Abhishek Sharma | అభిషేక్ శర్మ చెత్త రికార్డ్.. టీ20ల్లో అత్యధికసార్లు డకౌట్
Abhishek Sharma | అభిషేక్ శర్మ (Abhishek Sharma) .. ఈ పేరు వినగానే వెంటనే గుర్తొచ్చేది హార్డ్ హిట్టింగ్. సిక్సర్ల మోతమోగించే ఈ సన్‌రైజర్స్ హైదరబాద్ (SRH) ఓపెనర్ తన బ్యాటింగ్‌తో ఎన్నో మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించాడు. అయితే అతనిపేర ఓ చెత్త రికార్డు ఉంది.
Abhishek Sharma | త్రినేత్ర.న్యూస్: అభిషేక్ శర్మ (Abhishek Sharma) .. ఈ పేరు వినగానే వెంటనే గుర్తొచ్చేది హార్డ్ హిట్టింగ్. సిక్సర్ల మోతమోగించే ఈ సన్‌రైజర్స్ హైదరబాద్ (SRH) ఓపెనర్ తన బ్యాటింగ్‌తో ఎన్నో మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించాడు. అయితే అతనిపేర ఓ చెత్త రికార్డు ఉంది. ఒక క్యాలండర్ ఇయర్‌లో టీ20ల్లో అత్యధికసార్లు డకౌటైన (Duck out) బ్యాటర్‌గా తన పేరుపై ఉన్న చెత్త రికార్డ్‌ను మరింత మెరుగుపర్చుకున్నాడు.
బుధవారం ఐపీఎల్ ఎలిమినేటర్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు బంతులు ఆడిన అభిషేక్ ఒక్క పరుగు చేయకుండానే అయ్యాడు. దీంతో ఈ ఏడాది అతడకి టీ20ల్లో డకౌట్ అవ్వడం ఇది ఎనిమిదోసారి. ఈ జాబితాలో రోహిత్ శర్మ, సంజు శాంసన్ అతని తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
టీ20ల్లో అత్యధికసార్లు డకౌటైన భారత బ్యాటర్లు
8 - అభిషేక్ శర్మ, 2026లో (28 ఇన్నింగ్స్‌లు)*
6 - రోహిత్ శర్మ, 2018లో (32 ఇన్నింగ్స్‌లు)
6 - సంజు శాంసన్, 2024లో (32 ఇన్నింగ్స్‌లు)
2️⃣ early wickets, 1️⃣ signature celebration 🫶
Updates ▶️ https://t.co/OBIYYIuhbt #TATAIPL | #Eliminator | #TheFinalLeap | #SRHvRR pic.twitter.com/PdzGUqHPz5
— IndianPremierLeague (@IPL) May 27, 2026
మ్యాచ్ విషయానికొస్తే..
చండీగఢ్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఎస్ఆర్హెచ్కు రాజస్థాన్ (RR) షాకిచ్చింది. వైభవ్ మెరుపులకు ఆర్చర్ బౌలింగ్ తోడవడంతో 47 పరుగుల తేడాతో విజయం సాధించి ఆర్ఆర్ క్వాలిఫయర్ 2కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 8 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. ఛేదనలో సన్‌రైజర్స్ 19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది.
వైభవ్ (97 పరుగులు, 29 బంతుల్లో) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతడి తర్వాత ధ్రువ్ జురెల్ (50 పరుగులు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (29 పరుగులు), రియాన్ పరాగ్ (26 పరుగులు) ఫర్వాలేదనిపించారు. భారీ ఛేదనలో సన్‌రైజర్స్‌కు రెండో బంతికే పెద్ద దెబ్బ తగిలింది. తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అభిషేక్ తర్వాతి బాల్‌కే కీపర్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుతిరిగాడు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ (11 బంతుల్లో 33 పరుగులు) వేగంగా ఆడే ప్రయత్నంలో ఆర్చర్‌కు తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఒకరి తర్వాత మరొకరు స్వల్ప స్కోర్లకే ఔటవడంతో హైదరాబాద్ ఓటమి ఖరారయింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Horoscope | మే 28 రాశిఫలాలు.. అపరిష్కృత పనులు ముందుకు రావచ్చు!
- ●US Iran Draft Deal | అమెరికాతో డీల్ కుదిరిందన్న ఇరాన్.. అదంతా 'ఫేక్' అని తేల్చేసిన వైట్‌హౌస్.. అసలేం జరుగుతోంది?
- ●Telangana Employees JAC | బదిలీల ప్రక్రియలో అధికారుల ఇష్టారాజ్యం.. నిబంధనలు గాలికి.. సీఎంకు ఫిర్యాదు చేస్తామన్న జేఏసీ
- ●T-Fiber Telangana | పల్లె పల్లెకూ టీ-ఫైబర్: ప్రతి ఇంటికీ హై-స్పీడ్ ఇంటర్నెట్.. ప్రాజెక్టు అమలుపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ కీలక చర్చలు
- ●Feroz Khan vs Osman Hajri | గాంధీభవన్‌లో రణరంగం: కుర్చీ కోసం కాలర్లు పట్టుకున్న కాంగ్రెస్ నేతలు.. కిందపడ్డ ఫిరోజ్ ఖాన్
- ●Telangana Soaked Paddy Procurement | తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం.. రైతాంగం ఆందోళన చెందొద్దు : మంత్రి ఉత్తమ్ హామీ

Horoscope | మే 28 రాశిఫలాలు.. అపరిష్కృత పనులు ముందుకు రావచ్చు!

US Iran Draft Deal | అమెరికాతో డీల్ కుదిరిందన్న ఇరాన్.. అదంతా 'ఫేక్' అని తేల్చేసిన వైట్‌హౌస్.. అసలేం జరుగుతోంది?

Telangana Employees JAC | బదిలీల ప్రక్రియలో అధికారుల ఇష్టారాజ్యం.. నిబంధనలు గాలికి.. సీఎంకు ఫిర్యాదు చేస్తామన్న జేఏసీ

T-Fiber Telangana | పల్లె పల్లెకూ టీ-ఫైబర్: ప్రతి ఇంటికీ హై-స్పీడ్ ఇంటర్నెట్.. ప్రాజెక్టు అమలుపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ కీలక చర్చలు






