Chinnaswamy Stadium | చిన్నస్వామి స్టేడియంలో 11 సీట్లు ఎప్పటికీ ఖాళీగానే.. మృతులకు ఆర్‌సీబీ నివాళులు..
Chinnaswamy Stadium | ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తమ గత సీజన్ విజయోత్సవాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన అభిమానులను స్మరించుకునేందుకు ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగే అన్ని దేశీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లలో 11 సీట్లను శాశ్వతంగా ఖాళీగా ఉంచనున్నట్లు ఆర్‌సీబీ సీఈవో రాజేష్ మీనన్ తెలిపారు.
Chinnaswamy Stadium | ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తమ గత సీజన్ విజయోత్సవాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన అభిమానులను స్మరించుకునేందుకు ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగే అన్ని దేశీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లలో 11 సీట్లను శాశ్వతంగా ఖాళీగా ఉంచనున్నట్లు ఆర్‌సీబీ సీఈవో రాజేష్ మీనన్ తెలిపారు. అంతేకాకుండా ఈ సీజన్ మొత్తం ప్రాక్టీస్ మ్యాచ్‌లలో ఆటగాళ్లు జెర్సీ నంబర్ 11 ధరించనున్నారు. అలాగే ఈ సీజన్‌లో జరిగే అన్ని మ్యాచ్‌లలో నల్లని ఆర్మ్‌బ్యాండ్లు ధరించి మృతులకు నివాళులు అర్పించనున్నారు..
11 సీట్లను శాశ్వతంగా ఖాళీగా ఉంచుతాం..
జూన్ 4న తాము కోల్పోయిన 11 మంది అభిమానుల జ్ఞాపకార్థం ఆటగాళ్లు ప్రాక్టీస్ సమయంలో జెర్సీ నంబర్ 11 ధరిస్తారు. మ్యాచ్ రోజు, మ్యాచ్‌కు ముందు జరిగే ప్రాక్టీస్‌లో కూడా ప్రతి ఆటగాడి జెర్సీ వెనుక 11 నంబర్ ఉంటుంది. అయితే మ్యాచ్‌లో మాత్రం కాదు, ప్రాక్టీస్ సమయంలో మాత్రమే.. అని మీనన్ తెలిపారు. అదే విధంగా మ్యాచ్ రోజు ప్లేయర్లు నల్లని ఆర్మ్‌బ్యాండ్లు కూడా ధరిస్తారు. చిన్నస్వామి స్టేడియంలో శాశ్వతంగా 11 సీట్లను ఖాళీగా ఉంచే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నాం. ఈ 11 మంది అభిమానులు ఎప్పటికీ మనతోనే ఉంటారు. ఈ ఏడాది మేం తీసుకుంటున్న చర్యలపై ఇది ఒక తక్షణ అప్‌డేట్.. అని మంగళవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన పేర్కొన్నారు.
భద్రతా చర్యలను అమలు చేస్తాం..
ఈ సీజన్‌లో జాగ్రత్త చర్యలలో భాగంగా అనేక మార్పులు చేపట్టామని, భద్రతా చర్యలను కచ్చితంగా అమలు చేస్తున్నామని మీనన్ తెలిపారు. భవిష్యత్తులో బాధిత కుటుంబాలకు మరింత సహాయం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు కొనసాగుతున్నాయని కూడా వెల్లడించారు. గత సంవత్సరం జూన్ 4, 2025న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల ఆర్‌సీబీ విజయోత్సవాల సందర్భంగా భారీ తొక్కిసలాట జరిగింది. సుమారు 3 లక్షల మంది గుమిగూడడంతో తీవ్ర రద్దీ ఏర్పడి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు.
ఈ సీజన్‌లో 5 మ్యాచ్‌లు..
ఆ ఘటనకు సంబంధించి అవసరమైన అనుమతులు తీసుకోకపోవడం, గందరగోళ పరిస్థితులకు కారణమవడం వల్ల ఆర్‌సీబీ, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్, ఈవెంట్ భాగస్వాములపై కర్ణాటక ప్రభుత్వం బాధ్యతను మోపింది. అనంతరం మృతి చెందిన ప్రతి ఒక్కరి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ఫ్రాంచైజీ ప్రకటించింది. ఈ దుర్ఘటన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ ఎలాంటి మ్యాచ్‌లు నిర్వహించలేదు. ప్రస్తుతం ప్రభుత్వ అనుమతితో ఆర్‌సీబీ 5 మ్యాచ్‌లను చిన్నస్వామి స్టేడియంలో ఆడనుండగా, మరో 2 హోం మ్యాచ్‌లను రాయ్‌పూర్‌లో నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

DK Shivakumar | రాజీనామా చేస్తే.. క్షణం ఆలోచించకుండా ఆమోదిస్తా.. అసమ్మతి ఎమ్మెల్యేలకు డీకే స్ట్రాంగ్ వార్నింగ్
ఆగస్టు 4, 2026

IND Vs SL | బుమ్రా ఫిట్..! టీమిండియాకు ఊరట..
ఆగస్టు 2, 2026

Karnataka | తమిళనాడు-కర్నాటక మధ్య కావేరీ జలాల వివాదం.. డీకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం..
ఆగస్టు 2, 2026
తాజావార్తలు
- ●Gold Diamond Ring | పెండ్లి వేడుకలో బంగారు వజ్రాల ఉంగరం మాయం.. ఈవెంట్ మేనేజర్‌పై..
- ●ITBP Recruitment | ఐటీబీపీలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు.. సెకండ్ కమాండెంట్ హోదా..
- ●Horoscope | ఆగస్టు 5 రాశిఫలాలు.. ఈ రాశి వారు మాటతీరుతో లాభం పొందుతారు!
- ●Monsoon Train Journeys India | వానాకాలంలో ప్రకృతి ఒడిలో రైలు ప్రయాణం.. ఈ 7 రూట్లలో ఎప్పుడైనా వెళ్లారా?
- ●Weight Loss Journey | జిమ్ వద్దు, ఖర్చు వద్దు.. ఇంట్లోనే 8 నెలల్లో 20 కిలోలు తగ్గిన ముగ్గురు పిల్లల తల్లి
- ●Waking up at 3 am | రోజూ ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తోందా? మీ బాడీ ఇస్తున్న వార్నింగ్ ఇదే!

Gold Diamond Ring | పెండ్లి వేడుకలో బంగారు వజ్రాల ఉంగరం మాయం.. ఈవెంట్ మేనేజర్‌పై..

ITBP Recruitment | ఐటీబీపీలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు.. సెకండ్ కమాండెంట్ హోదా..

Horoscope | ఆగస్టు 5 రాశిఫలాలు.. ఈ రాశి వారు మాటతీరుతో లాభం పొందుతారు!

Monsoon Train Journeys India | వానాకాలంలో ప్రకృతి ఒడిలో రైలు ప్రయాణం.. ఈ 7 రూట్లలో ఎప్పుడైనా వెళ్లారా?



