Stock Markets | వచ్చే వారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఎలా ఉండనున్నాయి..? రికవర్ అవుతాయా..?
Stock Markets | మధ్య ప్రాచ్యంలో నెలకొన్న యుద్ధం కారణంగా గత 5 ట్రేడింగ్ సెషన్లలోనూ వరుసగా దేశీయ స్టాక్ మార్కెట్లు పతనం అవుతూనే ఉన్నాయి. అయితే శుక్రవారం గుడ్ ఫ్రైడే కావడంతో మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో గత వారం ట్రేడింగ్ సెషన్ గురువారంతోనే ముగిసింది. ఆ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అయ్యాయి.
Stock Markets | మధ్య ప్రాచ్యంలో నెలకొన్న యుద్ధం కారణంగా గత 5 ట్రేడింగ్ సెషన్లలోనూ వరుసగా దేశీయ స్టాక్ మార్కెట్లు పతనం అవుతూనే ఉన్నాయి. అయితే శుక్రవారం గుడ్ ఫ్రైడే కావడంతో మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో గత వారం ట్రేడింగ్ సెషన్ గురువారంతోనే ముగిసింది. ఆ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అయ్యాయి. కానీ లార్జ్ క్యాప్‌కు చెందిన పలు స్టాక్స్ తక్కువ ధరలకు ఆకర్షణీయంగా కనిపించడంతో పెట్టుబడిదారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపించారు. దీంతో మార్కెట్లు మధ్యాహ్నం తరువాత పుంజుకుని బుల్ ర్యాలీని కొనసాగించాయి. ఇంట్రా డే పతనం అనంతరం మార్కెట్లు పూర్తిగా రికవర్ అయి స్వల్ప లాభాల్లో ముగిశాయి. అయితే వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గురువారం సెషన్‌లో మార్కెట్లు భారీగా రికవర్ అయ్యాయి కనుక వచ్చే వారం మార్కెట్లు పాజిటివ్‌గా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. కానీ ప్రస్తుత మార్కెట్లు మాత్రం అంతర్జాతీయ పరిణామాలు, వార్తలకు వేగంగా స్పందిస్తున్నాయి.
వచ్చే 24-48 గంటలు కీలకం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు విధించిన డెడ్‌లైన్ ముగుస్తున్న నేపథ్యంలో ఆయన తాజాగా పలు మార్లు మళ్లీ హెచ్చరికలను జారీ చేశారు. హోర్ముజ్ జలసంధిని తెరవడంతోపాటు తాను ప్రతిపాదించిన రూల్స్‌కు ఇరాన్ అంగీకరించి తీరాల్సిందేనని, సమయం మించిపోతుందని, ఇరాన్ ఒప్పుకోకపోతే నరకం అంటే ఏమిటో చూపిస్తామని ట్రంప్ వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఇరాన్ మాత్రం నరక ద్వారాలను తెరిచి ఉంచామని, ట్రంప్ హెచ్చరికలకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. మరోవైపు ఇరాన్ వైపు లాంగ్ రేంజ్ క్షిపణులను ప్రయోగించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. అలాగే ఇజ్రాయెల్ సైతం ఇరాన్‌లోని ముఖ్యమైన పవర్ ప్లాంట్లను ధ్వంసం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. దీంతో వచ్చే 24-48 గంటలు దేశీయ స్టాక్ మార్కెట్లకే కాదు, అంతర్జాతీయ మార్కెట్లకు కూడా కీలకంగా మారాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో ఏం జరుగుతుందోనని మార్కెట్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. అందువల్ల మార్కెట్లు వోలటైల్‌గా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు రికవర్ అయ్యేనా..
వచ్చే వారం స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు తప్పవని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు ఇంకా తీవ్రమవుతున్న నేపథ్యంలో మార్కెట్లలో ప్రస్తుతం స్థిరత్వం వచ్చే అవకాశం లేదని, భారీగా పతనం తరువాత కొన్ని రకాల స్టాక్స్ పెట్టుబడిదారులను ఆకర్షిస్తాయని, దీంతో సహజంగానే కొనుగోళ్లు భారీ ఎత్తున పెరుగుతాయని, అయితే దీన్ని అనుసరించి తరువాత సెషన్లలోనూ మార్కెట్లు బుల్ ర్యాలీని కొనసాగిస్తాయని చెప్పలేమని అంటున్నారు. అందువల్ల యుద్ధం ముగిసిందన్న వార్త వస్తే తప్ప మార్కెట్లు కోలుకునే పరిస్థితి లేదంటున్నారు. అయితే దేశీయ స్టాక్ మార్కెట్లపై మాత్రం ఇంకా ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంటుందన్నారు. ఎందుకంటే భారత్ అధిక భాగం చమురును దిగుమతి చేసుకుంటుంది కనుక పెరుగుతున్న చమురు ధరల ప్రభావం మార్కెట్లపై నెగిటివ్‌గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే డాలర్ బలపడడం, రూపాయి విలువ తగ్గడం, విదేశీ పెట్టుబడిదారులు భారీ ఎత్తున కొనుగోళ్లు చేపడుతుండడం వంటివన్నీ దేశీయ మార్కెట్ల ప్రగతికి ప్రతికూలంగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. అందువల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం రికవర్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నిఫ్టీ50, సెన్సెక్స్ కీలక లెవల్స్ ఇవే..
ఇక నిఫ్టీ50 విషయానికి వస్తే ప్రస్తుతం ఈ సూచీ 22,700 వద్ద స్థిరంగా ఉండేందుకు యత్నిస్తుండగా 22,300 కిందకు బ్రేక్ అయితే మాత్రం మరింత పతనం అయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే 22,000 నుంచి 21,800 జోన్ కీలకంగా మారి సపోర్ట్‌గా ఉంటుందన్నారు. ఇక మీదకు వెళితే 22,800 నుంచి 23,000 మధ్య రెసిస్టెన్స్ ఉందని, సూచీ ర్యాలీ కొనసాగించాలంటే ఈ లెవల్‌ను దాటాల్సి ఉంటుందని తెలిపారు. తరువాత మళ్లీ 23,200 నుంచి 23,500 మధ్య స్ట్రాంగ్ సప్లై జోన్ ఉందని అన్నారు. ర్యాలీ కొనసాగాలంటే ఈ లెవల్‌ను కూడా దాటాల్సి ఉంటుందని అన్నారు. ఇక సెన్సెక్స్ ప్రస్తుతం 73,300 జోన్ వద్ద కొనసాగుతుండగా, 73,800 నుంచి 74,000 మధ్య రెసిస్టెన్స్‌ను ఎదుర్కొంటోంది. ర్యాలీ కొనసాగాలంటే ఈ లెవల్‌ను దాటాలి. తరువాత 75,000 వద్ద రెసిస్టెన్స్ ఉంటుంది. కిందకు వెళితే 72,000 దిగువన మరింత పతనం అయ్యే చాన్స్ ఉంది. అదే జరిగితే 71,500 నుంచి 71,000 మధ్య కీలక సపోర్ట్ ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటుండగా, వచ్చే వారం సూచీలు తీవ్రంగా వోలటైల్‌గా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



