త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nifty 50 | నిఫ్టీ 50 పైపైకి.. 27వేల మార్కుకు చేరుతుందా..?

Nifty 50 | అమెరికాతో ట్రేడ్ డీల్‌పై స్ప‌ష్ట‌త వ‌చ్చిన నేప‌థ్యంలో అటు ఆ దేశ మార్కెట్ల‌తోపాటు ఇటు భార‌త స్టాక్ మార్కెట్లు కూడా ఈ వారం పాజిటివ్‌గానే ఉన్నాయి. మార్కెట్‌లో మూమెంటం సూచిక‌లు అనుకూలంగా ఉండ‌డం, కీల‌క మూవింగ్ యావ‌రేజ్‌లు ఎగువ‌కు క‌దులుతుండ‌డం, వోల‌టిలిటీ ఇండెక్స్ (VIX) కూడా త‌గ్గ‌డంతో మార్కెట్ ప్ర‌స్తుతం బుల్స్‌కు అనుకూలంగా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

S

Business | Published On Feb 11, 2026, 8.41 am IST

Nifty 50 | నిఫ్టీ 50 పైపైకి.. 27వేల మార్కుకు చేరుతుందా..?
Advertisement

Nifty 50 | అమెరికాతో ట్రేడ్ డీల్‌పై స్ప‌ష్ట‌త వ‌చ్చిన నేప‌థ్యంలో అటు ఆ దేశ మార్కెట్ల‌తోపాటు ఇటు భార‌త స్టాక్ మార్కెట్లు కూడా ఈ వారం పాజిటివ్‌గానే ఉన్నాయి. మార్కెట్‌లో మూమెంటం సూచిక‌లు అనుకూలంగా ఉండ‌డం, కీల‌క మూవింగ్ యావ‌రేజ్‌లు ఎగువ‌కు క‌దులుతుండ‌డం, వోల‌టిలిటీ ఇండెక్స్ (VIX) కూడా త‌గ్గ‌డంతో మార్కెట్ ప్ర‌స్తుతం బుల్స్‌కు అనుకూలంగా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో నిఫ్టీ 50 రానున్న రోజుల్లో 26వేల స్థాయిని టెస్ట్ చేస్తుంద‌ని అంటున్నారు. 26వేల స్థాయిపై నిఫ్టీ 50 కొద్ది రోజుల పాటు నిలక‌డ‌గా ఉంటే 26,500 నుంచి 27వేల‌కు సైతం చేరుకునే అవ‌కాశాలు బ‌లంగా ఉంటాయ‌ని చెబుతున్నారు. క‌నుక 26వేల లెవ‌ల్ అన్న‌ది ఈ రోజుల్లో కీల‌కంగా మారే అవ‌కాశం ఉంద‌ని విశ్లేషిస్తున్నారు.

వ‌చ్చే 10 సెష‌న్లు కీలకం..

ఫిబ్రవరి 10న నిఫ్టీ 50 68 పాయింట్లు (0.26 శాతం) లాభపడి 25,935 వద్ద ముగిసింది. అదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 43 పాయింట్లు తగ్గి 60,626 వద్ద స్థిరపడింది. మార్కెట్ మాత్రం బుల్స్ ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది. NSEలో 1,826 షేర్లు లాభాల్లో ఉండ‌గా, 1,100 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఈ సంద‌ర్భంగా నిఫ్టీ అంచ‌నాల‌పై వేవ్స్ స్ట్రాటజీ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు అశిష్ క్యాల్ మాట్లాడుతూ నిఫ్టీ ఒకే దిశ‌లో బ‌లంగా క‌దిలే అవ‌కాశం ఉంద‌న్నారు. అది కూడా ప్ర‌స్తుతం మార్కెట్ ఉన్న స్థితిని బ‌ట్టి చూస్తే బుల్స్‌కు ఎక్కువ చాన్స్ ఉంద‌న్నారు. క‌నుక నిఫ్టీ వ‌చ్చే వారం లేదా ప‌ది ట్రేడింగ్ సెష‌న్‌ల‌లో 26,500 నుంచి 27వేలకు చేరినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం అన్ని కంపెనీల‌కు చెందిన ఫ‌లితాల సీజ‌న్ కూడా న‌డుస్తున్నందున స్టాక్ స్పెసిఫిక్ క‌ద‌లిక‌లే అధికంగా ఉంటాయ‌ని అన్నారు. తాజాగా ఎస్‌బీఐ కూడా ఆశించిన దాని క‌న్నా రికార్డు స్థాయిలో లాభాల‌ను పొంద‌డం మార్కెట్‌కు క‌ల‌సి వ‌చ్చే అంశంగా చెప్పారు.

భ‌యాందోళ‌న‌లు త‌గ్గిన‌ట్లే..

ఇండియా VIX కూడా గ‌త కొద్ది రోజులుగా 4 శాతం త‌గ్గింద‌ని, అందువ‌ల్ల మార్కెట్‌పై ఉన్న భయాందోళ‌న‌ల‌ను త‌గ్గిన‌ట్లు భావించ‌వ‌చ్చ‌ని తెలిపారు. ఇక నిఫ్టీ 50 ఇంట్రాడేలో నెగెటివ్ సంకేతాల‌ను ఇవ్వ‌డం లేద‌ని, ఇది పాజిటివ్ దృక్ప‌థం అని అన్నారు. అయితే నిఫ్టీ 50 ప్ర‌స్తుతం 26,060 వ‌ద్ద రెసిస్టెన్స్‌ను ఎదుర్కొనే చాన్స్ ఉంద‌ని, అది దాటితే 26,200కు చేరుతుంద‌ని తెలిపారు. అలాగే 25,728 వ‌ద్ద స‌పోర్ట్ ఉందని స్ప‌ష్టం చేశారు. అయితే ప్ర‌స్తుతం నెగెటివ్ సంకేతాలు ఏమీ లేనందున మార్కెట్‌కు అది కూడా ఒక పాజిటివ్ సంకేతం అవుతుంద‌ని, అందువ‌ల్ల వ‌చ్చే ట్రేడింగ్ సెష‌న్ల‌లో నిఫ్టీ 50 బుల్ ర‌న్ సాధ్య‌మేన‌ని స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement