Vaibhav Sooryavanshi | సూర్యవంశీ బ్యాంటింగ్.. చాగంటి కోటేశ్వర రావు కామెంట్రీ.. మీరూ చూసేయండి
Vaibhav Sooryavanshi | తనదైన బ్యాటింగ్‌తో ఐపీఎల్లో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) పరుగుల వరద పారిస్తున్నాడు. బౌలర్ ఎవరనేది లెక్కచేయకుండా సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు.
Vaibhav Sooryavanshi | త్రినేత్ర.న్యూస్: తనదైన బ్యాటింగ్‌తో ఐపీఎల్లో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) పరుగుల వరద పారిస్తున్నాడు. బౌలర్ ఎవరనేది లెక్కచేయకుండా సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. క్రీజ్‌లో అతడు పాతుకుపోయాడంటే ప్రత్యర్థి జట్టు మ్యాచ్‌పై ఆశలు వదులుకోవాల్సిందే అంటే అతిశయోక్తికాదు. అంతగా రెచ్చిపోతున్నాడు 15 ఏండ్ల చిచ్చరపిడుగు. ఈ నయా పరుగుల యత్రానికి ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు వ్యాఖ్యానం తోడైతే ఎలా ఉంటుంది?. అదే చేశాడో నెటిజన్..
ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్ తలపడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన విధ్వంస బ్యాటింగ్‌తో ఎస్ఆర్హెచ్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు రాబట్టాడు. సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో, స్టేడియంలో అతడి పోరాటాన్ని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు చెప్పిన 'అభిమన్యుడి యుద్ధం' ప్రసంగంతో పోల్చుతూ ఒక నెటిజన్ ఎడిట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైభవ్ అద్భుత ఇన్నింగ్స్‌కు చాగంటి మాటలు సరిగ్గా సింక్ అవ్వడంతో క్రికెట్ అభిమానులు ఈ వీడియోకు ఫిదా అవుతున్నారు.
వైభవ్ బ్యాటింగ్‌కు చాగంటి వాయిస్‌తో క్రేజీ ఎడిట్
ఐపీఎల్లో భాగంగా ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులతో విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో, స్టేడియంలో అతడి పోరాటాన్ని ప్రముఖ… pic.twitter.com/o2ztmY0XIC
— ChotaNews App (@ChotaNewsApp) May 29, 2026
చావో రేవో తేల్చుకునే ఆ మ్యాచ్‌లో 15 ఏండ్ల సూర్యవంశీ చెలరేగిపోయాడు. 29 బంతుల్లో 334.48 స్టైక్ రేట్‌తో 97 రన్స్ చేశాడు. అందులో 5 ఫోర్లు, 12 సిక్స్‌లు బాదాడు. వైభవ్ ధాటికి హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ 4 ఓవర్లలో 64 రన్స్ సమర్పించుకున్నాడు. మరోవైపు ఐపీఎల్ ఒక సీజన్లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడి యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (59)పేరున ఉన్న రికార్డును సూర్యవంశీ తుడిపేశాడు. ఇప్పటివరకు 61 సిక్సుల్ కొట్టిన వైభవ్ సూర్యవంశీ రికార్డును తన పేరున లిఖించుకున్నాడు.
సంబంధిత వార్తలు

X | ఎక్స్‌లో కొత్త ఫీచర్.. 18 నెలల ముందే పోస్టుల షెడ్యూలింగ్..
నవంబర్ 28, 2026

Mahesh Babu Instagram Comment | మహేశ్ బాబు ఒక్క కామెంట్.. ఓవర్‌నైట్ స్టార్ అయిన చిన్నారి!
నవంబర్ 25, 2026

Sky Road Pingtian Lake China | నీటిపై తేలుతున్న రహదారి.. మేఘాల్లో ప్రయాణిస్తున్న అనుభూతి! చైనా ‘స్కై రోడ్’ అద్భుత దృశ్యాలివే..!
నవంబర్ 23, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



