HDFC Bank | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు కష్టకాలం.. వాటాలను తగ్గించుకుంటున్న సంస్థలు..
HDFC Bank | మార్చితో ముగిసిన త్రైమాసికంలో భారతీయ స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అస్థిరతల నేపథ్యంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో తమ వాటాను 3.62 శాతం మేర తగ్గించారు. గత ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసికంలో FIIs మార్చి త్రైమాసికంలో 47.95 కోట్ల షేర్లను విక్రయించినట్లు ఎన్ఎస్ఈలో అందుబాటులో ఉన్న షేర్‌హోల్డింగ్ డేటా వెల్లడించింది.
HDFC Bank | మార్చితో ముగిసిన త్రైమాసికంలో భారతీయ స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అస్థిరతల నేపథ్యంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో తమ వాటాను 3.62 శాతం మేర తగ్గించారు. గత ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసికంలో FIIs మార్చి త్రైమాసికంలో 47.95 కోట్ల షేర్లను విక్రయించినట్లు ఎన్ఎస్ఈలో అందుబాటులో ఉన్న షేర్‌హోల్డింగ్ డేటా వెల్లడించింది. దీంతో వారి మొత్తం వాటా 47.67 శాతం నుంచి 44.05 శాతానికి తగ్గింది. అదనంగా FII పెట్టుబడిదారుల సంఖ్య కూడా డిసెంబర్ 2025 చివర్లో ఉన్న 2,757 నుంచి 2,528కు తగ్గింది. ఇటీవల ముగిసిన త్రైమాసికంలో FIIs నికర విక్రేతలుగానే కొనసాగారు. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ యుద్ధం, పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావంతో మార్చి నెలలో భారత స్టాక్ మార్కెట్‌లలో భారీ స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయి. ఎన్ఎస్‌డీఎల్ గణాంకాల ప్రకారం గత నెలలో FIIs రూ.1.18 లక్షల కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించగా, మొత్తం త్రైమాసిక అవుట్‌ఫ్లోలు రూ.1.31 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
వాటాను తగ్గించుకున్న ఎల్ఐసీ..
కాగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) కూడా మార్చి త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో తన వాటాను 4.67 శాతం మేర తగ్గించింది. మరోవైపు మ్యుచువల్ ఫండ్లు అదే కాలంలో తమ వాటాను పెంచాయి. గత త్రైమాసికంలో మ్యుచువల్ ఫండ్లు దాదాపు 2.88 శాతం మేర వాటాను కొనుగోలు చేసి తమ మొత్తం వాటాను 29.54 శాతానికి పెంచుకున్నాయి. సోమవారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్ ధర 2.68 శాతం మేర పెరిగి రూ.771 వద్ద ముగిసింది. నిఫ్టీ50 సూచీతో పోలిస్తే బ్యాంకు మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ట్రేడింగ్ సమయంలో ఈ షేర్ గరిష్ఠంగా 2.91 శాతం పెరిగి రూ.772.75 వరకు చేరింది. గత 12 నెలల్లో ఈ షేర్ ధర 12.27 శాతం పడిపోయింది. ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటివరకు 22.21 శాతం మేర నష్టాన్ని చవిచూసింది.
భారీగా పతనమైన షేర్ ధర..
గత ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్ ధర 26.19 శాతం పడిపోయింది. అందులో మార్చి నెలలోనే 17.60 శాతం పతనం నమోదైంది. బ్యాంక్ చైర్మన్ అటాను చక్రవర్తి అకస్మాత్తుగా రాజీనామా చేయడంతో మార్చిలో బ్యాంకింగ్ స్టాక్‌పై భారీ అమ్మకాల ఒత్తిడి ఏర్పడింది. బ్లూమ్‌బర్గ్ డేటా ప్రకారం ఈ కంపెనీని ట్రాక్ చేస్తున్న 47 మంది విశ్లేషకుల్లో 46 మంది బై రేటింగ్‌ను కొనసాగిస్తుండగా, ఒకరు హోల్డ్ రేటింగ్‌ను సూచించారు. సగటు 12 నెలల టార్గెట్ ధర రూ.1,112.47గా ఉండగా, ఇది ప్రస్తుత ధరతో పోలిస్తే సుమారు 44.3 శాతం పెరుగుదల అవకాశాన్ని సూచిస్తోంది. అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు రానున్న రోజుల్లో ఎలాంటి ప్రదర్శన ఇస్తాయో చూడాలి.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






