త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Market Holiday | ఈ వారంలో స్టాక్ మార్కెట్ల‌కు ఒక రోజు సెల‌వు.. ఎప్పుడంటే..

Stock Market Holiday | దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారంలో ఒక రోజు మూత ప‌డ‌నున్నాయి. నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ), బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (బీఎస్‌ఈ) మే 1న సెల‌వు ప్ర‌క‌టించాయి. మహారాష్ట్ర రాష్ట్ర ఏర్పాటును గుర్తిస్తూ జరుపుకునే మహారాష్ట్ర డే సందర్భంగా ఈ సెలవు ప్రకటించారు.

S

Business | Published On Apr 27, 2026, 11.57 am IST

Stock Market Holiday | ఈ వారంలో స్టాక్ మార్కెట్ల‌కు ఒక రోజు సెల‌వు.. ఎప్పుడంటే..
Advertisement

Stock Market Holiday | దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారంలో ఒక రోజు మూత ప‌డ‌నున్నాయి. నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ), బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (బీఎస్‌ఈ) మే 1న సెల‌వు ప్ర‌క‌టించాయి. మహారాష్ట్ర రాష్ట్ర ఏర్పాటును గుర్తిస్తూ జరుపుకునే మహారాష్ట్ర డే సందర్భంగా ఈ సెలవు ప్రకటించారు. 1960 మే 1న బాంబే రీ-ఆర్గనైజేషన్ చట్టం ద్వారా మహారాష్ట్ర రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా ఈ రోజును జరుపుకుంటారు. ఇక ఎప్ప‌టిలాగే ప్రతి శని, ఆదివారాల్లోనూ స్టాక్ మార్కెట్లు మూసి ఉండ‌నున్నాయి. ఈ రోజుల్లో ఈక్విటీ డెరివేటివ్స్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ (ఎస్‌ఎల్‌బీ), కరెన్సీ డెరివేటివ్స్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీప్ట్స్ (ఈజీఆర్) ట్రేడింగ్ ను పూర్తిగా నిలిపివేస్తారు.

2026 స్టాక్ మార్కెట్ హాలిడే క్యాలెండర్..

ఎన్‌ఎస్‌ఈ ప్రకారం 2026 సంవత్సరంలో మొత్తం 16 ట్రేడింగ్ హాలిడేస్ ఉన్నాయి (వీకెండ్స్ మినహాయించి). ముఖ్యమైన రాబోయే సెలవులు ఇలా ఉన్నాయి.

  • మే 1: మహారాష్ట్ర డే
  • మే 28: బక్రీద్
  • జూన్ 26: మొహర్రం
  • సెప్టెంబర్ 14: గణేష్ చతుర్థి
  • అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి
  • అక్టోబర్ 20: దసరా
  • నవంబర్ 10: దీపావళి
  • నవంబర్ 24: గురునానక్ గురుపురబ్
  • డిసెంబర్ 25: క్రిస్మస్

అదేవిధంగా నవంబర్ 8న ఆదివారం అయినప్పటికీ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహించనున్నారు. దీపావళి లక్ష్మీ పూజ సందర్భంగా ముహూర‌త్‌ ట్రేడింగ్ నిర్వహిస్తారు. ఈ సెషన్ టైమింగ్స్‌ను ముందుగా ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ ప్రకటిస్తాయి. స్టాక్ మార్కెట్ సాధారణంగా వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు (సెలవులు మినహాయించి) పనిచేస్తుంది. ఈక్విటీ సెగ్మెంట్ ట్రేడింగ్ సమయాలు ఇలా ఉంటాయి.

ప్రీ-ఓపెన్ సెషన్

  • ఆర్డర్ ఎంట్రీ ప్రారంభం: ఉదయం 9:00
  • ఆర్డర్ ఎంట్రీ ముగింపు: ఉదయం 9:08
  • (చివరి నిమిషంలో రాండమ్ క్లోజింగ్ ఉంటుంది)

రెగ్యులర్ ట్రేడింగ్ సెషన్

  • మార్కెట్ ఓపెన్: ఉదయం 9:15
  • మార్కెట్ క్లోజ్: మధ్యాహ్నం 3:30

క్లోజింగ్ సెషన్

  • మధ్యాహ్నం 3:40 నుంచి 4:00 వరకు

బ్లాక్ డీల్ సెషన్ టైమింగ్స్

  • మార్నింగ్ విండో: ఉదయం 8:45 నుంచి 9:00 వరకు
  • ఆఫ్టర్ నూన్ విండో: మధ్యాహ్నం 2:05 నుంచి 2:20 వరకు

అయితే అవసరమైతే ఎక్స్చేంజ్‌లు ఈ షెడ్యూల్‌ను మార్చే అధికారం కలిగి ఉంటాయి. అవసరాన్ని బట్టి అదనపు సెలవులు ప్రకటించవచ్చు లేదా ట్రేడింగ్ సమయాలను పొడిగించవచ్చు లేదా తగ్గించవచ్చు. మార్కెట్ సెలవులు, ట్రేడింగ్ సమయాలపై స్పష్టత కలిగి ఉండటం ఇన్వెస్టర్లకు కీలకం. ముందుగానే ప్లాన్ చేసుకోవడం ద్వారా ట్రేడింగ్ నిర్ణయాలను సమర్థవంతంగా తీసుకోవచ్చు.

Advertisement
Advertisement