త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India on US Supreme Court Judgement | యూఎస్ సుప్రీంకోర్టు టారిఫ్ తీర్పుపై భారత్ స్పందన ఇదే

యూఎస్, భారత్ ట్రేడ్ డీల్ ప్రకారం 18 శాతం నుంచి 10 శాతానికి టారిఫ్ తగ్గించడం భారత్‌కు ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ.. ఈ 10 శాతం ఎన్ని రోజులు ఉంటుంది అనే దానిపై క్లారిటీ లేదు.

J

Business | Published On Feb 21, 2026, 6.03 pm IST

India on US Supreme Court Judgement | యూఎస్ సుప్రీంకోర్టు టారిఫ్ తీర్పుపై భారత్ స్పందన ఇదే
Advertisement

India on US Supreme Court Judgement | ప్రపంచ దేశాలపై యూఎస్ ప్రభుత్వం విధించిన టారిఫ్‌లు చెల్లవు అంటూ యూఎస్ సుప్రీంకోర్టు ట్రంప్‌నకు బిగ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో అమెరికా రాజ్యాంగంలోని ఓ సెక్షన్‌ను అడ్డుపెట్టుకొని ట్రంప్ వెంటనే ప్రపంచ దేశాలపై 10 శాతం టారిఫ్ విధిస్తున్నా అంటూ ప్రకటించారు. ఇప్పటికే యూఎస్, భారత్ మధ్య ట్రేడ్ డీల్ కన్ఫమ్ అయిన నేపథ్యంలో భారత్‌పై ట్రేడ్ డీల్ ప్రకారం 18 శాతం టారిఫ్ ఉంటుందా? లేక ట్రంప్ ప్రకటించినట్లుగా 10 శాతం ఉంటుందా? అనే దానిపై క్లారిటీ లేదు. కానీ.. ప్రపంచ దేశాల మాదిరిగానే భారత్ కూడా 10 శాతం టారిఫ్ పరిధిలోకే వస్తుందని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై తాజాగా భారత్ స్పందించింది. భారత వాణజ్య మంత్రిత్వ శాఖ ఈ వ్యవహారంపై ఓ ప్రకటన విడుదల చేసింది.

స్టడీ చేస్తున్నాం

యూఎస్ సుప్రీం కోర్టు టారిఫ్స్ మీద ఇచ్చిన జడ్జిమెంట్‌ను పరిశీలిస్తున్నాం. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. యూఎస్ పరిపాలన శాఖ నుంచి కొన్ని ప్రకటనలు వెలువడ్డాయి. వాటన్నింటినీ స్టడీ చేస్తున్నాం. వాటికి సంబంధించిన అన్ని డెవలప్‌మెంట్స్, వాటి పర్యవసనాలపై స్టడీ చేస్తున్నాం.. అని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

కొత్త టారిఫ్ వల్ల భారత్‌పై పడే ప్రభావం ఎంత?

యూఎస్, భారత్ ట్రేడ్ డీల్ ప్రకారం 18 శాతం నుంచి 10 శాతానికి టారిఫ్ తగ్గించడం భారత్‌కు ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ.. ఈ 10 శాతం ఎన్ని రోజులు ఉంటుంది అనే దానిపై క్లారిటీ లేదు. ఫిబ్రవరి 24 నుంచి అన్ని దేశాలకు 10 శాతం సుంకాలు అమలు కానున్నాయి. కానీ.. ఆ టారిఫ్ 150 రోజులే అమలులో ఉంటుంది. అప్పటి లోపు యూఎస్ కాంగ్రెస్ నుంచి ఆ టారిఫ్‌కు అప్రూవల్ రావాలి. లేదంటే అది కూడా ఉండదు.

Advertisement
Advertisement