త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ICC Chairman Jay Shah | ఆడితే ఆడండి, లేక‌పోతే లేదు.. మ్యాచ్‌ల‌ను త‌ర‌లించ‌లేం.. తేల్చి చెప్పిన జైషా..?

ICC Chairman Jay Shah | ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2026 నుంచి కేకేఆర్ ప్లేయ‌ర్ ముస్తాఫిజుర్ ర‌హ‌మాన్‌ను రిలీజ్ చేయ‌డంతో వివాదం రాజుకున్న విష‌యం విదిత‌మే. బీసీసీఐ కార్య‌ద‌ర్శి దేవ‌జిత్ సైకియా ఈ విష‌యాన్ని మీడియాకు వెల్ల‌డించారు. అయితే ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ స‌మావేశం నిర్వహించ‌కుండానే సైకియా ఎవ‌రి ఆదేశాల మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని విశ్లేష‌కులు ప్ర‌శ్నిస్తున్నారు.

S

Cricket | Published On Jan 7, 2026, 7.28 am IST

ICC Chairman Jay Shah | ఆడితే ఆడండి, లేక‌పోతే లేదు.. మ్యాచ్‌ల‌ను త‌ర‌లించ‌లేం.. తేల్చి చెప్పిన జైషా..?
Advertisement

ICC Chairman Jay Shah | ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2026 నుంచి కేకేఆర్ ప్లేయ‌ర్ ముస్తాఫిజుర్ ర‌హ‌మాన్‌ను రిలీజ్ చేయ‌డంతో వివాదం రాజుకున్న విష‌యం విదిత‌మే. బీసీసీఐ కార్య‌ద‌ర్శి దేవ‌జిత్ సైకియా ఈ విష‌యాన్ని మీడియాకు వెల్ల‌డించారు. అయితే ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ స‌మావేశం నిర్వహించ‌కుండానే సైకియా ఎవ‌రి ఆదేశాల మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని విశ్లేష‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రోవైపు ఈ విష‌యంపై సైకియా స్పందించ‌లేదు. కానీ ఈ మొత్తం వివాదం ప‌ట్ల అసంతృప్తిగా ఉన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) త్వ‌ర‌లో భార‌త్‌లో జ‌ర‌గ‌నున్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు గాను బంగ్లాదేశ్ ప్లేయర్ల‌ను పంపేది లేద‌ని, ఐసీసీ త‌మ వేదిక‌లను మార్చాల‌ని ఇప్ప‌టికే కోరింది. అయితే దీనిపై ఐసీసీ చైర్మ‌న్ జైషా ఆ దేశ క్రికెట్ బోర్డుతో ఇప్ప‌టికే మాట్లాడార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మంగ‌ళ‌వారం జైషా బీసీబీ అధికారుల‌కు ఫోన్ కాల్ చేశార‌ని, క‌చ్చితంగా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్‌లోనే మ్యాచ్‌ల‌ను ఆడాల్సి ఉంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలుస్తోంది.

మ్యాచ్‌లు ఆడ‌క‌పోతే ప్ర‌త్య‌ర్థుల‌కు పాయింట్లు..

ఐపీఎల్‌లో కోల్‌క‌తా జ‌ట్టు నుంచి బంగ్లాదేశ్ ప్లేయ‌ర్‌ను రిలీజ్ చేయ‌డం బీసీసీఐ తీసుకున్న నిర్ణ‌యం. ఐపీఎల్ అనేది బీసీసీఐకి సంబంధించిన లీగ్‌. దాంతో ఐసీసీకి సంబంధం లేదు. ఐపీఎల్‌ను సాకుగా చూపి భార‌త్‌లో మ్యాచ్‌ల‌ను ఆడలేమ‌ని చెప్ప‌డం అర్థ‌ర‌హితం. ఐపీఎల్ విష‌యంలో ఐసీసీ ఏమీ చేయ‌లేదు. అది మా ప‌రిధిలో లేదు. మేం ఐసీసీ రూల్స్‌ను పాటిస్తాం. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, ప్ర‌భుత్వం త‌మ ప్లేయర్ల‌ను భార‌త్‌కు పంప‌కపోతే ఓకే. వారు లేకుండానే మ్యాచ్‌ల‌ను నిర్వ‌హిస్తాం. వారు ఆడే మ్యాచ్‌లలో వారు ఉండ‌రు క‌నుక మ్యాచ్‌ల‌ను ఫోర్‌ఫీట్ అయిన‌ట్లు భావిస్తాం. దీని వ‌ల్ల బంగ్లాదేశ్ ఆడే మ్యాచ్‌ల‌లో ప్రత్య‌ర్థి జ‌ట్ల‌కు పాయింట్లు వ‌స్తాయి. లీగ్ ద‌శ త‌రువాత బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్ర‌మించిన‌ట్లు అవుతుంది. మేం ఐసీసీ రూల్స్ ప్ర‌కారం న‌డుచుకుంటాం.. అని ఐసీసీ చైర్మ‌న్ జైషా బీసీబీ అధికారులకు తెలిపిన‌ట్లు తెలుస్తోంది. దీనిపై ఆయ‌న వారికి ఫోన్ కాల్ కూడా చేశార‌ని స‌మాచారం. అయితే మ‌రోవైపు బీసీబీ మాత్రం దీన్ని ఖండిస్తోంది.

ఖండించిన బీసీబీ..

త‌మ‌కు ఐసీసీ నుంచి ఎలాంటి ఫోన్ కాల్ రాలేద‌ని, మీడియాలో ప్ర‌చారం అవుతున్న వార్త‌ల్లో నిజం లేద‌ని, ఐసీసీ ఈ విష‌యంపై త‌మ‌కు రాత‌పూర్వ‌కంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి నిర్ణ‌యాన్ని వెల్ల‌డించ‌లేద‌ని మ‌రోవైపు బీసీబీ అధికారులు తెలిపారు. అయితే విష‌యం బ‌య‌ట‌కు రాకుండా రాజీమార్గంలో వెళ్లాల‌ని బీసీబీ ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్‌ను తొల‌గించ‌డం ఆ లీగ్ సొంత విష‌య‌మ‌ని బీసీబీకి అర్థ‌మై ఉంటుంద‌ని, దాన్ని దృష్టిలో ఉంచుకుని టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌ను శ్రీ‌లంక‌కు మార్చాల‌ని కోర‌డం క‌రెక్ట్ కాద‌ని బీసీబీ అధికారులు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. క‌నుక ఈ విష‌యంపై ఐసీసీ సూచ‌న‌ల‌ను బీసీబీ ఇప్ప‌టికే సూచ‌న ప్రాయంగా అంగీక‌రించింద‌ని స‌మాచారం. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని ఆశిస్తున్నారు.

బంగ్లాదేశ్ మ్యాచ్‌లు ఇవే..

ఇక టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా లీగ్ ద‌శ‌లో బంగ్లాదేశ్ భార‌త్‌లో నాలుగు మ్యాచ్‌ల‌ను ఆడ‌నుంది. ఫిబ్ర‌వ‌రి 7వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే ఈ మెగా టోర్నీలో అదే రోజు వెస్టిండీస్‌తో బంగ్లాదేశ్ త‌న తొలి టీ20 లీగ్ మ్యాచ్‌ను ఆడ‌నుంది. ఆ త‌రువాత ఫిబ్ర‌వ‌రి 9వ తేదీన ఇట‌లీతో, ఫిబ్ర‌వ‌రి 14వ తేదీన ఇంగ్లండ్‌తో ఆడుతుంది. ఈ మ్యాచ్‌ల‌న్నీ కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో నిర్వ‌హిస్తారు. ఇక 4వ గ్రూప్ మ్యాచ్‌ను బంగ్లాదేశ్ ముంబైలో ఫిబ్ర‌వ‌రి 17వ తేదీన నేపాల్‌తో ఆడుతుంది. అయితే ఆ మ్యాచ్‌ల్లో గ‌న‌క బంగ్లాదేశ్ ఆడ‌క‌పోతే మ్యాచ్‌ల‌ను ఫోర్‌ఫీట్ అయిన‌ట్లు భావిస్తారు. దీంతో ఇత‌ర జట్ల‌ను విజేత‌లుగా ప్ర‌క‌టించి పాయింట్ల‌ను అందిస్తారు. ఈ క్ర‌మంలో బీసీబీ దీనిపై ఎలా స్పందిస్తుంది అని ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement