త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Para Cricketer | రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో ఎట్ హోమ్ కార్య‌క్ర‌మం.. పారా క్రికెట‌ర్‌కు ఆహ్వానం

Para Cricketer | జ‌మ్ముక‌శ్మీర్‌కు చెందిన‌ పారా క్రికెట‌ర్‌కు (Para Cricketer) అరుదైన గుర్తింపు ద‌క్కింది. రెండు చేతులూ లేని పారా క్రికెట‌ర్ అమీర్ హుస్సేన్ లోన్‌కు (Amir Hussain Lone) స్వాతంత్య్ర దినోత్సవం సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో (Rashtrapati Bhavan) జ‌రిగే ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ఎట్ హోమ్ (At Home) కార్య‌క్ర‌మానికి ఆహ్వానం అందింది.

G

Cricket | Published On Aug 14, 2026, 10.16 am IST

Para Cricketer | రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో ఎట్ హోమ్ కార్య‌క్ర‌మం.. పారా క్రికెట‌ర్‌కు ఆహ్వానం
Advertisement

Para Cricketer | త్రినేత్ర‌.న్యూస్‌: జ‌మ్ముక‌శ్మీర్‌కు చెందిన‌ పారా క్రికెట‌ర్‌కు (Para Cricketer) అరుదైన గుర్తింపు ద‌క్కింది. రెండు చేతులూ లేని పారా క్రికెట‌ర్ అమీర్ హుస్సేన్ లోన్‌కు (Amir Hussain Lone) స్వాతంత్య్ర దినోత్సవం సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో (Rashtrapati Bhavan) జ‌రిగే ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ఎట్ హోమ్ (At Home) కార్య‌క్ర‌మానికి ఆహ్వానం అందింది. స్వాతంత్య్ర‌, గ‌ణ‌తంత్ర దినోత్స‌వం (Independence Day) సందర్భంగా భారత రాష్ట్రపతి నిర్వహించే సాంప్రదాయ రిసెప్షన్, విందు కార్యక్రమమే ఎట్ హోమ్‌. దీనికి దేశ ప్రధాని, కేంద్ర మంత్రులు, విదేశీ రాయబారులు, త్రివిధ దళాల అధిపతులు, వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులు హాజరవుతారు. ఈ కార్య‌క్ర‌మానికి జ‌మ్ములోని అనంతనాగ్‌ జిల్లా బిజ్‌బెహరా ప్రాంతానికి చెందిన పారా క్రికెట‌ర్‌కు ఆహ్వానం ల‌భించ‌డం గ‌మ‌నార్హం. ఈ ఆహ్వానం అమీర్‌కు వ్యక్తిగత గౌరవం మాత్రమే కాకుండా పట్టుదల, దృఢసంకల్పంతో ప్రతికూలతలను అధిగమించిన అతని సుదీర్ఘ ప్రయాణానికి దక్కిన గుర్తింపు అని స‌హ‌చ‌రులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఎట్ హోమ్ విందుకు త‌న‌కు రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందిందని అమీర్ తెలిపారు. ఇది త‌న‌కు, జమ్ముక‌శ్మీర్‌కు (Jammu Kashmir) దక్కిన గౌరవ‌మ‌ని చెప్పారు. తాను ఈ కార్యక్రమానికి త‌ప్ప‌కుండా హాజరవుతాన‌ని చెప్పారు.

అమీర్ త‌న ఎనిమిదో ఏట‌ జరిగిన ఒక ప్రమాదంలో రెండు చేతులను కోల్పోయాడు. మూడేండ్ల చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్నాడు. నలుగురూ సానుభూతి చూపడం అతణ్ని ఎంతో బాధించేది. ఆ సమయంలో కుటుంబసభ్యులు అన్ని విధాలుగా అండగా నిలబడ్డారు. ప్రోత్సాహం అందిస్తూ వచ్చారు. అయినా అక్కడక్కడా చేదు అనుభవాలు తప్పలేదు. ఆ పరిస్థితుల్లోనూ క్రికెట్‌ పట్ల మమకారం చంపుకోని లోన్‌.. కాళ్లతో బౌలింగ్‌ చేయడానికి ప్రయత్నించాడు.

భుజం, మెడ మధ్య బ్యాట్‌ పెట్టుకుని ఆడేందుకు శ్రమించాడు. అత‌ని శ్ర‌మ వృథాగా పోలేదు. జ‌మ్ముక‌శ్మీర్ పారా క్రికెట్ జ‌ట్టుకు ఎంపిక‌య్యాడు. త‌ర్వాత ఆ జ‌ట్టుకు కెప్టెన్‌గానూ వ్య‌వ‌హ‌రించాడు. భారతదేశం తరఫున కూడా ప్రాతినిధ్యం వహించి వివిధ దేశాల్లో ఆడారు. లోన్‌ ఆటకు అబ్బురపడిన స‌చిన్ టెండూల్కర్ (Sachin Tendular) 2016 లోనే తన ఆటోగ్రాఫ్‌తో కూడిన బ్యాట్‌ను బహుమతిగా పంపాడు.

Advertisement
Advertisement