Form 39 | ఫామ్ 39 అంటే ఏమిటి..? దీంతో ఎలాంటి లాభాలు ఉంటాయి..? ఎలా సమర్పించాలి..?
Form 39 | ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్‌మెంట్ అందుకోవడానికి ఉద్యోగులకు చాలా సందర్భాల్లో వారాలు లేదా నెలలు పట్టడం సాధారణం. అయితే ఈ చెల్లింపు తదుపరి ఫైనాన్షియల్ ఇయర్‌లోకి వెళ్తే మొత్తం ఒకేసారి అందడం వల్ల ఆ సంవత్సరంలో ట్యాక్స్ లయబిలిటీ గణనీయంగా పెరిగే ప్రమాదం ఉంటుంది.
Form 39 | ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్‌మెంట్ అందుకోవడానికి ఉద్యోగులకు చాలా సందర్భాల్లో వారాలు లేదా నెలలు పట్టడం సాధారణం. అయితే ఈ చెల్లింపు తదుపరి ఫైనాన్షియల్ ఇయర్‌లోకి వెళ్తే మొత్తం ఒకేసారి అందడం వల్ల ఆ సంవత్సరంలో ట్యాక్స్ లయబిలిటీ గణనీయంగా పెరిగే ప్రమాదం ఉంటుంది. దీంతో ట్యాక్స్‌పేయర్ ఎక్కువ ట్యాక్స్ శ్లాబ్‌లోకి వెళ్లి అధిక పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్తగా ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025లో ఫామ్ 39 ని ప్రవేశపెట్టింది. ఇది ప్రస్తుత ఫాం 10ఈ స్థానాన్ని భర్తీ చేస్తుంది. ఈ ఫామ్ ఫైనాన్షియల్ ఇయర్ 2026-27 నుండి (అసెస్‌మెంట్ ఇయర్ 2027-28 నుంచి) అమల్లోకి రానుంది.
ఒకేసారి వచ్చే ఆదాయంపై పన్ను రిలీఫ్ పొందేందుకు..
ఫాం 9 అనేది ఉద్యోగ విరమణ తర్వాత ఒకేసారి అందే అదనపు ఆదాయంపై ట్యాక్స్ రిలీఫ్ పొందేందుకు తప్పనిసరిగా సమర్పించాల్సిన పత్రం. ఇందులో జీతం అరియర్స్, అడ్వాన్స్ శాలరీ, గ్రాట్యుటీ లేదా పెన్షన్ వంటి మొత్తాలు ఉంటాయి. ఈ ఫాం ద్వారా ఆ ఆదాయాన్ని అది సంబంధించిన సంవత్సరాలకు విభజించి పన్ను లెక్కించుకునే అవకాశం లభిస్తుంది. దీని వల్ల ఒకే సంవత్సరంలో అధిక ఆదాయం కారణంగా ట్యాక్స్ పెరగకుండా నియంత్రించవచ్చు. ఈ ఫాం ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025లోని సెక్షన్ 157(1) కింద అమల్లో ఉంటుంది. ఇది ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోని సెక్షన్ 89(1) స్థానాన్ని భర్తీ చేస్తుంది. ట్యాక్స్‌పేయర్లు ఈ ప్రయోజనాన్ని పొందాలంటే తమ ఐటీఆర్ దాఖలు చేసే ముందు ఫాం 39 ని సమర్పించాలి.
అధిక పన్నును నివారించవచ్చు..
ఫాం 39 ప్రధానంగా ఒకే సంవత్సరంలో పొందిన మొత్తం కాకుండా అంతకు ముందు సంవత్సరాల్లో వచ్చిన ఆదాయంపై పన్ను తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో అరియర్స్, ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ, రిట్రెంచ్‌మెంట్ కాంపెన్సేషన్ లేదా పెన్షన్ కమ్యూటేషన్ వంటి అంశాలు ఉంటాయి. ఈ ఫాం ద్వారా ఆదాయం అందిన సమయ భేదం వల్ల అధిక పన్ను విధించకుండా నివారించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, సంస్థలతో అనుబంధం ఉన్న వ్యక్తులు అందరూ ఈ ఫామ్‌ను తమ ఎంప్లాయర్ లేదా టీడీఎస్ డిడక్టర్‌కు సమర్పించి టీడీఎస్ సర్దుబాటు పొందవచ్చు. పాత ఫాం 10ఈతో పోలిస్తే ఫాం 39 మరింత సిస్టమాటిక్ గా, టెక్నాలజీ ఆధారితంగా నిర్మాణమైంది. ఇందులో ట్యాక్స్‌పేయర్ వివరాలు ఆటోమేటిక్‌గా పూరించబడే విధానం ఉండటం వల్ల మాన్యువల్ ఎంట్రీ తప్పులు తగ్గుతాయి.
సులభంగా ఫైలింగ్ ప్రక్రియ..
ఇది రియల్‌టైమ్ వాలిడేషన్, సిస్టమ్ ఆధారిత వెరిఫికేషన్, ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ చెక్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. డ్రాప్‌డౌన్ మెనూలు, డేట్ పికర్స్, చెక్‌బాక్స్ కన్ఫర్మేషన్లు వంటి యూజర్ ఫ్రెండ్లీ అంశాలు ఫైలింగ్ ప్రక్రియను సులభతరం చేస్తాయి. అలాగే పార్ట్ ఎ, బి, సి గా విభజించిన నిర్మిత ఫార్మాట్ వల్ల డూప్లికేషన్‌ను తగ్గించి వేగవంతమైన, కచ్చితమైన ప్రాసెసింగ్‌కు సహాయం చేస్తుంది. ట్యాక్స్ రిలీఫ్ పొందేందుకు ముందుగా ప్రస్తుత సంవత్సరంలో అరియర్స్ కలిపి చెల్లించాల్సిన పన్ను, అరియర్స్ లేకుండా చెల్లించాల్సిన పన్ను మధ్య తేడాను లెక్కించాలి. తరువాత ఆ అరియర్స్ సంబంధిత సంవత్సరాల్లో పన్ను ఎలా ఉండేదో లెక్కించి పోల్చాలి. ఫాం 39ను ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఐటీఆర్ సమర్పణకు ముందు దాఖలు చేయాలి. ఆటోమేషన్ ఫీచర్లు లెక్కల్లో పొరపాట్లు తగ్గించి, సరైన ట్యాక్స్ రిలీఫ్ లెక్కించేందుకు సహాయపడతాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Karnataka | లారీని ఢీకొట్టిన మినీ ట్రక్కు.. ఏడుగురు దుర్మరణం
- ●Musi | మూసీ రివర్‌ఫ్రంట్‌కు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతి.. మొదటి దశలో 21 కి.మీ పనులు
- ●Goat Milk | పిల్లలకు మేకపాలు మంచివేనా? వైద్యుల కీలక హెచ్చరిక..
- ●Earthquake | నాందేడ్‌లో స్వల్ప భూప్రకంపనలు.. తెలంగాణలోని ఆ జిల్లాల్లో కంపించిన భూమి
- ●Chabahar Port | భారత్‌కు షాక్.. ఇరాన్‌లోని చాబహార్ పోర్టుపై అమెరికా దాడులు
- ●Deepika Padukone | లగ్జరీలకే లక్షల్లో ఖర్చులు - కల్కి 2 నుంచి దీపికా పడుకోణ్ తప్పుకోవడంపై టాలీవుడ్ ప్రొడ్యూసర్ కామెంట్స్

Karnataka | లారీని ఢీకొట్టిన మినీ ట్రక్కు.. ఏడుగురు దుర్మరణం

Musi | మూసీ రివర్‌ఫ్రంట్‌కు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతి.. మొదటి దశలో 21 కి.మీ పనులు

Goat Milk | పిల్లలకు మేకపాలు మంచివేనా? వైద్యుల కీలక హెచ్చరిక..

Earthquake | నాందేడ్‌లో స్వల్ప భూప్రకంపనలు.. తెలంగాణలోని ఆ జిల్లాల్లో కంపించిన భూమి






