Hardik Pandya | పాక్‌తో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ధరించిన ఈ వాచ్‌ను చూశారా..? ధర ఎంతంటే..?
Hardik Pandya | టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్‌తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించగా, ఆ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ప్రదర్శనతో పాటు అతని చేతిపై మెరిసిన లగ్జరీ వాచ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Hardik Pandya | టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్‌తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించగా, ఆ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ప్రదర్శనతో పాటు అతని చేతిపై మెరిసిన లగ్జరీ వాచ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 61 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఆధిపత్యం స్పష్టంగా కనిపించగా, అభిమానుల దృష్టి ఒక్కసారిగా స్కోర్‌బోర్డ్ నుంచి పాండ్యా చేతి గడియారంపైకి మళ్లింది. స్కై బ్లూ జెర్సీకి సరిపడేలా ఆయన ధరించిన ఆ వాచ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా ధరించిన ఈ వాచ్, సాధారణ గడియారం కాదు. ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ వాచ్ బ్రాండ్ జేకబ్ అండ్ కో రూపొందించిన ఎపిక్ ఎక్స్ స్పోర్ట్ - రుద్ర ఎడిషన్ ను అతను ధరించాడు. ఈ గడియారం విలువ భారీగా ఉంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.
కేవలం 25 వాచ్‌లే..
హార్దిక్ పాండ్యా ధరించిన ఈ రుద్ర ఎడిషన్ ప్రపంచవ్యాప్తంగా కేవలం 25 వాచ్‌లకే పరిమితం కాగా, జేకబ్ అండ్ కో సంస్థలోని అత్యంత సన్నిహితులకు మాత్రమే ఈ వాచ్ అందుబాటులో ఉండడం దీని ప్రత్యేకత. 41 ఎంఎం గ్రేడ్-5 టైటానియం కేస్‌తో తయారైన ఈ వాచ్ కేవలం 11.5 ఎంఎం సన్నని డిజైన్‌ను కలిగి ఉంది. 50 మీటర్ల వాటర్ రెసిస్టెన్స్‌తో ఇది స్పోర్టీ అవసరాలకు అనుకూలంగా రూపొందించబడింది. ఇందులో జేకబ్ అండ్ కో ఇన్-హౌస్ ఆటోమేటిక్ క్యాలిబర్ JCHA01 మెకానిజం అమర్చారు. 4Hz వేగంతో పనిచేసే వాచ్ మూవ్మెంట్ 70 గంటల పవర్ రిజర్వ్‌ను అందిస్తుంది. బ్రాండ్‌కు ప్రత్యేకమైన ఎక్స్-షేప్ స్కెలిటనైజ్డ్ డిజైన్ దీనికి మరింత ప్రత్యేకతను ఇచ్చింది.
ఆధ్యాత్మిక టచ్..
ఈ వాచ్ డయల్‌పై శివుడి రుద్ర రూపానికి సంబంధించిన ప్రత్యేక కళాకృతులు చెక్కారు. ఓం గుర్తు, రుద్రాక్ష ప్రేరణతో చేసిన డిజైన్ ఎలిమెంట్స్, త్రిశూలం, ఢమరుకం ఆకృతులతో రూపొందించిన హ్యాండ్స్ అన్నీ ఈ వాచ్‌కు ఆధ్యాత్మికతను జోడించాయి. మహాశివరాత్రి రోజునే భారత్-పాక్ మ్యాచ్ జరగడం, అదే రోజున హార్దిక్ ఈ రుద్ర ఎడిషన్ వాచ్ ధరించడం అభిమానుల్లో మరింత ఆసక్తిని కలిగించింది. స్కై బ్లూ హనీకోంబ్ రబ్బర్ స్ట్రాప్‌తో టైటానియం డిప్లాయ్‌మెంట్ క్లాస్ప్ ఈ గడియారానికి స్పోర్టీ లుక్‌తోపాటు ప్రీమియం ఫినిష్ను అందించింది. ఇక ధర విషయానికి వస్తే, ఈ లగ్జరీ వాచ్ రిటైల్ ధర సుమారు 28 వేల డాలర్లు ఉండగా భారత కరెన్సీలో దాదాపు రూ.25.35 లక్షలకు సమానం. అత్యున్నత నాణ్యత గల టైటానియం నిర్మాణం, అత్యాధునిక స్కెలిటనైజ్డ్ మెకానిజం, ప్రపంచవ్యాప్తంగా కేవలం 25 యూనిట్లే ఉండడం, ఆధ్యాత్మిక డిజైన్ ఇవన్నీ ఈ గడియారాన్ని లగ్జరీ స్పోర్ట్స్ వాచ్‌లలో టాప్ కేటగిరీలో నిలబెట్టాయి.
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026

Hardik Pandya | గర్ల్‌ఫ్రెండ్‌తో హార్దిక్ పాండ్యా రెండో పెళ్లి.. డేట్ కూడా ఫిక్స్..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



