త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | వ‌రుస‌గా రెండో రోజూ స్టాక్ మార్కెట్లు న‌ష్టాల్లోనే.. రూపాయి విలువ భారీగా ప‌త‌నం..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు వ‌రుసగా రెండో రోజు న‌ష్టాల్లో కొన‌సాగుతున్నాయి. శుక్ర‌వారం బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ50ల‌తోపాటు విస్తృత స్థాయి సూచీల్లోనూ అమ్మ‌కాల ఒత్తిడి క‌నిపించింది. నిఫ్టీ50, సెన్సెక్స్ 0.5 శాతానికి పైగా ప‌త‌నం కాగా, మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ సూచీలు న‌ష్టాల్లో ఉన్న‌ప్ప‌టికీ బెంచ్ మార్క్ సూచీల క‌న్నా మెరుగ్గా ఉన్నాయి.

S

Business | Published On May 8, 2026, 10.22 am IST

Stock Markets | వ‌రుస‌గా రెండో రోజూ స్టాక్ మార్కెట్లు న‌ష్టాల్లోనే.. రూపాయి విలువ భారీగా ప‌త‌నం..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు వ‌రుసగా రెండో రోజు న‌ష్టాల్లో కొన‌సాగుతున్నాయి. శుక్ర‌వారం బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ50ల‌తోపాటు విస్తృత స్థాయి సూచీల్లోనూ అమ్మ‌కాల ఒత్తిడి క‌నిపించింది. నిఫ్టీ50, సెన్సెక్స్ 0.5 శాతానికి పైగా ప‌త‌నం కాగా, మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ సూచీలు న‌ష్టాల్లో ఉన్న‌ప్ప‌టికీ బెంచ్ మార్క్ సూచీల క‌న్నా మెరుగ్గా ఉన్నాయి. రంగాల వారిగా చూస్తే దాదాపుగా అన్ని రంగాల‌కు చెందిన స్టాక్స్ న‌ష్టాల్లోనే కొన‌సాగుతున్నాయి. విస్తృత స్థాయి సూచీల్లోనూ అన్ని రంగాల్లో బ‌ల‌హీన‌త క‌నిపిస్తోంది. బ్యాంకింగ్‌, ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్‌, ఆయిల్ అండ్ గ్యాస్‌, రియాల్టీ, మెట‌ల్ స్టాక్స్‌లో భారీ ప‌త‌నం చోటు చేసుకోగా, ఐటీ, కెమిక‌ల్స్‌, హెల్త్‌కేర్‌, మిడ్ క్యాప్ ఐటీ సూచీల్లో స్వ‌ల్ప లాభాలు న‌మోద‌య్యాయి. అయితే భౌగోళిక ఉద్రిక్త‌త‌లు త‌గ్గుతాయా లేదా అన్న సందిగ్ధంలో పెట్టుబ‌డిదారులు ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. అందుక‌నే వారు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పూర్తి డిఫెన్స్ విధానంలో పెట్టుబ‌డులు పెడుతున్నారు.

విదేశీ మార్కెట్ల‌లో మిశ్ర‌మ స్పంద‌న‌..

ఇక విదేశీ మార్కెట్ల‌లో మిశ్ర‌మ స్పంద‌న క‌నిపించింది. గ‌త రాత్రి ముగిసిన సెష‌న్ లో అమెరికా ఎస్ అండ్ పీ 500 ఫ్యూచ‌ర్స్ 0.2 శాతం మేర పెర‌గ్గా, జ‌నాన్ టోపిక్స్ 0.8 శాతం ప‌త‌న‌మైంది. ఆస్ట్రేలియా ఎస్ అండ్ పీ, ఏఎస్ఎక్స్ 200 సూచీ 1.6 శాతం న‌ష్టాన్ని న‌మోదు చేసింది. హాంగ్‌కాంగ్ హాంగ్ సెంగ్ 1.2 శాతం ప‌డిపోగా, షాంఘై కంపోజిట్ 0.1 శాతం, యూరో స్టాక్స్‌50 ఫ్యూచ‌ర్స్ 0.8 శాతం ప‌త‌న‌మ‌య్యాయి.

త‌గ్గిన చ‌మురు ధ‌ర‌లు, ప‌తన‌మైన రూపాయి విలువ‌..

అంత‌ర్జాతీయ మార్కెట్‌లో చ‌మురు ధ‌ర‌లు శుక్ర‌వారం స్వ‌ల్పంగా త‌గ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర బ్యారెల్‌కు 1.25 శాతం మేర త‌గ్గి 101.77 డాల‌ర్ల వ‌ద్ద ఉండ‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 1.43 శాతం త‌గ్గి బ్యారెల్‌కు 92.92 వ‌ద్ద ఉంది. ఫారెక్స్ మార్కెట్‌లో అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే భార‌త రూపాయి మార‌కం విలువ మ‌ళ్లీ భారీగా ప‌త‌న‌మైంది. శుక్ర‌వారం సెష‌న్‌లో 30 పైస‌లు న‌ష్ట‌పోయిన రూపాయి అమెరికా డాల‌ర్‌కు 94.52 వ‌ద్ద ఉంది. అయితే చ‌మురు ధ‌ర‌లు త‌గ్గుతున్నా రూపాయి విలువ ప‌త‌న‌మ‌వుతుండ‌డం దేశీయ స్టాక్ మార్కెట్ల‌కు పెద్ద అడ్డంకిగా మారింది. రూపాయి విలువ త‌గ్గితే విదేశీ పెట్టుబ‌డిదారులు భారీ ఎత్తున నిధుల‌ను ఉప సంహ‌రించుకుంటారు. ఈ క్ర‌మంలో రానున్న రోజుల్లో రూపాయి విలువ సైతం ఈక్విటీ మార్కెట్ల‌ను ప్ర‌భావితం చేయ‌నుంది.

Advertisement
Advertisement