US Stock Markets | భారీగా పతనమైన అమెరికన్ స్టాక్ మార్కెట్లు.. కారణాలు ఇవే..
US Stock Markets | అమెరికా స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా పతనం అయ్యాయి. ఏఐ సంబంధిత ఆందోళనలు, టారిఫ్ విధానాలపై గందరగోళం నెలకొనడంతో వాల్ స్ట్రీట్ సూచీలు నష్టపోయాయి. సోమవారం నాటి మార్కెట్ సెషన్‌లో డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 820 పాయింట్లు (1.6 శాతం) నష్టపోగా 49,000 స్థాయిని నిలబెట్టుకోలేకపోయింది.
US Stock Markets | అమెరికా స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా పతనం అయ్యాయి. ఏఐ సంబంధిత ఆందోళనలు, టారిఫ్ విధానాలపై గందరగోళం నెలకొనడంతో వాల్ స్ట్రీట్ సూచీలు నష్టపోయాయి. సోమవారం నాటి మార్కెట్ సెషన్‌లో డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 820 పాయింట్లు (1.6 శాతం) నష్టపోగా 49,000 స్థాయిని నిలబెట్టుకోలేకపోయింది. అలాగే ఎస్ అండ్ పీ 500, నాస్‌డాక్ కంపోజిట్ కూడా 1 శాతం కంటే ఎక్కువగానే నష్టపోయాయి. దీంతో ఎస్ అండ్ పీ 500 ఈ ఏడాదికి గాను మళ్లీ నష్టాల్లోకి చేరింది. ఇక అమెరికన్ స్టాక్ మార్కెట్లు ఇంతగా రియాక్ట్ అవడానికి పలు ప్రధాన కారణాలు ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు.
ఐబీఎంను కుదిపేసిన ఆంథ్రోపిక్ బ్లాగ్ పోస్టు..
డౌ జోన్స్ నష్టపోవడానికి ప్రధాన కారణం ఐబీఎం కాగా ఈ సంస్థ షేర్లు 13 శాతం మేర పతనం అయ్యాయి. అక్టోబర్ 2000 తరువాత మళ్లీ ఇప్పుడే ఈ సంస్థ షేర్లు భారీగా నష్టపోయాయి. ఆంథ్రోపిక్ ఏఐ సంస్థ తన తాజా బ్లాగ్ పోస్టులో ఐబీఎంకు సంబంధించి పలు విషయాలను వెల్లడించింది. ఏఐ మార్పులు ఐబీఎం ప్రధాన వ్యాపార విభాగాల్లో పలు అంశాలకు సవాల్ విసరుతున్నాయని ఆ బ్లాగ్ పోస్టులో పేర్కొనడం ఆ సంస్థ షేర్ల పతనానికి కారణం అయింది. అలాగే ఏఐ కారణంగా గత నెల రోజుల నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న ఐటీ షేర్లు సోమవారం మరింత ప్రభావితం అయ్యాయి. మైక్రోసాఫ్ట్ షేర్లు 3 శాతం మేర పతనం అవ్వగా, క్రౌడ్ స్ట్రైక్ 10 శాతం క్షీణించింది. మైక్రోసాఫ్ట్ షేర్లు పతనం అవ్వడం నాస్‌డాక్, ఎస్ అండ్ పీ 500పై మరింత ఒత్తిడిని పెంచింది. అలాగే ఏఐ సంబంధిత ఆందోళనలు కేవలం ఐటీ రంగానికే పరిమితం కాలేదు. ట్రక్కింగ్, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలపై కూడా ప్రభావం చూపాయి.
ఉద్యోగాలకు ఏఐ ముప్పు ప్రభావం..
ఏఐ వల్ల భారీ ఎత్తున ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందనే ఆందోళనల నేపథ్యంలో ఆ ప్రభావం కూడా అమెరికన్ స్టాక్ మార్కెట్లపై పడింది. సిట్రిని రీసెర్చ్ అనే సంస్థ తాజాగా ఓ పరిశోధన పత్రం విడుదల చేయగా దాని ప్రకారం నిరుద్యోగం రేటు మరింత పెరిగే అవకాశం ఉందని తేలింది. దీంతో ఆ ప్రభావం కూడా స్టాక్ మార్కెట్లపై పడింది. ఈ క్రమంలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ షేర్లు 7 శాతం మేర నష్టపోగా, మాస్టర్‌కార్డు 6 శాతం వరకు పతనం అయింది. దీంతో డౌ డోన్స్ మరింత ప్రభావితం అయింది. అలాగే ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అస్తవ్యస్తమైన టారిఫ్ పాలసీలతో సందిగ్ధత ఏర్పడేలా చేశారు. దీని వల్ల కూడా అక్కడి మార్కెట్లు ప్రభావితం అయ్యాయి. ఇక వాల్ స్ట్రీట్ మేజర్ సూచీల పతనంతో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపారు. దీంతో స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు ఔన్స్‌కు 5200 డాలర్లకు చేరుకోగా, వెండి ధరలు మళ్లీ 90 డాలర్లకు చేరువై 88 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



