International Hockey Tournament | మార్చి 8 నుంచి గచ్చిబౌలిలో ఇంటర్నేషనల్ హాకీ టోర్నమెంట్
International Hockey Tournament | మార్చి 8 నుంచి 14 వరకు గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ హాకీ వరల్డ్ క్వాలిఫై ఉమెన్ హాకీ టోర్నమెంట్ జరగనున్నట్లు క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు.
International Hockey Tournament | త్రినేత్ర.న్యూస్ : మార్చి 8 నుంచి 14 వరకు గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ హాకీ వరల్డ్ క్వాలిఫై ఉమెన్ హాకీ టోర్నమెంట్ జరగనున్నట్లు క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీ బాలాదేవి పాల్గొన్నారు.
గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందుతున్న హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. తెలంగాణ ప్రభుత్వ క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఫెడరేషన్ ఇంటర్నేషనల్ హాకీ వరల్డ్ క్వాలిఫై వుమెన్ హాకీ టోర్నమెంట్ 2026 నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశాం. మార్చి 8 నుంచి 14 వరకు జరిగే ఈ పోటీలు గచ్చిబౌలిలోని హాకీ స్టేడియంలో జరుగనున్నాయి. ఈ టోర్నమెంట్లో భారత్‌తో పాటు ఆస్ట్రియా, ఇంగ్లాండ్, ఇటలీ, కొరియా, స్కాట్లాండ్, వేల్స్ జట్లు పాల్గొంటున్నాయి. మహిళల వరల్డ్ కప్ హాకీ క్వాలిఫైయర్స్ 2026కి ఈ పోటీలు కీలకంగా మారనున్నాయని మంత్రి పేర్కొన్నారు.
టోర్నమెంట్‌ను లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అన్ని సదుపాయాలను సమకూర్చింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆస్ట్రోటర్ఫ్ మైదానం, హై సెక్యూరిటీ, ఆధునిక సదుపాయాలు, క్రీడాకారులకు అత్యుత్తమ వసతి ఏర్పాట్లు చేయబడ్డాయి. ఈ ఏర్పాట్లలో ఫెడరేషన్ ఇంటర్నేషనల్ హాకీ, హాకీ ఇండియా ప్రతినిధులతో సమన్వయం కొనసాగుతోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ విభాగాల మధ్య సమగ్ర సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.
ఇప్పటికే ఈ టోర్నమెంట్లో పాల్గొనబోతున్న అన్ని జట్లు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వ క్రీడా శాఖ ఘనంగా స్వాగత సత్కారాలు చేసింది. దానితోపాటు ప్రాక్టీస్‌కు కావలసిన అన్ని వసతులు, అంతర్జాతీయ ప్రమాణాల వసతి సదుపాయాలు అందుబాటులో ఉంచడం జరిగింది. అన్ని జట్ల క్రీడాకారిణిలు ఆధునీకరించిన గచ్చిబౌలి ఆస్ట్రోటర్ఫ్ స్టేడియంలో బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రతినిధులు, క్రీడాకారుల కోసం నగరంలోని వారసత్వ ప్రదేశాల పర్యటనలు, వినోద కార్యక్రమాల రూపకల్పన కూడా చేపట్టాలని భావిస్తున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అందిస్తున్న ప్రోత్సాహం వల్లే ఇలాంటి అంతర్జాతీయ టోర్నమెంట్లను విజయవంతంగా నిర్వహించగలుగుతున్నామని
గర్వంగా చెప్పగలుగుతున్నామని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు మరిన్ని కార్యక్రమాలతో తెలంగాణ క్రీడా శాఖ ముందుకు వెళ్తుంది. గచ్చిబౌలిలో జరిగే హాకీ పోటీలకు మీరంతా హాజరై ఈ కార్యక్రమానికి విస్తృతంగా ప్రచారం కల్పించాల్సిందిగా కోరుతున్నానని మంత్రి శ్రీహరి పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





