Mutual Funds | గత 10 ఏళ్లలో SIP విధానంలో భారీ రిటర్న్స్‌ను ఇచ్చిన టాప్ 5 మ్యుచువల్ ఫండ్స్ ఇవే..
Mutual Funds | దీర్ఘకాలంలో భారీ సంపదను సృష్టించేందుకు చాలా మంది మ్యుచువల్ ఫండ్స్ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. గతేడాది నుంచి ఆశించిన స్థాయిలో స్టాక్ మార్కెట్లు ఫలితం ఇవ్వకపోయినా, మొత్తంగా చూస్తే ఇవి పౌరులకు చక్కని పెట్టుబడి మార్గంగా మారాయి.
Mutual Funds | దీర్ఘకాలంలో భారీ సంపదను సృష్టించేందుకు చాలా మంది మ్యుచువల్ ఫండ్స్ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. గతేడాది నుంచి ఆశించిన స్థాయిలో స్టాక్ మార్కెట్లు ఫలితం ఇవ్వకపోయినా, మొత్తంగా చూస్తే ఇవి పౌరులకు చక్కని పెట్టుబడి మార్గంగా మారాయి. మ్యుచువల్ ఫండ్స్ అంటేనే ఒకప్పుడు ప్రజలు భయపడేవారు. కానీ ఇప్పుడు ఈ ఫండ్స్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. ఈ ఫండ్స్ గురించి అసలు నిజాలు తెలుసుకున్న వారు రిస్క్ తీసుకుని పెట్టుబడులను పెట్టేందుకు ఏమాత్రం వెనుకాడడంలేదు. మ్యుచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో కంపెనీలు కూడా అనేక రకాల ఫండ్స్‌ను అందిస్తున్నాయి. తక్కువ రిస్క్‌ను కలిగి ఉండి, ఎక్కువ రిటర్న్స్‌ను ఇచ్చే ఫండ్స్‌ను చాలా కంపెనీలు ప్రవేశపెడుతున్నాయి. దీంతో ఆయా ఫండ్స్ కోసం ప్రజలు ఆసక్తిగా వెదుకుతున్నారు. అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని ఫండ్స్ మాత్రం సరిగ్గా ఇదే కోవకు చెందుతాయి. ఇవి దేశవ్యాప్తంగా ప్రజల ఆదరణను చూరగొన్నాయి. వీటిల్లో చాలా మంది పెట్టుబడులు పెడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
పూర్తి వివరాలను తెలుసుకోవాలి..
మ్యుచువల్ ఫండ్స్‌లో ప్రస్తుతం పెట్టుబడులు పెడుతున్న చాలా మందిలో ఎక్కువ శాతం వరకు పౌరులు సిప్ (SIP) విధానాన్నే ఎంచుకుంటున్నారు. ఇందులో స్వల్పకాలిక మార్కెట్ల హెచ్చు తగ్గుల నుంచి అధిక శాతం వరకు రక్షణ ఉంటుంది. పైగా దీర్ఘకాలం పాటు కొనసాగిస్తారు కనుక కాంపౌండింగ్ శక్తితో 15 లేదా 20 ఏళ్లలో భారీగా సంపద వృద్ధి చెందుతుంది. అయితే చాలా తక్కువ శాతం మంది మాత్రమే మ్యుచువల్ ఫండ్స్‌లో లంప్సమ్ పెడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో పౌరులకు అనేక రకాల మ్యుచువల్ ఫండ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రతి స్కీమ్‌లో పెట్టుబడి పెట్టేముందు స్కీమ్‌కు చెందిన అన్ని వివరాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. అవగాహన లేకపోతే నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది. లేదంటే తీవ్రమైన నష్టాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక గత 10 సంవత్సరాల కాలవ్యవధిలో పలు మ్యుచువల్ ఫండ్స్ సిప్ విధానంలో అద్భుతమైన రాబడులను అందించాయి. కొన్ని ఫండ్స్ ఏకంగా 23.3 శాతం మేర వార్షిక రాబడులను ఇచ్చాయి. వాటిల్లో ఈ ఫండ్స్ ఎంతో పేరుగాంచాయి.
టాప్ 5 ఫండ్స్ ఇవే..
క్వాంట్ కంపెనీకి చెందిన క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ గత 10 ఏళ్ల కాలంలో సిప్ విధానంలో ఏకంగా 23.3 శాతం వార్షిక రిటర్న్స్‌ను ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫండ్ మొత్తం విలువ రూ.30,373 కోట్లుగా ఉంది. అలాగే నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ గత 10 ఏళ్లలో సిప్ విధానంలో ఏకంగా 21 శాతం వార్షిక రాబడులను ఇచ్చింది. ఈ ఫండ్ విలువ ప్రస్తుతం రూ.72,673 కోట్లుగా ఉంది. నిప్పాన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్‌లో గత 10 ఏళ్లలో సిప్ విధానంలో 20.1 శాతం మేర వార్షిక రిటర్న్స్ లభించాయి. ఈ ఫండ్ మొత్తం విలువ రూ.45,820 కోట్లుగా ఉంది. ఈడిల్‌వెయిస్ మిడ్ క్యాప్ ఫండ్ గత 10 ఏళ్లలో సిప్ ద్వారా ఏటా 19.9 శాతం రిటర్న్స్ ను ఇచ్చింది. ఈ ఫండ్ మొత్తం రూ.15,910 కోట్ల విలువను కలిగి ఉంది. క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ మొత్తం విలువ రూ.12,506 కోట్లు కాగా ఇది గత 10 సంవత్సరాల కాలవ్యవధిలో ఏటా 19.8 శాతం రిటర్న్స్‌ను అందించింది. అయితే ఈ ఫండ్స్ మాత్రమే కాదు, ఏ మ్యుచువల్ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టినా ముందుగా పూర్తి వివరాలను తెలుసుకోవడం అవసరం. అలాగే ఆర్థిక నిపుణులను సంప్రదించి సలహా తీసుకోవాల్సి ఉంటుంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Pawan Kalyan | పవన్ కల్యాణ్‌కు అస్వస్థత..!
- ●KTR | పాతబస్తీలో ఇరానీ చాయ్‌ను ఆస్వాదించాను : కేటీఆర్
- ●Bandla Ganesh | నీ ఊరేది.. నీ కథేంటి..? ప్రకాశ్ రాజ్‌పై బండ్ల గణేశ్ ఫైర్
- ●Samsung Health | శాంసంగ్ గెలాక్సీ వాచ్‌లో ఏఐ హెల్త్ విప్లవం.. రాత్రి పూట ఎమర్జెన్సీ ఉంటే ముందే చెప్పేస్తుంది..
- ●Tenth Exams | రేపట్నుంచి 'పది' అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు..
- ●Gutha Sukender Reddy | పవన్ అక్కడే ఉండాలి.. ఎక్కడో ఉంటా అంటే ఎలా?: మండలి చైర్మన్ గుత్తా

Pawan Kalyan | పవన్ కల్యాణ్‌కు అస్వస్థత..!

KTR | పాతబస్తీలో ఇరానీ చాయ్‌ను ఆస్వాదించాను : కేటీఆర్

Bandla Ganesh | నీ ఊరేది.. నీ కథేంటి..? ప్రకాశ్ రాజ్‌పై బండ్ల గణేశ్ ఫైర్

Samsung Health | శాంసంగ్ గెలాక్సీ వాచ్‌లో ఏఐ హెల్త్ విప్లవం.. రాత్రి పూట ఎమర్జెన్సీ ఉంటే ముందే చెప్పేస్తుంది..






