Silver Price Crash | మూడు రోజుల్లో లక్షకు పైగా హాంఫట్.. వెండి ధరలు ఢమాల్
గత నెలలో ఒకేసారి ఆకాశానికి ఎగబాకిన వెండి ధరలు, ప్రస్తుతం భారీ కరెక్షన్‌కి (Correction) గురవుతున్నాయి. రానున్న రోజుల్లో మార్కెట్ స్థిరపడే వరకు ఈ హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉంది.
- అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ పతనం
- వెండి ధరల భారీ కరెక్షన్‌కి కారణాలేంటి?
Silver Price Crash | 29 జనవరి 2026, గురువారం.. వెండిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు పండగ రోజు అనే చెప్పుకోవాలి. ఆరోజు ఆల్ టైమ్ హైని వెండి టచ్ చేసి కమోడిటీ మార్కెట్‌లో సరికొత్త రికార్డును సృష్టించింది. కిలో వెండి రూ.4,20,000 మార్క్‌ని క్రాస్ చేసింది. ఆ తర్వాత కూడా ఇంకా పెరుగుతుందని ఆశపడిన చాలామంది వెండి మీద భారీగా ఇన్వెస్ట్ చేశారు. తీరా చూస్తే, 30 జనవరి నుంచి వెండి ఢమాల్‌మన్నది. ధరలు తగ్గుముఖం పట్టడమే కాదు.. కేవలం మూడు రోజుల్లోనే లక్షకు పైగా తగ్గడంతో ఇన్వెస్టర్లు బోరుమంటున్నారు. భారత కమోడిటీ మార్కెట్‌లో ప్రస్తుతం వెండి రూ.2.5 లక్షల వద్ద తచ్చాడుతోంది. వెండిలో భారీ హెచ్చుతగ్గులు అనేది ఇప్పుడే కొత్త కాదు. వెండి మార్కెట్‌లో చార్ట్స్ ప్యాటర్న్స్‌ని చదవలగలిగిన వాళ్లు వెండిలో ఇన్వెస్ట్ చేయాలంటే ఆచీతూచీ అడుగేస్తారు. కానీ.. సోషల్ మీడియాలో వచ్చిన హైప్ వల్ల చాలామంది సామాన్య ప్రజలు కూడా వెండిలో పెట్టుబడులు ప్రారంభించి చివరకు భారీగా నష్టపోవాల్సి వచ్చింది.
భారీ హెచ్చుతగ్గులకు కారణాలేంటి?
వెండి ధరల్లో భారీ హెచ్చుతగ్గులకు ప్రధాన కారణాలేంటి అనేది విశ్లేషిస్తే అందరి చూపు ట్రంప్ పైనే పడుతోంది. ట్రంప్‌తో పాటు చాలా విషయాలను ఈ హెచ్చుతగ్గుల విషయంలో పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.జనవరి 30న ఫెడ్ చైర్మన్‌గా కెవిన్ వార్ష్‌ని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నామినేట్ చేయగానే ఆల్ టైమ్ హైలో ఉన్న వెండి ధరలు కాస్త క్రాష్ అయ్యాయి. వెండితో పాటు బంగారం ధరలు కూడా తగ్గుతూ వచ్చినా.. ఒకానొకదశలో బంగారం ధరలు భారీ హెచ్చుతగ్గులకు గురి కాకుండా నిలదొక్కుకోగలిగాయి. కానీ, వెండి ధరలు మాత్రం ఢమాల్‌న పడిపోయాయి. దీంతో వెండిపై మాత్రమే ఇన్వెస్ట్ చేసిన వాళ్లు గగ్గోలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ కమోడిటీ మార్కెట్‌ని ఫాలో అయ్యే మన భారత మార్కెట్లు వాటితో పాటు క్రాష్ అవుతూ వచ్చాయి.
మూడు భయాలు
రాజకీయ, రెగ్యులేటరీ, ఆర్థిక అంశాలే కమోడిటీ మార్కెట్‌ని సందిగ్ధంలో పడేసినట్లుగా తెలుస్తోంది. భౌగోళిక రాజకీయ టెన్షన్లు, అంతర్జాతీయంగా రూపాయి విలువ బలహీనపడటం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ అంశాలు వెండి క్రాష్‌కి ఆజ్యం పోసినట్లయింది.
జనవరి 30న 30 శాతం క్రాష్
జనవరి 30న ఒకేరోజు వెండి 30 శాతం వరకు పడిపోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్‌గా కెవిన్ వార్ష్‌ని ట్రంప్ నామినేట్ చేసిన రోజే అది. ఆయన కఠినమైన ఆర్థిక విధానాలను అనుసరిస్తారనే భయాందోళనతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు వెండిని భారీగా విక్రయించారు.
కేంద్ర బడ్జెట్ 2026 ప్రభావం
భారత్‌లో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కూడా వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపించింది. బడ్జెట్ ప్రకటన తర్వాత మార్కెట్‌లో తీవ్ర అనిశ్చితి నెలకొనడంతో పాటు ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగింది. దీంతో జనవరి 29న కిలోకి రూ.4,20,000 వరకు వెళ్లిన వెండి ధరలు ఫిబ్రవరి 2 న రూ.3,00,000కి దిగి వచ్చింది.
అమెరికా డాలర్ బలోపేతం
అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా డాలర్ విలువ పెరగడం వల్ల కూడా వెండి ధరలు తగ్గాయి. డాలర్ విలువ పెరిగితే, ఇతర కరెన్సీలలో వెండి కొనుగోలు చేయడం ఖరీదవుతుంది. అందుకే డిమాండ్ తగ్గి ధరలు తగ్గాయి.
పెరిగిన మార్జిన్ పరిమితులు
ప్రపంచంలోనే అతి పెద్ద ఎక్స్ఛేంజ్ సీఎంఈ గ్రూప్ వెండి ట్రేడింగ్‌పై మార్జిన్ రిక్వైర్‌మెంట్స్‌ని పెంచింది. దీనివల్ల ట్రేడర్లు తమ వద్ద ఉన్న వెండిని తక్కువ ధరకే విక్రయించాల్సి వచ్చింది. దీంతో మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది.
భౌగోళిక ఉద్రిక్తతలు
ఇటీవల భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో వెండి ధరలు భారీగా పెరిగాయి. భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగితే సేఫ్ హెవెన్‌గా ఉన్న బంగారం, వెండి మీద పెట్టుబడులు పెరుగుతాయి. ఇరాన్, యూఎస్ మధ్య ఉన్న యుద్ధ భయాలు కూడా తగ్గుముఖం పట్టడం, ఆయా దేశాలు చర్చల దిశగా అడుగులు వేస్తుండటంతో వెండి మీద పెట్టుబడులు తగ్గించి ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ల వైపు మొగ్గు చూపడం కూడా వెండి క్రాష్‌కి మరో ప్రధాన కారణంగా తెలుస్తోంది.
మొత్తంగా, గత నెలలో ఒకేసారి ఆకాశానికి ఎగబాకిన వెండి ధరలు, ప్రస్తుతం భారీ కరెక్షన్‌కి (Correction) గురవుతున్నాయి. రానున్న రోజుల్లో మార్కెట్ స్థిరపడే వరకు ఈ హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Gold And Silver Prices Today | కమోడిటీ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. పెట్టుబడిదారుల్లో సందిగ్ధత..
మే 20, 2026

Gold And Silver Prices Today | దిగి వస్తున్న బంగారం ధరలు.. పెట్టుబడిదారుల చూపు ఎటు..?
మే 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



