త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Market | లాభాల్లోకి దేశీయ స్టాక్ మార్కెట్లు.. 480 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌..!

Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమ‌వారం లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల‌ను ర‌ద్దు చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేప‌థ్యంలో మార్కెట్‌లో సెంటిమెంట్ బ‌ల‌ప‌డింది.

P

Business | Published On Feb 23, 2026, 4.51 pm IST

Stock Market | లాభాల్లోకి దేశీయ స్టాక్ మార్కెట్లు.. 480 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌..!
Advertisement

Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమ‌వారం లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల‌ను ర‌ద్దు చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేప‌థ్యంలో మార్కెట్‌లో సెంటిమెంట్ బ‌ల‌ప‌డింది. ఇటీవ‌ల పరిణామాల నేప‌థ్యంలో గ్లోబ‌ల్ రిస్క్ త‌గ్గ‌డంతో భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభ‌మై.. చివ‌రి వ‌ర‌కు అదే ఊపును కొన‌సాగించాయి. క్రితం సెష‌న్‌తో పోలిస్తే సెన్సెక్స్ 82,906.83 పాయింట్ల వ‌ద్ద లాభాల్లో మొద‌లైంది. ఇంట్రాడేలో 82,906.83 పాయింట్ల గ‌రిష్టానికి చేరుకుంది.

చివ‌ర‌కు 479.95 పాయింట్లు లాభ‌ప‌డి.. 83,294.66 పాయింట్ల వ‌ద్ద స్థిర‌ప‌డింది. ఇక నిఫ్టీ 141.75 పాయింట్లు పెరిగి.. 25,713.00 వ‌ద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం ప‌త‌నం కాగా.. నిఫ్టీ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగింది. నిఫ్టీలో అత్యధికంగా లాభపడినవి అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, నెస్లే, హిందాల్కో, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, సిప్లా ఉన్నాయి. ఐడీఎఫ్‌సీ, యూపీఎల్‌, స్వాన్ కార్ప్‌, ఏయూ స్పాల్ ఫైనాన్స్ బ్యాంక్ న‌ష్టాల్లో ముగిశాయి. ఐటీ 1.4 శాతం, మెటల్ 0.2 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 1.3 శాతం, ఫార్మా, ఆయిల్, గ్యాస్, ఇన్ఫ్రా, ఎఫ్‌ఎంసీజీ, ఆటో 0.5 శాతం పెరిగాయి. అయితే, ప్రభుత్వ ఖాతాల్లో రూ.590 కోట్ల మోసం జరిగినట్లు వార్త‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు 16శాతం పడిపోయాయి.

హర్యానా ప్రభుత్వం ఖాతాలను డీ-ఎంప్యానెల్ చేసిన తర్వాత ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లు 5శాతం ప‌త‌న‌మ‌య్యాయి. డీఈఈ డెవలప్‌మెంట్ ఇంజినీర్స్ షేర్ ధర రూ.173 కోట్ల ఆర్డర్ కార‌ణంగా 20శాతం పెరిగింది. ఇండియన్ బ్యాంక్, కమ్మిన్స్ ఇండియా, అపార్ ఇండస్ట్రీస్, భారత్ ఫోర్జ్, పాలీక్యాబ్ ఇండియా, మాక్స్ ఫైనాన్షియల్, జేబీ కెమికల్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, హిటాచి ఎనర్జీ, ఎస్‌బీఐ, ఎల్అండ్‌టీ, ఎన్‌టీపీసీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేఈఐ ఇండస్ట్రీస్, ఆస్ట్రల్, వోల్టాస్ త‌దిత‌ర 110పైగా స్టాక్‌లు 52 వారాల గరిష్ట స్థాయిని తాకాయి.

Advertisement
Advertisement