త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్టాక్ మార్కెట్ల‌లో న‌ష్టాలు కంటిన్యూ.. అన్ని సూచీలు ప‌త‌నం..

Stock Markets | ప‌శ్చిమ ఆసియాలో కొన‌సాగుతున్న యుద్ధం కారణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాల‌కు చెందిన స్టాక్ మార్కెట్ల‌పై తీవ్రంగా అమ్మ‌కాల ఒత్తిడి ప్ర‌భావం ప‌డుతోంది. భారీ ఎత్తున మార్కెట్లు న‌ష్టాల్లో కొన‌సాగుతున్నాయి. గ‌త రెండు వారాలుగా మార్కెట్ల‌లో పెట్టుబ‌డిదారులు భారీ ఎత్తున సంప‌ద‌ను న‌ష్ట‌పోయారు.

S

Business | Published On Mar 16, 2026, 11.13 am IST

Stock Markets | స్టాక్ మార్కెట్ల‌లో న‌ష్టాలు కంటిన్యూ.. అన్ని సూచీలు ప‌త‌నం..
Advertisement

Stock Markets | ప‌శ్చిమ ఆసియాలో కొన‌సాగుతున్న యుద్ధం కారణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాల‌కు చెందిన స్టాక్ మార్కెట్ల‌పై తీవ్రంగా అమ్మ‌కాల ఒత్తిడి ప్ర‌భావం ప‌డుతోంది. భారీ ఎత్తున మార్కెట్లు న‌ష్టాల్లో కొన‌సాగుతున్నాయి. గ‌త రెండు వారాలుగా మార్కెట్ల‌లో పెట్టుబ‌డిదారులు భారీ ఎత్తున సంప‌ద‌ను న‌ష్ట‌పోయారు. ఇక సోమ‌వారం కూడా మార్కెట్లు భారీ న‌ష్టాల్లోనే కొన‌సాగుతున్నాయి. సెన్సెక్స్ 510 పాయింట్లు (0.65 శాతం) ప‌త‌నం అయి 74,080 వ‌ద్ద కొన‌సాగుతుండ‌గా, నిఫ్టీ50 143 పాయింట్లు (0.59 శాతం) న‌ష్ట‌పోయి 23,025 వ‌ద్ద కొన‌సాగుతోంది. నిఫ్టీ50లో ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్‌, భార‌తి ఎయిర్‌టెల్‌, రిల‌య‌న్స్, టీసీఎస్ భారీ న‌ష్టాల్లో కొన‌సాగుతుండ‌గా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, అల్ట్రా టెక్ సిమెంట్ షేర్లు లాభ ప‌డ్డాయి.

భారీ న‌ష్టాల్లో ఫార్మా షేర్లు..

నిఫ్టీలో దాదాపు అన్ని సూచీలు న‌ష్టాల్లోనే కొన‌సాగుతున్నాయి. ఫార్మా షేర్లు భారీ ఎత్తున న‌ష్ట‌పోయాయి. బ‌యోకాన్ 3 శాతం మేర ప‌త‌నం అవ‌గా, టోరెంట్ ఫార్మా (2.30 శాతం), సిప్లా (1.06), లుపిన్ (2.50), జైడ‌స్ లైఫ్ (2.41), డాక్ట‌ర్ రెడ్డీస్ (2 శాతం) న‌ష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అలాగే నిఫ్టీ ప్రైవేట్ బ్యాంకు, రియాలిటీ, మెట‌ల్‌, ఎన‌ర్జీ కంపెనీల షేర్లు కూడా భారీగా ప‌త‌నం అయ్యాయి.

100 డాల‌ర్ల‌కు పైన క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు..

మ‌రోవైపు అంత‌ర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు బ్యారెల్‌కు 100 డాల‌ర్ల‌కు పైగా కొన‌సాగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర బ్యారెల్‌కు ప్ర‌స్తుతం 101 డాల‌ర్ల వ‌ద్ద ఉండ‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర బ్యారెల్‌కు 97 డాల‌ర్ల వ‌ద్ద కొన‌సాగుతోంది. ఈ రెండూ వ‌రుస‌గా 0.73, 0.41 శాతం చొప్పున పెరిగాయి. అంత‌ర్జాతీయంగా చ‌మురు ధ‌ర‌ల్లో పెరుగుదల కనిపించ‌డంతోపాటు యుద్ధం ఇంకా కొన‌సాగుతూనే ఉన్నందున పెట్టుబ‌డిదారులు అమ్మ‌కాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. సోమ‌వారం నాటి మార్కెట్ సెష‌న్ ప్రారంభంలో సూచీలు కాస్త పెరిగి రిక‌వ‌ర్ అయ్యేందుకు ప్ర‌య‌త్నించాయి. కానీ అక్క‌డ నిలబ‌డ‌లేక‌పోయాయి. అమ్మ‌కాల ఒత్తిడి అధికంగా ఉండ‌డంతో భారీగా ప‌త‌నం అయ్యాయి. ఇక అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే భార‌త రూపాయి మారకం విలువ ప్ర‌స్తుతం 92.46 వ‌ద్ద కొన‌సాగుతోంది. క్రితం సెష‌న్ ముగింపుతో పోలిస్తే ఇది 0.04 శాతం మేర త‌గ్గింది.

Advertisement
Advertisement