Stocks | బుల్ ర్యాలీకి సిద్ధమవుతున్న 3 స్టాక్స్.. పెట్టుబడిదారులకు మంచి అవకాశం..
Stocks | యుద్ధం కారణంగా అనేక కంపెనీలకు చెందిన స్టాక్స్ ఇప్పుడు చాలా చవక ధరలకు అందుబాటులో ఉండడంతో పెట్టుబడిదారులు వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే ఏ స్టాక్‌లో పెట్టుబడులు పెడితే మంచిది.. అని సందేహంలో ఉన్నారు.
Stocks | యుద్ధం కారణంగా అనేక కంపెనీలకు చెందిన స్టాక్స్ ఇప్పుడు చాలా చవక ధరలకు అందుబాటులో ఉండడంతో పెట్టుబడిదారులు వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే ఏ స్టాక్‌లో పెట్టుబడులు పెడితే మంచిది.. అని సందేహంలో ఉన్నారు. ఇప్పుడు చాలా వరకు స్టాక్స్ తగ్గింపు ధరల్లో అందుబాటులో ఉన్నాయి కనుక ఏయే స్టాక్స్ ను కొనాలా అని చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అయితే ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పెట్టుబడిదారులకు 3 అద్భుతమైన స్టాక్స్‌ను కొనవచ్చని రికమెండ్ చేస్తోంది. ఆ సంస్థకు చెందిన టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ చందన్ తపారియా ఈ మేరకు వివరాలను వెల్లడించారు. ఆయన లార్జ్ క్యాప్‌కు చెందిన 2 స్టాక్స్‌ను, మిడ్ క్యాప్ విభాగంలో ఒక స్టాక్‌ను రికమెండ్ చేస్తున్నారు. వీటికి ఆయన బై రేటింగ్ ఇచ్చారు. వాటిల్లో ఒక స్టాక్ బీఎస్ఈ లిమిటెడ్ కాగా, రెండోది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. మూడోది ఆర్‌బీఎల్ బ్యాంకు స్టాక్ కావడం విశేషం.
బీఎస్ఈ లిమిటెడ్..
బీఎస్ఈ లిమిటెడ్ సంస్థకు తపారియా బై రేటింగ్ ఇచ్చారు. ఈ షేర్ ధర క్రితం సెషన్‌లో రూ.3635 వద్ద ముగిసింది. ఇటీవల 0.019 శాతం నష్టపోయింది. అయిత ఈ షేర్‌ను పెట్టుబడిదారులు కొనుగోలు చేస్తే ఆయన రూ.3850 వరకు టార్గెట్ ఇచ్చారు. అలాగే రూ.3530 స్టాప్ లాస్‌గా ఫిక్స్ చేసుకోవాలని సూచించారు. ఇక ఈ షేర్ 52 వారాల గరిష్ట ధర రూ.3675.50 ఉండగా, 52 వారాల కనిష్ట ధర రూ.2021.50 గా ఉంది. గడిచిన ఏడాది కాలంలో ఈ షేర్ పెట్టుబడిదారులకు 73 శాతం మేర లాభాలను అందించింది. ప్రస్తుతం బీఎస్ఈ లిమిటెడ్ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1.48 లక్షల కోట్లుగా ఉంది. అయితే ఈ షేర్‌లో పెట్టుబడులు పెడితే స్వల్ప లేదా మధ్య కాలంలో భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్..
రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఇటీవలి కాలంలో గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. దీని షేర్‌కు కూడా తపారియా బై రేటింగ్ ఇచ్చారు. క్రితం సెషన్‌లో ఈ స్టార్ ధర రూ.1436 వద్ద ముగిసింది. 0.74 శాతం లాభపడింది. ఈ షేర్‌ను కొనుగోలు చేస్తే రూ.1515 టార్గెన్‌ను ఆయన ఇచ్చారు. ఇక దీని 52 వారాలా గరిష్ట ధర రూ.1611 ఉండగా, కనిష్ట ధర రూ.1290గా ఉంది. స్టాప్‌లాస్‌ను రూ.1387 వద్ద ఇచ్చారు. గడిచిన ఏడాది కాలంలో ఈ స్టాక్ 1 శాతం లాభాన్ని పెట్టుబడిదారులకు అందించింది. అయితే ఇటీవల మెరుగైన ఫలితాలు వచ్చిన నేపథ్యంలో షేర్ ధర మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ విలువ రూ.19.36 లక్షల కోట్లుగా ఉంది.
ఆర్‌బీఎల్ బ్యాంకు..
ప్రైవేటు బ్యాంకింగ్ రంగానికి చెందిన ఆర్‌బీఎల్ బ్యాంకు స్టాక్‌కు సైతం తపారియా బై రేటింగ్ ఇచ్చారు. ఈ షేర్ క్రితం సెషన్‌లో 0.97 శాతం నష్టపోయి రూ.337.90 వద్ద ముగిసింది. ఈ షేర్‌ను కొంటే ఆయన రూ.355 టార్గెట్‌ను, రూ.325 స్టాప్ లాస్‌ను ఇచ్చారు. 52 వారాలా గరిష్ట ధర రూ.345, కనిష్ట ధర రూ.188 గా ఉంది. గతేడాదిలో ఈ కంపెనీ షేర్ తన పెట్టుబడిదారులకు 69 శాతం మేర లాభాలను అందించింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.20,810 కోట్లుగా ఉంది. ఈ షేర్ ధర కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అయితే షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేముందుకు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



