త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Prepaid Plans | సైలెంట్‌గా ప్రీపెయిడ్ ప్లాన్ల ధ‌ర‌ల‌ను పెంచుతున్న టెలికాం కంపెనీలు..? కార‌ణాలేంటి..?

Prepaid Plans | టెలికాం సంస్థ భార‌తీ ఎయిర్‌టెల్ త‌న ప్రీపెయిడ్ వినియోగ‌దారుల‌కు షాకిచ్చింది. రూ.859 ప్లాన్ ధ‌ర‌ను పెంచింది. 84 రోజుల వాలిడిటీని అందిస్తున్న ఈ ప్లాన్‌లో క‌స్ట‌మ‌ర్ల‌కు రోజుకు 1.5జీబీ డేటా ల‌భిస్తుంది. అయితే ఈ ప్లాన్ ధ‌ర‌ను రూ.40 పెంచ‌డంతో ప్ర‌స్తుతం ఈ రీచార్జి ప్యాక్ ధ‌ర రూ.899కు చేరింది.

S

Business | Published On Apr 20, 2026, 10.14 am IST

Prepaid Plans | సైలెంట్‌గా ప్రీపెయిడ్ ప్లాన్ల ధ‌ర‌ల‌ను పెంచుతున్న టెలికాం కంపెనీలు..? కార‌ణాలేంటి..?
Advertisement

Prepaid Plans | టెలికాం సంస్థ భార‌తీ ఎయిర్‌టెల్ త‌న ప్రీపెయిడ్ వినియోగ‌దారుల‌కు షాకిచ్చింది. రూ.859 ప్లాన్ ధ‌ర‌ను పెంచింది. 84 రోజుల వాలిడిటీని అందిస్తున్న ఈ ప్లాన్‌లో క‌స్ట‌మ‌ర్ల‌కు రోజుకు 1.5జీబీ డేటా ల‌భిస్తుంది. అయితే ఈ ప్లాన్ ధ‌ర‌ను రూ.40 పెంచ‌డంతో ప్ర‌స్తుతం ఈ రీచార్జి ప్యాక్ ధ‌ర రూ.899కు చేరింది. అయితే ఇత‌ర ప్రీపెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్ ప్లాన్ల ధ‌ర‌ల‌ను పెంచ‌కుండా కేవ‌లం ఈ ఒక్క ప్లాన్ ధ‌రను మాత్ర‌మే పెంచ‌డంతో త్వ‌ర‌లో టారిఫ్‌ల‌ను భారీ ఎత్తున పెంచ‌నున్నారా..? అని విశ్లేష‌కులు సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. ఒకేసారి భారీ ఎత్తున అన్ని ప్లాన్ల‌కు ధ‌ర‌లను పెంచితే వినియోగ‌దారుల నుంచి నెగెటివ్ ప్ర‌భావాన్ని ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని భావిస్తున్నందునే ఎయిర్‌టెల్ ఇలా సైలెంట్‌గా ఒకే ప్లాన్ ధ‌ర‌ను పెంచింద‌ని అంటున్నారు. మిగిలిన ప్యాక్ ల ధ‌ర‌ల‌ను కూడా ఒక్కొక్క‌టిగా త్వ‌ర‌లోనే పెంచనుంద‌ని తెలుస్తోంది.

5జి కి మార్చ‌డ‌మే ల‌క్ష్యంగా..

వినియోగ‌దారుల‌ను 5జి డేటాకు మార్చ‌డ‌మే ల‌క్ష్యంగా ఎయిర్‌టెల్ ఈ ప‌ని ప్రారంభించిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఎయిర్‌టెల్‌తోపాటు జియో మాత్ర‌మే నాణ్య‌మైన 5జి సేవ‌ల‌ను అందిస్తున్నాయి. అయితే క‌స్ట‌మ‌ర్ల‌ను వీలైనంత త్వ‌ర‌గా 5జికి మార్చి ఆ మేర ప్లాన్ల రేట్ల‌ను పెంచాల‌ని కంపెనీలు భావిస్తున్నాయి. 5జి టారిఫ్‌లు అమ‌లైతే రేట్లు భారీగా పెంచుతారు. అలా ఒకేసారి చేస్తే ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి క‌నుక ఒక్కో ప్లాన్ ధ‌ర‌ను నెమ్మ‌దిగా పెంచుతూ వెళ్లాల‌ని టెలికాం సంస్థ‌లు ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఎయిర్‌టెల్ బాట‌లోనే జియో కూడా ఈ విష‌యంపై ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌లి కాలంలో మొబైల్ రీచార్జి ప్లాన్లపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో రీచార్జి ప్యాక్ ధ‌ర‌లు పెర‌గ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

రూ.899 ప్లాన్ బెనిఫిట్స్‌..

ఇక ఎయిర్‌టెల్ రూ.859 నుంచి రూ.899కి పెంచిన ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీ అలాగే ఉంది. అందులో మార్పు లేదు. వినియోగదారులు 84 రోజుల వాలిడిటీని పొంద‌వ‌చ్చు. రోజుకు 1.5 జీబీ డేటా ల‌భిస్తుంది. లోక‌ల్‌, ఎస్‌టీడీ, రోమింగ్ నెట్‌వ‌ర్క్‌ల‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవ‌చ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల‌ను ఉచితంగా ఇస్తారు. రోజువారి మొబైల్ డేటా 1.5 జీబీ పూర్తిగా అయిపోతే ఇంట‌ర్నెట్ వేగం 64 కేబీపీఎస్‌కు త‌గ్గిస్తారు. ఇక ఈ ప్లాన్‌లో వినియోగ‌దారులు ఎయిర్‌టెల్ రివార్డ్స్ కింద 12 నెల‌ల పాటు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సేవ‌ల‌ను ఉచితంగా పొంద‌వ‌చ్చు. అలాగే స్పామ్ అల‌ర్ట్స్‌, 30 రోజుల‌కు ఒక‌సారి ఉచితంగా ట్యూన్ మార్చుకునే ఫ్రీ హ‌లోట్యూన్స్ సేవ‌ల‌ను పొందుతారు. ఇక ఈ ప్లాన్‌లో అంత‌కు ముందు ఇచ్చిన క్యాష్ బ్యాక్ ప్ర‌యోజ‌నాల‌ను మాత్రం ప్ర‌స్తుతం ఇవ్వ‌డం లేదు.

నెమ్మ‌దిగా పెంపు ప్ర‌క్రియ‌..?

అయితే ఎయిర్‌టెల్‌లో రూ.838కి మ‌రో ప్రీపెయిడ్‌ ప్లాన్ అందుబాటులో ఉంది. కానీ దీని వాలిడిటీ 56 రోజులు మాత్ర‌మే కాగా, ఇందులో రోజుకు 3జీబీ డేటాను ఉచితంగా అందిస్తారు. అయితే డేటా ప్ర‌ధానంగా కావాలనుకునే వారికి ఈ ప్లాన్ ప‌నిచేస్తుంది. ఇక డేటా వినియోగం త‌క్కువ‌గా ఉంటుంద‌నుకునే వారు రూ.899 ప్లాన్‌ను రీచార్జి చేసుకుని వాలిడిటీ ప‌రంగా ప్ర‌యోజ‌నం పొంద‌వ‌చ్చు. అయితే వినియోగ‌దారుల‌ను నెమ్మ‌దిగా పెరిగిన ధ‌ర‌ల‌కు అల‌వాటు చేస్తూ ఆదాయం పెంచుకోవ‌డ‌మే కాకుండా, అంద‌రినీ 5జి కి మార్చాల‌ని ఎయిర్ టెల్ ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ప్ర‌క్రియ ఎప్పటి వ‌ర‌కు పూర్త‌వుతుందో చూడాలి.

Advertisement
Advertisement