Stocks | యుద్ధ పరిస్థితులు ఉన్నా మంచి రిటర్న్స్ ఇస్తున్న 3 స్టాక్స్.. ధర చాలా తక్కువ..
Stocks | అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలకు చెందిన ఈక్విటీ మార్కెట్లు గత కొద్ది రోజులుగా తీవ్రమైన నష్టాల్లో కొనసాగుతున్నాయి. పెట్టుబడిదారులు రిస్క్‌ను తగ్గించుకునే నిమిత్తం జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. దీంతో వారిపై అమ్మకాల ఒత్తిడి గణనీయంగా పెరిగింది.
Stocks | అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలకు చెందిన ఈక్విటీ మార్కెట్లు గత కొద్ది రోజులుగా తీవ్రమైన నష్టాల్లో కొనసాగుతున్నాయి. పెట్టుబడిదారులు రిస్క్‌ను తగ్గించుకునే నిమిత్తం జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. దీంతో వారిపై అమ్మకాల ఒత్తిడి గణనీయంగా పెరిగింది. అయితే ఇరు దేశాల మధ్య శాంతి చర్చలపై పురోగతి కనిపిస్తున్న నేపథ్యంలో మార్కెట్లు మళ్లీ పుంజుకున్నా, యుద్ధం ముగిసిందనే వార్తలు వస్తేగానీ సూచీలు రికవరీని ప్రారంభించవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో అధిక విలువ కలిగిన లేదా ఒక మోస్తరు విలువ కలిగిన లార్జ్, మిడ్ క్యాప్ స్టాక్స్‌కు బదులుగా స్మాల్ క్యాప్స్‌లో పెట్టుబడులు పెట్టడం ఉత్తమమని వారు సూచిస్తున్నారు. ఇటీవలి కాలంలో రూ.200 అంతకన్నా తక్కువ ధర కలిగిన షేర్లలో చాలా వరకు స్వల్పకాలిక పెట్టుబడులకు మంచి అవకాశాలు వస్తున్నాయని పేర్కొంటున్నారు. ఈ మేరకు ఆనంద్ రాఠీ షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ మెహుల్ కొఠారి వివరాలను వెల్లడించారు.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్..
మార్కెట్‌లో ఇటీవల కనిపిస్తున్న అస్థిరత నేపథ్యంలో కొన్ని స్టాక్స్ బలమైన టెక్నికల్ బ్రేకౌట్స్ ఇస్తున్నాయని, వీటిలో కొనుగోలు అవకాశాలు ఉన్నాయని మెహుల్ కొఠారి తెలిపారు. ఆయన సిఫారసు చేసిన మొదటి షేర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB). ఈ షేర్ ప్రస్తుతం బలమైన అప్ ట్రెండ్‌లో కొనసాగుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా దీర్ఘకాల కన్సాలిడేషన్ తర్వాత స్టాక్ బ్రేకౌట్ ఇచ్చిందని, వాల్యూమ్స్ కూడా పెరుగుతున్నాయని అన్నారు. టెక్నికల్ చార్టుల్లో బుల్లిష్ సంకేతాలు కనిపిస్తున్నాయని, ఈ స్టాక్‌ను రూ.38-40 పరిధిలో కొనుగోలు చేయవచ్చని, రూ.46 లక్ష్య ధరగా నిర్ణయించుకోవాలని సూచించారు. స్టాప్‌లాస్‌ను రూ.35 వద్ద ఉంచాలని తెలిపారు.
సుజ్లాన్ ఎనర్జీ, యెస్ బ్యాంక్..
రెండో ఎంపికగా సుజ్లాన్ ఎనర్జీని ఆయన సూచించారు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెరుగుతున్న ఆసక్తి, కంపెనీపై సానుకూల సెంటిమెంట్ ఈ షేర్‌కు మద్దతు ఇస్తున్నాయని అన్నారు. టెక్నికల్‌గా స్టాక్ బలమైన మొమెంటమ్‌లో ఉందని, పైస్థాయిలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ షేర్‌ను రూ.58-60 మధ్య కొనుగోలు చేసి, రూ.70 టార్గెట్‌గా విక్రయించవచ్చని తెలిపారు. స్టాప్‌లాస్‌ను రూ.54 వద్ద ఉంచాలని సూచించారు. మూడో స్టాక్‌గా యెస్ బ్యాంక్ ను ఎంపిక చేశారు. బ్యాంకింగ్ రంగంలో ఇటీవల వచ్చిన ర్యాలీకి ఈ షేర్ కూడా లాభపడుతోందని అన్నారు. టెక్నికల్ చార్టుల్లో హయ్యర్ టాప్ - హయ్యర్ బాటమ్ ఫార్మేషన్ కనిపిస్తోందని, దీన్ని బుల్లిష్ సంకేతంగా పరిగణిస్తారని చెప్పారు. యెస్ బ్యాంక్ షేర్‌ను రూ.26-27 వద్ద కొనుగోలు చేసి, రూ.32 వరకు లక్ష్యంగా పెట్టుకోవచ్చని తెలిపారు. స్టాప్‌లాస్‌ను రూ.24 వద్ద ఉంచాలని అన్నారు.
స్టాప్ లాస్ తప్పనిసరి..
మార్కెట్ పరిస్థితులపై కూడా ఆయన వివరాలను వెల్లడించారు. గ్లోబల్ సంకేతాలు, విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు, ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లో వచ్చిన రికవరీ కారణంగా భారత మార్కెట్లు స్థిరపడుతున్నాయని అన్నారు. నిఫ్టీ కీలక మద్దతు స్థాయిల వద్ద నిలబడడం పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచిందని అన్నారు. అయితే టెక్నికల్ ఆధారిత ట్రేడింగ్‌లో రిస్క్ ఎక్కువగా ఉంటుందని, అందుకే స్టాప్‌లాస్ తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. మార్కెట్‌లో వేగంగా మారే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడిదారులు తమ రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా మాత్రమే ట్రేడింగ్ చేయాలని సూచించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



