త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sachin Tendulkar | సచిన్‌తో ఓపెన్‌ఏఐ పార్ట్‌న‌ర్‌షిప్‌.. చాట్‌జీపీటీ ద్వారా కీలక భాగస్వామ్యం..

Sachin Tendulkar | క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్‌ఏఐతో భాగస్వామ్యం ప్రకటించారు. సోమవారం ఎక్స్‌లో చేసిన పోస్టు ద్వారా ఈ విషయాన్ని వెల్లడించిన సచిన్.. ఆసక్తికరమైన విషయాలు రాబోతున్నాయంటూ పేర్కొన్నారు. సచిన్ టెండూల్కర్‌తో బహుళ సంవత్సరాల భాగస్వామ్యాన్ని ప్రారంభించినట్లు ఓపెన్‌ఏఐ తెలిపింది.

S

Cricket | Published On Sep 28, 2026, 2.26 pm IST

Sachin Tendulkar | సచిన్‌తో ఓపెన్‌ఏఐ పార్ట్‌న‌ర్‌షిప్‌.. చాట్‌జీపీటీ ద్వారా కీలక భాగస్వామ్యం..
Advertisement

Sachin Tendulkar | క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్‌ఏఐతో భాగస్వామ్యం ప్రకటించారు. సోమవారం ఎక్స్‌లో చేసిన పోస్టు ద్వారా ఈ విషయాన్ని వెల్లడించిన సచిన్.. ఆసక్తికరమైన విషయాలు రాబోతున్నాయంటూ పేర్కొన్నారు. సచిన్ టెండూల్కర్‌తో బహుళ సంవత్సరాల భాగస్వామ్యాన్ని ప్రారంభించినట్లు ఓపెన్‌ఏఐ తెలిపింది. భారత్‌లోని ప్రజలు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో కృత్రిమ మేధస్సు, చాట్‌జీపీటీని ఎలా ఉపయోగించుకోవచ్చో చూపించడమే ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశంగా పేర్కొంది. సచిన్‌తో రూపొందించే కంటెంట్, ప్రచార కార్యక్రమాలు, ప్రత్యేక అనుభవాల ద్వారా చాట్‌జీపీటీ వినియోగాన్ని ప్రజలకు పరిచయం చేయనున్నారు.

ఏఐ నాకు ఎంతో మేలు చేసింది: స‌చిన్‌

తనకు ఉన్న సహజమైన ఆసక్తి కారణంగా ఒక ప్రశ్న నుంచి మరో ప్రశ్నకు వెళ్లే అలవాటు ఉందని సచిన్ తెలిపారు. చాట్‌జీపీటీ ఈ ఆసక్తిని మరింత ప్రోత్సహించిందని చెప్పారు. తన చివరి కుటుంబ పర్యటనను ప్రణాళిక చేసుకోవడం సహా పలు ఆచరణాత్మక పనుల్లో ఈ కృత్రిమ మేధస్సు సాధనం తనకు ఉపయోగపడిందని వెల్లడించారు.

చాట్‌జీపీటీ ద్వారా ఆసక్తి ఉన్న అంశాల గురించి తెలుసుకోవడం, కొత్త ఆలోచనలను అభివృద్ధి చేయడం, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడం వంటి ఆచరణాత్మక ఉపయోగాలను ప్రజలకు చూపించడంపై ఈ భాగస్వామ్యం దృష్టి సారించనుంది. ఈ భాగస్వామ్యంపై సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ ఒక ప్రశ్న, ఒక ఆలోచన, మీరు ఎప్పటినుంచో అన్వేషించాలనుకున్న విషయం.. ప్రారంభించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కలిసి అన్వేషించేందుకు ఎదురుచూస్తున్నాన‌ని పేర్కొన్నారు.

Advertisement
Advertisement