త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Market Update | బ‌డ్జెట్ త‌రువాత తొలి సెష‌న్‌.. ఫ్లాట్‌గా కొన‌సాగుతున్న స్టాక్ మార్కెట్లు..

Stock Market Update | పార్ల‌మెంట్ లోక్‌స‌భ‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బ‌డ్జెట్ 2026-27ను ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్బంగా దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల‌కు లోన‌య్యాయి. దాదాపు అన్ని సూచీలు ఇంట్రా డే ప‌రంగా భారీగా ప‌త‌నం అయ్యాయి.

S

Business | Published On Feb 2, 2026, 10.09 am IST

Stock Market Update | బ‌డ్జెట్ త‌రువాత తొలి సెష‌న్‌.. ఫ్లాట్‌గా కొన‌సాగుతున్న స్టాక్ మార్కెట్లు..
Advertisement

Stock Market Update | పార్ల‌మెంట్ లోక్‌స‌భ‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బ‌డ్జెట్ 2026-27ను ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్బంగా దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల‌కు లోన‌య్యాయి. దాదాపు అన్ని సూచీలు ఇంట్రా డే ప‌రంగా భారీగా ప‌త‌నం అయ్యాయి. ముందు రోజుతో పోలిస్తే స‌గ‌టున 2 శాతం ప‌త‌నం అయ్యాయి. ట్రేడింగ్‌లో ఫ్యూచ‌ర్స్ అండ్ ఆప్ష‌న్స్ (F&O)కు గాను సెక్యూరిటీస్ ట్రాన్సాక్ష‌న్ ట్యాక్స్ (STT) చార్జిల‌ను పెంచ‌డంతో ఆ ప్ర‌భావం స్టాక్ మార్కెట్ల‌పై తీవ్రంగా ప‌డింది. ఈ క్ర‌మంలోనే అనేక కంపెనీల‌కు చెందిన షేర్లు భారీగా ప‌త‌నం అయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రా డే ప‌త‌నం అనంత‌రం ముందు రోజుతో పోలిస్తే 2.9 శాతం ప‌త‌నాన్ని న‌మోదు చేసింది. 80,722 వ‌ద్ద మార్కెట్ ముగిసింది.

అయోమ‌యంలో సెక్టార్లు..

ఇక 2014 నుంచి బ‌డ్జెట్ డే రోజు ఇలా మార్కెట్లు భారీగా ప‌త‌నం అవ‌డం ఇది రెండో సార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా భారీగా ప‌త‌నం అయింది. ముందు రోజు సెష‌న్‌తో పోలిస్తే ఆదివారం నాటి సెష‌న్‌లో 2 శాతం త‌గ్గుద‌ల న‌మోదు కాగా మార్కెట్ 24,825 పాయింట్ల వ‌ద్ద ముగిసింది. అయితే ఈ ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో సోమ‌వారం (ఫిబ్ర‌వ‌రి 2, 2026) నాడు మార్కెట్లు మ‌రింత ప‌త‌నం అయ్యే అవ‌కాశం ఉంద‌ని భావించారు. మ‌రో బ్లాక్ మండే అవుతుంద‌ని అంచ‌నా వేశారు. కానీ ప్ర‌స్తుతం మార్కెట్లు మాత్రం ఫ్లాట్‌గా ఓపెన్ అయి అక్క‌డే కొన‌సాగుతున్నాయి. నిఫ్టీ 24,850 నుంచి 24,900 మ‌ధ్య ఊగిస‌లాడుతుండ‌గా, సెన్సెక్స్ 80,600 నుంచి 81,000 పాయింట్ల మ‌ధ్య కొన‌సాగుతోంది. అయితే సోమ‌వారం నాటి మార్కెట్ సెష‌న్‌లో సూచీలు అస్థిరంగా (వోల‌టైల్‌) ఉన్నాయి. అలాగే ఆదివారం నాడు ప‌లు రంగాల‌కు చెందిన షేర్లలో హెచ్చు త‌గ్గులు స్ప‌ష్టంగా కనిపించాయి. కానీ సోమ‌వారం నాడు మాత్రం మిశ్ర‌మంగా ఉన్నాయి. ఒకే రంగానికి చెంది కొన్ని కంపెనీల షేర్లు ప‌డిపోగా, కొన్ని మాత్రం పెరిగాయి. ఇలా దాదాపుగా అన్ని రంగాల్లోనూ ఉంది. దీంతో బ‌డ్జెట్‌పై ఎవ‌రికీ ఒక స్ప‌ష్ట‌త రాలేద‌ని అర్థ‌మ‌వుతోంది.

Advertisement
Advertisement