NPS Vs Mutual Funds | ఎన్‌పీఎస్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్.. రిటైర్మెంట్ కోసం ఏది బెస్ట్..?
NPS Vs Mutual Funds | డబ్బు సంపాదించడం ఒకెత్తయితే దాన్ని పొదుపు చేసి దీర్ఘకాలంలో భారీ సంపదను సృష్టించడం ఒకెత్తు. అందుకనే దేశంలోని పౌరులకు అనేక రకాల పెట్టుబడిమార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS), మ్యుచువల్ ఫండ్స్ ఎంతో పేరుగాంచాయి.
NPS Vs Mutual Funds | డబ్బు సంపాదించడం ఒకెత్తయితే దాన్ని పొదుపు చేసి దీర్ఘకాలంలో భారీ సంపదను సృష్టించడం ఒకెత్తు. అందుకనే దేశంలోని పౌరులకు అనేక రకాల పెట్టుబడిమార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS), మ్యుచువల్ ఫండ్స్ ఎంతో పేరుగాంచాయి. అయితే డబ్బును పెట్టుబడి పెట్టే సమయంలో మాత్రం ఈ రెండింటిలో ఏది ఉత్తమమైన మార్గం అని చాలా మంది సందేహాలను వ్యక్తం చేస్తుంటారు. అందుకు నిపుణులు సమాధానాలను చెబుతున్నారు. ఎన్‌పీఎస్, మ్యూచువల్ ఫండ్స్ రెండూ మార్కెట్లు, డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్, ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టినా, వాటి లక్ష్యాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఒకటి రిటైర్మెంట్ భద్రత కోసం అందుబాటులో ఉంటే, మరొకటి సంపద సృష్టి కోసం ఎక్కువ స్వేచ్ఛను అందిస్తుంది. ఈ తేడా చాలా మంది ఇన్వెస్టర్లు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఎన్‌పీఎస్ + మ్యుచువల్ ఫండ్స్..
ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో పెన్షన్ భద్రత బలహీనపడుతుండగా, భారతీయుల జీవితకాలం కూడా పెరుగుతోంది. దీంతో ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ ప్లానింగ్ అతిపెద్ద ఆర్థిక సవాళ్లలో ఒకటిగా మారుతోంది. అయితే రిటైర్మెంట్ కోసం పెట్టుబడి పెట్టాలా లేదా అని ప్రశ్న కాదు. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనేదే అసలు ప్రశ్న. ఇటీవలి కాలంలో ఆర్థిక నిపుణులు సూచిస్తున్న మార్గం ఎన్‌పీఎస్ లేదా మ్యుచువల్ ఫండ్స్ కాదు, ఎన్‌పీఎస్ + మ్యుచువల్ ఫండ్స్ అని చెబుతున్నారు. అంటే రెండింటిలోనూ పెట్టుబడులు పెట్టాలన్నమాట. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎప్పుడైనా డబ్బు వెనక్కి తీసుకునే అవకాశం ఉండగా, ఎన్‌పీఎస్‌లో రిటైర్మెంట్ వయస్సు వరకు ఎక్కువ భాగం నిధులు లాక్ అవుతాయి. దీంతో మార్కెట్ హెచ్చుతగ్గుల సమయంలో భావోద్వేగ నిర్ణయాలు తీసుకోవడం లేదా దీర్ఘకాలిక పొదుపులను ముందుగానే ఖర్చు చేయడం తగ్గుతుంది. రిటైర్మెంట్ సేవింగ్స్‌ను మధ్యలో వాడకుండా దీర్ఘకాలిక లక్ష్యంపై నిలబడేందుకు ఎన్‌పీఎస్ సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

రిటైర్మెంట్ ప్లానింగ్ భిన్నం..
సాధారణ పెట్టుబడులతో పోలిస్తే రిటైర్మెంట్ ప్లానింగ్ భిన్నంగా ఉంటుంది. సంపద సృష్టిలో వ్యూహాత్మక మార్పులు, సౌలభ్యం ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ రిటైర్మెంట్ భద్రత మాత్రం దశాబ్దాలపాటు నిరంతర పెట్టుబడులు, కాంపౌండింగ్‌పై ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తుకు రక్షణ కవచంలా పనిచేస్తూ తక్కువ ఖర్చుతో సంపదను నిర్మించే సాధనంగా ఎన్‌పీఎస్‌ను నిపుణులు అభివర్ణిస్తున్నారు. రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఎన్‌పీఎస్‌కు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రధాన కారణాల్లో ఒకటి దాని తక్కువ ఖర్చు నిర్మాణం. ఎన్‌పీఎస్‌లో ఫండ్ మేనేజ్‌మెంట్ ఛార్జీలు సాధారణంగా 0.01 శాతం నుంచి 0.09 శాతం మధ్య ఉంటాయి. మార్కెట్లోని అనేక ఇతర పెట్టుబడి ఉత్పత్తులతో పోలిస్తే ఇది చాలా తక్కువ. 30 నుంచి 35 ఏళ్ల వంటి దీర్ఘకాలంలో ఖర్చులలో చిన్న తేడా కూడా చివరికి రిటైర్మెంట్ కార్పస్‌పై భారీ ప్రభావం చూపుతుంది. వార్షిక వ్యయాల్లో 1 నుంచి 1.5 శాతం తేడా కూడా దీర్ఘకాల రిటైర్మెంట్ ఫలితాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది.
పన్ను మినహాయింపులు ఎక్కువ..
ఎన్‌పీఎస్ ప్రధానంగా రిటైర్మెంట్ ఆదాయం, పెన్షన్ లక్ష్యంతో రూపొందించిన ఉత్పత్తి. మ్యూచువల్ ఫండ్స్ మాత్రం విస్తృత సంపద సృష్టి, లిక్విడిటీ కోసం ఉపయోగపడతాయి. రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయాన్ని అందించే యాన్యుటైజేషన్ విధానం ఎన్‌పీఎస్‌లో ఉండగా, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లలో చాలా మంది ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఎన్‌పీఎస్‌ను ఆకర్షణీయంగా ఉంచుతున్న మరో ప్రధాన అంశం ట్యాక్స్ ఆదా. పాత పన్ను విధానంలో సెక్షన్ 80సిసిడి(1), 80సిసిడి(1బి) కింద కలిపి రూ.2 లక్షల వరకు మినహాయింపులు పొందవచ్చు. అలాగే ఉద్యోగులకు యజమాని చేసే కాంట్రిబ్యూషన్‌పై సెక్షన్ 80సిసిడి(2) కింద ప్రయోజనం లభిస్తుంది. ఇది కొత్త ట్యాక్స్ విధానంలో కూడా అందుబాటులో ఉంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ప్రకారం అధిక ఆదాయం కలిగిన వ్యక్తులు ఈ పన్ను ప్రయోజనాల ద్వారా ఎక్కువ లాభపడే అవకాశం ఉంటుంది. ఏటా రూ.24 లక్షలకు పైగా ఆదాయం పొందుతూ 30 శాతం ట్యాక్స్ స్లాబ్‌లో ఉన్న వ్యక్తులు అత్యధిక ప్రయోజనం పొందవచ్చు. ట్యాక్స్ రూపంలో ఆదా అయ్యే డబ్బును తిరిగి రిటైర్మెంట్ కోసం పెట్టుబడి పెట్టవచ్చు.
కనీసం 15 ఏళ్ల పెట్టుబడికి ఓకే అయితేనే..
కనీసం 15 ఏళ్ల పెట్టుబడి గడువు ఉన్నవారు ఎన్‌పీఎస్‌ను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. ఇటీవల సాధారణ ఎగ్జిట్ కాలాన్ని 15 ఏళ్లకు తగ్గించడం కూడా దీనికి అనుకూలంగా మారింది. అలాగే చిన్న వయసులోనే ప్రారంభిస్తే కాంపౌండింగ్ ప్రయోజనాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ఎన్‌పీఎస్ వాత్సల్య ద్వారా మైనర్ల నుంచి 85 ఏళ్ల వయస్సు వరకు అందరికీ ఎన్‌పీఎస్ అందుబాటులో ఉంది. ఎన్‌పీఎస్‌పై ఆసక్తి పెరుగుతున్నప్పటికీ, సంపద సృష్టి విషయంలో మ్యూచువల్ ఫండ్స్ ఇప్పటికీ ప్రధాన ఎంపికగా కొనసాగుతున్నాయి. కారణం ఫ్లెక్సిబిలిటీ. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడిదారులు ఎప్పుడైనా ప్రవేశించవచ్చు, నిష్క్రమించవచ్చు. అలాగే అగ్రెసివ్ ఈక్విటీ ఫండ్స్ నుంచి కన్జర్వేటివ్ డెట్ స్కీమ్స్, హైబ్రిడ్ ఉత్పత్తుల వరకు విస్తృత ఎంపికలు అందుబాటులో ఉంటాయి. ఈ స్వేచ్ఛ కారణంగా వివిధ ఆర్థిక లక్ష్యాలకు మ్యూచువల్ ఫండ్స్ మరింత అనుకూలంగా మారుతాయి.

మెరుగైన లిక్విడిటీని అందించే మ్యుచువల్ ఫండ్స్..
మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ, విస్తృత పెట్టుబడి ఎంపికలు, మెరుగైన లిక్విడిటీని అందిస్తాయి. అందుకే సంపద సృష్టి కోరుకునే వారు వీటిని ఎక్కువగా ఎంచుకుంటారు. చాలా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో బలమైన రాబడులు ఇచ్చాయి. ఎన్‌పీఎస్, మ్యూచువల్ ఫండ్స్‌ను కేవలం రాబడుల ఆధారంగా పోల్చడం తప్పు. రిటర్న్స్ మాత్రమే నిర్ణయాత్మక అంశం కావు. ఒకటి రిటైర్మెంట్ భద్రత కోసం, మరొకటి వివిధ ఆర్థిక లక్ష్యాల కోసం అందుబాటులో ఉన్నాయి. ఇల్లు కొనుగోలు, పిల్లల విద్య, స్వల్పకాలిక ఆర్థిక అవసరాలు వంటి లక్ష్యాలకు మ్యూచువల్ ఫండ్స్ మరింత అనుకూలం. నిపుణులందరి అభిప్రాయం ప్రకారం డబ్బు లక్ష్యం ఏమిటన్నదే నిర్ణయాత్మక అంశం. రిటైర్మెంట్ భద్రత, ట్యాక్స్ ప్రయోజనాలు, క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యమైతే ఎన్‌పీఎస్‌కు స్పష్టమైన ఆధిక్యం ఉంటుంది. లిక్విడిటీ, ఫ్లెక్సిబిలిటీ, వివిధ ఆర్థిక లక్ష్యాల కోసం సంపద సృష్టి ముఖ్యమైతే మ్యూచువల్ ఫండ్స్ సరైన ఎంపిక అవుతుంది. అయితే ఇప్పుడు ఎక్కువ మంది వెల్త్ మేనేజర్లు ఈ రెండింటినీ ప్రత్యర్థులుగా కాకుండా పరస్పర స్వేహపూర్వక సాధనాలుగా చూడాలని సూచిస్తున్నారు.
రెండూ ముఖ్యమే..
ఎన్‌పీఎస్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్ చర్చగా చూడకుండా, రెండూ ఆర్థిక ప్రయాణంలో వేర్వేరు పాత్రలు పోషించేలా ఎన్‌పీఎస్ ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ అని చూడాలని నిపుణులు చెబుతున్నారు. ఇంటి పునాదిలా ఎన్‌పీఎస్ ఉంటే, దానిపై నిర్మించే అంతస్తుల్లా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. రిటైర్మెంట్ కార్పస్‌ను భావోద్వేగ నిర్ణయాల నుంచి రక్షించాలి. ఆ స్థిరత్వాన్ని ఎన్‌పీఎస్ అందిస్తుంది. పోర్ట్‌ఫోలియోలో రిటైర్మెంట్‌కు ఎన్‌పీఎస్ ప్రధాన భాగంగా ఉండగా, లిక్విడిటీ, అదనపు సంపద సృష్టికి మ్యూచువల్ ఫండ్స్ సహకరిస్తాయి. ఎన్‌పీఎస్ మీ భవిష్యత్తును భద్రపరుస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ మిమ్మల్ని సంపన్నులను చేసి వివిధ అవసరాలను తీర్చడంలో సహాయపడతాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●RS Praveen Kumar | రాబందుల కబ్జా కోరల్లో రైతుల భూములు.. రెండు వర్గాలుగా రెవెన్యూ యంత్రాంగం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ●Fire accident | మైత్రివనంలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు
- ●Pawan Kalyan | పవన్ కల్యాణ్‌కు అస్వస్థత..!
- ●Mutual Funds | గత 10 ఏళ్లలో SIP విధానంలో భారీ రిటర్న్స్‌ను ఇచ్చిన టాప్ 5 మ్యుచువల్ ఫండ్స్ ఇవే..
- ●KTR | పాతబస్తీలో ఇరానీ చాయ్‌ను ఆస్వాదించాను : కేటీఆర్
- ●Bandla Ganesh | నీ ఊరేది.. నీ కథేంటి..? ప్రకాశ్ రాజ్‌పై బండ్ల గణేశ్ ఫైర్

RS Praveen Kumar | రాబందుల కబ్జా కోరల్లో రైతుల భూములు.. రెండు వర్గాలుగా రెవెన్యూ యంత్రాంగం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Fire accident | మైత్రివనంలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు

Pawan Kalyan | పవన్ కల్యాణ్‌కు అస్వస్థత..!

Mutual Funds | గత 10 ఏళ్లలో SIP విధానంలో భారీ రిటర్న్స్‌ను ఇచ్చిన టాప్ 5 మ్యుచువల్ ఫండ్స్ ఇవే..





