్ స్పందించారు. ఒమాన్‌తో శుక్ర‌వారం జ‌రిగిన మ్యాచ్ అనంత‌రం నిర్వ‌హించిన మీడియా సమావేశంలో మార్ష్ మాట్లాడుతూ త‌మ డ్రెస్సింగ్ రూమ్‌లో ప్ర‌స్తుతం పూర్తిగా నిరాశ నెల‌కొంద‌న్నారు. ఇది తాము ఆశించిన ముగింపు కాద‌ని, పూర్తిగా నిరాశాజ‌న‌కంగా ఉంద‌ని అన్నారు. అన్ని జ‌ట్ల‌లాగే తాము కూడా ఈ టోర్నీ కోసం గ‌త 2 ఏళ్ల నుంచి సిద్ధ‌మ‌వుతూ వ‌చ్చామ‌ని, కానీ కీల‌క‌మైన మ్యాచ్‌లో ఓట‌మి కార‌ణంగా సూప‌ర్ 8కు చేర‌లేక‌పోయామ‌ని అన్నారు. తాము ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేద‌న్న విష‌యాన్ని మార్ష్ అంగీక‌రించాడు. ఈ టోర్నీలో జింబాబ్వే చేతిలో ఓట‌మిపాలయ్యాక తాము ఒత్తిడికి గుర‌య్యామ‌ని, తీవ్రంగా నిరాశ చెందామ‌ని స్ప‌ష్టం చేశారు. జింబాబ్వే జ‌ట్టు బాగా ఆడింద‌ని కితాబిచ్చారు. ప‌రిస్థితులు, పిచ్‌, వాతావ‌రణం త‌మ ఓట‌మికి కార‌ణాలు కావ‌ని తాను భావిస్తున్న‌ట్లు తెలిపారు.

అవ‌కాశాలు వ‌చ్చినా ఉప‌యోగించుకోలేదు: మార్ష్‌

కొలంబో పిచ్ నెమ్మదిగా ఉందని ఒప్పుకున్న మార్ష్.. అలాంటి పరిస్థితులకు తాము సిద్ధ‌ప‌డే వ‌చ్చామ‌ని, ఈ జ‌ట్టుతో క‌ప్ గెలిచే స‌త్తా త‌మ‌కు ఉంద‌ని అన్నారు. కానీ టోర్నీ క్రికెట్‌లో ఒక్క ఓట‌మి ప్రభావం పెద్దదిగా ఉంటుంద‌ని, గత రెండు వారాల్లో త‌మ‌కు అవకాశాలు వచ్చాయ‌ని, కీలక సమయంలో అమలు చేయలేకపోయ‌మ‌ని పేర్కొన్నారు. క్రికెట్ ఆస్ట్రేలియాకు చెందిన బోర్డు స‌భ్యులు, అధికారులు, సీనియ‌ర్ ప్లేయ‌ర్లు అంద‌రూ క‌ల‌సి సమీక్ష చేయ‌బోతున్నార‌ని మార్ష్ తెలిపారు. తాము చేసిన త‌ప్పుల‌ను నిజాయితీగా విశ్లేషించుకుంటామ‌ని, మ‌రోసారి ఆడేట‌ప్పుడు ఈ విష‌యాల‌ను దృష్టిలో ఉంచుకుని ఆడ‌తామ‌ని అన్నారు. ఓట‌ముల ద్వారానే పాఠాలు నేర్చుకోవ‌చ్చ‌ని తెలిపిన మార్ష్ ప్ర‌స్తుతానికి ఇంటికి వెళ్లి ఆలోంచించుకుని ముందుకు సాగుతామ‌ని తెలిపారు.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో ఆస్ట్రేలియా చివ‌రి లీగ్ మ్యాచ్‌లో ఓమాన్‌పై గెలిచిన‌ప్ప‌టికీ సూపర్ 8కు అర్హ‌త సాధించ‌డంలో విఫ‌ల‌మైంద‌న్న విష‌యం తెలిసిందే. ఒమాన్‌తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో 105 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 9.4 ఓవర్లలోనే 108/1తో చేధించింది. మార్ష్ 33 బంతుల్లో అజేయంగా 64 పరుగులు (7 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి జట్టుకు గెలుపు అందించాడు. అంతకుముందు, ఒమాన్‌ను 16.2 ఓవర్లలో 104 పరుగులకు ఆలౌట్ చేయడంలో ఆడమ్ జాంపా 4 వికెట్లు పడగొట్టగా, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జావియర్ బార్ట్‌లెట్ చెరో 2 వికెట్లు తీశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement