Indian Stock Markets | భారీగా పతనమవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఆంత్రోపిక్ ఎఫెక్టే కారణమా..?
Indian Stock Markets | గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న సెంటిమెంట్ కారణంగా శుక్రవారం ఉదయం భారత స్టాక్ మార్కెట్‌లలో భారీ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ప్రారంభ సెషన్‌లోనే మార్కెట్‌లో గణనీయమైన పతనం నమోదైంది. నిఫ్టీ 50 సూచీ 25,578 వద్ద డౌన్‌సైడ్ గ్యాప్‌తో ప్రారంభమై, ఓపెనింగ్ బెల్ తర్వాత కొన్ని నిమిషాల్లోనే 25,560 ఇంట్రాడే కనిష్ట స్థాయిని తాకింది.
Indian Stock Markets | గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న సెంటిమెంట్ కారణంగా శుక్రవారం ఉదయం భారత స్టాక్ మార్కెట్‌లలో భారీ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ప్రారంభ సెషన్‌లోనే మార్కెట్‌లో గణనీయమైన పతనం నమోదైంది. నిఫ్టీ 50 సూచీ 25,578 వద్ద డౌన్‌సైడ్ గ్యాప్‌తో ప్రారంభమై, ఓపెనింగ్ బెల్ తర్వాత కొన్ని నిమిషాల్లోనే 25,560 ఇంట్రాడే కనిష్ట స్థాయిని తాకింది. బీఎస్ఈ సెన్సెక్స్ కూడా 82,946 వద్ద ప్రారంభమై కొద్ది నిమిషాల్లోనే 82,910 వరకు పడిపోయింది. ఈ క్రమంలో ముందు రోజు క్లోజింగ్‌తో పోలిస్తే నిఫ్టీ సుమారుగా 270 పాయింట్లు నష్టపోగా, సెన్సెక్స్ 810 పాయింట్ల మేర పతనం అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ సూచీ సైతం నష్టాన్ని నమోదు చేసింది. 60,523 వద్ద గ్యాప్ డౌన్‌తో ప్రారంభం అయిన బ్యాంక్ నిఫ్టీ కాసేపటికి 60,511 ఇంట్రా డే కనిష్ట స్థాయిని తాకింది. ముందు రోజుతో పోలిస్తే ఈ సూచీలో 300 పాయింట్ల తగ్గుదల కనిపించింది.
ఐటీ రంగంపై ఆంత్రోపిక్ ఎఫెక్టే కారణం..?
భారత స్టాక్ మార్కెట్ల పతనానికి గల కారణాలపై జియోజిట్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ డా. వి.కె. విజయకుమార్ మాట్లాడుతూ మార్కెట్లు ప్రస్తుతం అశాంతి దశలోకి ప్రవేశించాయి. ఇది పెట్టుబడిదారుల్లో కొంత భయాందోళన కలిగించవచ్చు, అయితే ఇదే సమయంలో అవకాశాలను కూడా అందిస్తుంది. అమెరికా మార్కెట్లలో ఏఐ షేర్లలో జరిగిన అమ్మకాలు ఊహించినవే, కానీ వాటి సమయం, తీవ్రత ముందుగా అంచనా వేయలేకపోయాం. నాస్‌డాక్‌లో 2.04 శాతం పతనం క్రాష్‌గా పరిగణించలేము. అయితే ఈ డౌన్‌ట్రెండ్ కొనసాగితే అమెరికా మార్కెట్‌ను మరింతగా దిగజార్చే అవకాశం ఉందని తెలిపారు. భారత మార్కెట్‌ను ప్రస్తుతం కుదిపేస్తున్న అంశాలపై ఆయన మాట్లాడుతూ ఐటీ షేర్లలో భారీ అమ్మకాలు భారత మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఐటీ రంగం ఇండియా ఐఎన్‌సీలో రెండవ అతిపెద్ద లాభ వనరుగా ఉంది. ఆంత్రోపిక్ షాక్ ఐటీ రంగంపై ఎంత ప్రభావం చూపుతుందో ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఈ దశలో ఐటీ షేర్లలో భయంతో అమ్మకాలు చేయడం మంచిది కాకపోవచ్చు. పెట్టుబడిదారులు పరిస్థితులు స్థిరపడే వరకు వేచి చూడడం ఉత్తమం అని సూచించారు.
అమెరికా సీపీఐ డేటా, భారత మార్కెట్లలో ప్రాఫిట్ బుకింగ్ వల్ల కూడా..?
శుక్రవారం మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలను వివరించిన సెబీ-నమోదిత ఫండమెంటల్ ఈక్విటీ అనలిస్టు అవినాశ్ గోరక్షకర్ మాట్లాడుతూ ప్రధాన కారణం అమెరికా స్టాక్ మార్కెట్‌లో జరిగిన పతనమే. అదేవిధంగా ఈరోజు వెలువడనున్న అమెరికా సీపీఐ డేటా ముందు మార్కెట్ ఒత్తిడిలో ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వారాంతపు చివరి సెషన్‌లో భారత పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు, అందుకనే మార్కెట్లలో ఈ భారీ అమ్మకాలు చోటు చేసుకుంటున్నాయి, కానీ వచ్చే వారం పరిస్థితి భిన్నంగా ఉండవచ్చు.. అని చెప్పారు. ఇక ఇండియా-అమెరికా వాణిజ్య ఒప్పందం ప్రకటన తర్వాత భారత కంపెనీల షేర్లలో భారీగా పెరుగుదల వచ్చినా చాలా మంది పెట్టుబడి దారులు లాభాల స్వీకరణ (ప్రాఫిట్ బుకింగ్) కోసం చూస్తున్నారని, కనుకనే శుక్రవారం అమ్మకాలు పెరిగాయని, ఇది కూడా మార్కెట్లు పతనం అయ్యేందుకు ఒక కారణం అని తెలిపారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






