త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. బ్యాంకింగ్ షేర్లలో భారీగా అమ్మ‌కాలు..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం వరుసగా రెండో సెషన్‌లోనూ నష్టాలతో ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 బలహీనంగా ముగిశాయి. సెన్సెక్స్ 516 పాయింట్లు (0.66 శాతం) క్షీణించి 77,328.19 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 50 సూచీ 151 పాయింట్లు (0.62 శాతం) పడిపోయి 24,176.15 వద్ద స్థిరపడింది.

S

Business | Published On May 8, 2026, 4.01 pm IST

Stock Markets | వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. బ్యాంకింగ్ షేర్లలో భారీగా అమ్మ‌కాలు..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం వరుసగా రెండో సెషన్‌లోనూ నష్టాలతో ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 బలహీనంగా ముగిశాయి. సెన్సెక్స్ 516 పాయింట్లు (0.66 శాతం) క్షీణించి 77,328.19 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 50 సూచీ 151 పాయింట్లు (0.62 శాతం) పడిపోయి 24,176.15 వద్ద స్థిరపడింది. అయితే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న‌ను కొనసాగించాయి. బీఎస్‌ఈ 150 మిడ్‌క్యాప్ ఇండెక్స్ కేవలం 0.05 శాతం మాత్రమే తగ్గగా, బీఎస్‌ఈ 250 స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.15 శాతం స్వల్ప లాభంతో ముగిసింది.

భారీగా న‌ష్ట‌పోయిన బ్యాంకింగ్ షేర్లు..

సెన్సెక్స్‌పై అత్యధిక ఒత్తిడి తెచ్చిన షేర్లలో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్ బ్యాంక్ ప్రధానంగా నిలిచాయి. 30 షేర్ల సెన్సెక్స్ ప్యాక్‌లో మొత్తం 18 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ప్రధాన సూచీలు నష్టాల్లో ముగిసినప్పటికీ, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగాల స్థిరత్వం కారణంగా బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ మాత్రం రూ.473 లక్షల కోట్ల వద్ద స్థిరంగా కొనసాగింది. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ షేర్లు భారీ అమ్మ‌కాల ఒత్తిడికి గురయ్యాయి. నాలుగో త్రైమాసిక (క్యూ4) ఫలితాలు మార్కెట్ అంచనాలను అందుకోలేకపోవడంతో ఎస్‌బీఐ షేర్ ధర దాదాపు 7 శాతం క్షీణించింది. సెన్సెక్స్‌లో అత్యధికంగా నష్టపోయిన షేర్లలో ఎస్‌బీఐ అగ్రస్థానంలో నిలిచింది. ఎస్‌బీఐతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బ‌జాజ్ ఫైనాన్స్‌, యాక్సిస్ బ్యాంక్‌, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు కూడా దాదాపు 2 శాతం చొప్పున పడిపోయి సెన్సెక్స్‌పై ఒత్తిడి తీసుకువచ్చాయి. అయితే మరోవైపు టైటాన్ సంస్థ షేర్లు క్యూ4 ఫలితాల తర్వాత 5 శాతం ఎగిశాయి. బలమైన ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఈ స్టాక్‌కు కొనుగోళ్ల‌ మద్దతు లభించింది. ఏషియ‌న్ పెయింట్స్ షేర్లు 3 శాతం పెరగ్గా, అదానీ పోర్ట్స్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్ టెక్నాల‌జీస్‌, టెక్ మ‌హీంద్రా షేర్లు 1 నుంచి 2 శాతం మధ్య లాభాలతో ముగిశాయి.

ప‌త‌న‌మైన చ‌మురు ధ‌ర‌లు, రూపాయి విలువ‌..

అంత‌ర్జాతీయ మార్కెట్‌లో శుక్ర‌వారం చ‌మురు ధ‌ర‌లు భారీగా ప‌త‌న‌మ‌య్యాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర ఏకంగా 2.46 శాతం త‌గ్గి బ్యారెల్‌కు 100 డాల‌ర్ల‌కు దిగి వ‌చ్చింది. అలాగే డబ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 2.57 శాతం ప‌త‌న‌మై బ్యారెల్‌కు 91 డాల‌ర్ల‌కు చేరుకుంది. ఇక ఫారెక్స్ మార్కెట్‌లో మ‌రోమారు రూపాయి విలువ ప‌త‌న‌మైంది. అమెరికా డాల‌ర్‌కు రూపాయి విలువ 23 పైస‌లు త‌గ్గి 94.47 వ‌ద్ద నిలిచింది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలపై కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడిదారులు ఎంపిక చేసిన షేర్లలో మాత్రమే పెట్టుబడులు పెట్టడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బలహీనమైన గ్లోబల్ సంకేతాలు, ముడి చమురు ధరల్లో ఒడిదుడుకులు ఇన్వెస్టర్లను అప్రమత్తంగా ఉంచాయి.

సెక్టోరల్ సూచీల్లో నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ అత్యధికంగా 3.06 శాతం కుప్పకూలింది. నాలుగో త్రైమాసిక ఫలితాల్లో నెట్ ఇంటరెస్ట్ మార్జిన్ (ఎన్‌ఐఎం) తగ్గినట్లు వెల్లడికావడంతో ఎస్‌బీఐ షేర్లు 7 శాతం వరకు పతనమయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ సూచీ 1.31 శాతం పడిపోగా, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 1.66 శాతం క్షీణించింది. ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 0.82 శాతం తగ్గగా, మెటల్ ఇండెక్స్ 0.87 శాతం నష్టపోయింది. అయితే టెక్నాలజీ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. నిఫ్టీ ఐటీ 1.21 శాతం ఎగిసింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ కూడా 0.69 శాతం లాభపడింది.

స‌న్న‌గిల్లుతున్న పెట్టుబ‌డిదారు ఆశ‌లు..

జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయ‌ర్ తెలిపిన ప్ర‌కారం హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా-ఇరాన్ సైనిక చర్యలు మళ్లీ ఉద్రిక్తతలను పెంచడంతో కాల్పుల విరమణ ఆశలు బలహీనపడ్డాయని తెలిపారు. దీంతో మార్కెట్లలో రిస్క్-ఆఫ్ సెంటిమెంట్ కనిపించి ప్రాఫిట్ బుకింగ్ జరిగింద‌ని అన్నారు. అయితే బ్యారెల్‌కు 100 డాలర్ల సమీపంలో ముడి చమురు ధరలు స్థిరంగా ఉండటం, అమెరికా 10 ఏళ్ల బాండ్ ఈల్డ్స్ అనుకూల స్థాయిలో కొనసాగడం మార్కెట్ సెంటిమెంట్‌తోపాటు రూపాయికి కూడా మద్దతు ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement