Stock Market | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. బేర్‌మన్న స్టాక్ మార్కెట్లు
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం కుదేలయ్యాయి. మధ్యప్రాచ్య దేశమైన ఇరాన్‌పై యూఎస్-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేసి ఆ దేశ సుప్రీం కమాండర్ అయతుల్లా అల్ ఖమేనీతో పాటు పలువురు కీలక నేతలను హతమార్చాయి. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఇరాన్ గల్ఫ్ దేశాలపై మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది.
- ఒకే రోజు రూ.6.5లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి
- వెయ్యి పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 25వేల పాయింట్ల దిగువకు నిఫ్టీ
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం కుదేలయ్యాయి. మధ్యప్రాచ్య దేశమైన ఇరాన్‌పై యూఎస్-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేసి ఆ దేశ సుప్రీం కమాండర్ అయతుల్లా అల్ ఖమేనీతో పాటు పలువురు కీలక నేతలను హతమార్చాయి. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఇరాన్ గల్ఫ్ దేశాలపై మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. ఈ యుద్ధం ప్రభావం భారత స్టాక్ మార్కెట్ల పడింది. ట్రంప్ సుంకాలు, అంథ్రోపిక్స్ ఏఐ టూల్ వరుసగా పతనమవుతూ వచ్చిన మార్కెట్లు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ తరుణంలోనే ఇరాన్‌పై సైనిక చర్యలకు దిగడంతో మళ్లీ మార్కెట్‌లో ఉద్రిక్తతలను పెంచాయి. మిస్సైల్ దాడులు ముడిచమురు ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
సెన్సెక్స్ ప్రారంభంలోనే 2700 పాయింట్లకుపైగా నష్టపోయింది. క్రితం సెషన్‌తో పోలిస్తే 78,543.73 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత మార్కెట్లు కోలుకున్నా.. నష్టాల నుంచి గట్టెక్కలేకపోయాయి. చివరకు సెన్సెక్స్ 1,048.34 పాయింట్లు పతనమై.. 80,238.85 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 312.95 పాయింట్లు తపనమై.. 24,865.70 వద్ద స్థిరపడింది. సోమవారం ఒకేరోజు మార్కెట్‌లో రూ.6.5లక్షల కోట్ల సంపదను మదుపరులు నష్టపోయారు. దాంతో బీఎస్ఈలో లిస్ట్ అయిన కంపెనీల మొత్తం క్యాపిలైటేషన్ రూ.463.50 లక్షల కోట్ల నుంచి రూ.456.97 లక్షల కోట్లకు పడిపోయింది.
నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 1.5 శాతం పడిపోయాయి. నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఎల్ అండ్ టీ, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఉన్నాయి. భారత్ ఎలక్ట్రానిక్స్, సన్ ఫార్మా, ఒఎన్‌జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హిందాల్కో ఉన్నాయి. లాభపడ్డాయి. మెటల్ షేర్లు తప్పా.. మిగతా అన్ని రంగాల సూచీలు ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ 2 శాతం చొప్పున దిగజారాయి. యుద్ధం కారణంగా బంగారం, వెండి, ముడి చమురు ధరలకు రెక్కలు వచ్చాయి. ఇక హోలీ పండుగ సందర్భంగా మంగళవారం స్టాక్ మార్కెట్ మూసివేయనున్నారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






