Train Ticket Booking | ఆగస్టు నుంచి రైల్వే టికెట్ బుకింగ్‌లో భారీ మార్పులు.. నూతన టెక్నాలజీతో పూర్తిగా పునర్నిర్మాణం..
Train Ticket Booking | భారతీయ రైల్వే తమ రిజర్వేషన్ వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆగస్టు నుంచి కొత్త ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్‌ఎస్)ను దశలవారీగా అమల్లోకి తీసుకురానున్నారు. 1986 నుంచి కొనసాగుతున్న పాత వ్యవస్థకు బదులుగా ఆధునిక సాంకేతికతతో రూపొందించిన కొత్త వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు.
Train Ticket Booking | భారతీయ రైల్వే తమ రిజర్వేషన్ వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆగస్టు నుంచి కొత్త ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్‌ఎస్)ను దశలవారీగా అమల్లోకి తీసుకురానున్నారు. 1986 నుంచి కొనసాగుతున్న పాత వ్యవస్థకు బదులుగా ఆధునిక సాంకేతికతతో రూపొందించిన కొత్త వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు. టికెట్ బుకింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేయడం, సిస్టమ్ సామర్థ్యాన్ని పెంచడం, ప్రయాణికులకు మెరుగైన అనుభవాన్ని అందించడం ఈ మార్పుల ప్రధాన లక్ష్యాలు. ఈ ప్రాజెక్టు పురోగతిని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్ భవన్‌లో సమీక్షించి, మార్పుల సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ 1986లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ వ్యవస్థలో పెద్దగా మార్పులు జరగలేదు. ఇప్పుడు దీన్ని పూర్తిగా పునర్నిర్మించి కొత్త టెక్నాలజీతో రూపొందించారు. దీంతో గతంతో పోలిస్తే మరింత వేగంగా, అధిక సంఖ్యలో టికెట్లను ప్రాసెస్ చేసే సామర్థ్యం లభించనుంది.
88 శాతం డిజిటల్ ద్వారానే..
భారతీయ రైల్వేలు 2002లో ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సేవలను ప్రారంభించాయి. ప్రస్తుతం ఎక్కువ మంది ప్రయాణికులు కౌంటర్లకు వెళ్లకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా టికెట్లు బుక్ చేస్తున్నారు. మొత్తం టికెట్ బుకింగ్‌లలో సుమారు 88 శాతం డిజిటల్ మార్గాల్లోనే జరుగుతున్నాయి. ఈ మార్పును రైల్వేల డిజిటలైజేషన్ ప్రణాళికలో భాగంగా చేపడుతున్నారు. 2025 జూలైలో ప్రారంభమైన రైల్ వన్ యాప్ ఏడాది కూడా పూర్తికాకముందే 3.5 కోట్లకు పైగా డౌన్‌లోడ్లను నమోదు చేసింది. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు టికెట్ బుకింగ్, టికెట్ రద్దు, రైలు లైవ్ స్టేటస్ తనిఖీ, ప్లాట్‌ఫామ్, కోచ్ సమాచారం తెలుసుకోవడం, ఫిర్యాదులు నమోదు చేయడం వంటి అనేక సేవలను ఒకే చోట పొందవచ్చు. దీంతో రైల్వే సేవలు మరింత సులభతరం అవుతున్నాయి. రైల్వేల సమాచారం ప్రకారం, ఈ యాప్ ద్వారా ప్రతిరోజూ సుమారు 9.29 లక్షల టికెట్లు బుక్ అవుతున్నాయి. వీటిలో సుమారు 7.2 లక్షల జనరల్ టికెట్లు, 2.09 లక్షల రిజర్వ్‌డ్ టికెట్లు ఉంటున్నాయి.
ఏఐతో వెయిటింగ్ లిస్ట్ ప్రిడిక్షన్..
ఈ కొత్త వ్యవస్థలో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ ఏఐ ఆధారిత వెయిటింగ్ లిస్ట్ ప్రిడిక్షన్. ఈ ఏడాది ప్రారంభంలోనే అందుబాటులోకి వచ్చిన ఈ సదుపాయం వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలను ముందుగానే అంచనా వేస్తుంది. ఈ ఫీచర్ కచ్చితత్వం గతంలో 53 శాతం ఉండగా ప్రస్తుతం 94 శాతానికి పెరిగింది. దీంతో ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను మరింత సమర్థవంతంగా రూపొందించుకునే అవకాశం లభిస్తోంది. ఆగస్టులో కొత్త ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ ప్రారంభంతో టికెట్ బుకింగ్ ప్రక్రియ మరింత వేగవంతంగా, స్మార్ట్‌గా, విశ్వసనీయంగా మారనుంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణికులకు ఇది మరింత సౌకర్యాన్ని అందించనుంది.
సంబంధిత వార్తలు

Indian Railway | రైల్వే రిజర్వేషన్ సిస్టమ్‌లో భారీ మార్పులు.. ఆగస్టు నుంచే అమలు..!
జూన్ 8, 2026

Train Accidents | రైళ్లలో వరుస అగ్నిప్రమాదాల వెనుక అసాంఘిక శక్తుల ప్రమేయం : రైల్వే శాఖ
మే 20, 2026

Longest Non-Stop Train | దేశంలో ఒక్కచోట కూడా ఆగకుండా అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది?
మే 17, 2026
తాజావార్తలు
- ●Great Nicobar airport | తీవ్ర వివాదం వేళ కేంద్రం కీలక నిర్ణయం.. రూ.13 వేల కోట్లతో గ్రేట్ నికోబార్ ఎయిర్‌పోర్టుకు క్లియరెన్స్
- ●ACB Raids | ఆదాయానికి మించి ఆస్తులు.. ఆర్ అండ్ బీ ఈఎన్సీ మోహన్‌నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు
- ●Bharat Pe | బ్యాంకు ఖాతాలో డబ్బు లేకున్నా యూపీఐ ద్వారా చెల్లింపులు.. భారత్‌పే ఫ్లెక్స్‌తో కొత్త సౌకర్యం..
- ●Kajal Aggarwal | నయనతార ఛాన్స్ కొట్టేసిన కాజల్ - భగవంత్ కేసరి కాంబో రిపీట్
- ●Ebola | ఎబోలా కలకలం.. 550 కేసులు, 101 మరణాలు..
- ●Donald Trump | ఇరాన్‌పై దాడి చేస్తే.. ఒంటరిగా మిగిలిపోతావ్ జాగ్రత్త.. నెతన్యాహుకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

Great Nicobar airport | తీవ్ర వివాదం వేళ కేంద్రం కీలక నిర్ణయం.. రూ.13 వేల కోట్లతో గ్రేట్ నికోబార్ ఎయిర్‌పోర్టుకు క్లియరెన్స్

ACB Raids | ఆదాయానికి మించి ఆస్తులు.. ఆర్ అండ్ బీ ఈఎన్సీ మోహన్‌నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు

Bharat Pe | బ్యాంకు ఖాతాలో డబ్బు లేకున్నా యూపీఐ ద్వారా చెల్లింపులు.. భారత్‌పే ఫ్లెక్స్‌తో కొత్త సౌకర్యం..

Kajal Aggarwal | నయనతార ఛాన్స్ కొట్టేసిన కాజల్ - భగవంత్ కేసరి కాంబో రిపీట్



