Steelbird ROX Helmets | తక్కువ ధర, నాణ్యత.. 1 కోటి యూనిట్ల విక్రయాలను దాటిన స్టీల్ బర్డ్ ROX హెల్మెట్లు..
Steelbird ROX Helmets | స్టీల్‌బర్డ్ హై-టెక్ ఇండియా లిమిటెడ్ తన ROX హెల్మెట్ సిరీస్ లో కీలక మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా ఈ సిరీస్ హెల్మెట్ల విక్రయాలు మొత్తం మీద 1 కోట్ల యూనిట్లను దాటినట్లు కంపెనీ వెల్లడించింది.
Steelbird ROX Helmets | స్టీల్‌బర్డ్ హై-టెక్ ఇండియా లిమిటెడ్ తన ROX హెల్మెట్ సిరీస్ లో కీలక మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా ఈ సిరీస్ హెల్మెట్ల విక్రయాలు మొత్తం మీద 1 కోట్ల యూనిట్లను దాటినట్లు కంపెనీ వెల్లడించింది. తక్కువ ధరలో లభ్యమయ్యే, ఐఎస్ఐ సర్టిఫైడ్ హెల్మెట్లపై ద్విచక్ర వాహనదారులలో పెరుగుతున్న ఆసక్తి కారణంగానే ఆ సంస్థ ఈ ఘనతను సాధించిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక దేశంలో ప్రస్తుతం రోడ్డు భద్రతపై అవగాహన కూడా పెరుగుతున్న నేపథ్యంలో స్టీల్ బర్డ్ కంపెనీ ఈ ఘనతను సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తక్కువ ధర, నాణ్యత..
కంపెనీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ROX సిరీస్ విజయానికి ప్రధాన కారణం దాని పోటీ ధరే అని వెల్లడైంది. రూ. 969 నుంచి ప్రారంభమయ్యే ఈ హెల్మెట్లు నాణ్యంగా ఉండడమే కాకుండా, రక్షణ విషయంలోనూ అత్యుత్తమంగా పనిచేస్తున్నాయి. అందువల్లే సాధారణ వినియోగదారులు, ముఖ్యంగా యువత ఈ హెల్మెట్లను అధికంగా వాడుతున్నారు. అలాగే మార్కెట్‌లో ఇవి సులభంగా అందుబాటులో ఉన్నాయి. మాస్ మార్కెట్ విభాగంలో నిలిచిన ఈ ఉత్పత్తులు పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు విస్తృత వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. స్టీల్‌బర్డ్ విస్తృత పంపిణీ వ్యవస్థ, రైడర్ షాప్స్, డీలర్ నెట్‌వర్క్ టియర్-1, టియర్-2 నగరాలతోపాటు గ్రామీణ మార్కెట్లలో కూడా విస్తరించి ఉండడం వల్ల ఈ కంపెనీ హెల్మెట్లు భారీగా విక్రయమవుతున్నాయి.
రైడర్ల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది..
స్టీల్‌బర్డ్ హై-టెక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ కపూర్ ఈ విజయాన్ని కేవలం వ్యాపార సాధనంగా కాకుండా విశ్వాసానికి నిదర్శనంగా అభివర్ణించారు. తమ ROX హెల్మెట్ విక్రయాలు 1 కోటి మార్క్‌ను దాటడం లక్షలాది రైడర్ల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఈ సిరీస్ ద్వారా సర్టిఫైడ్ హెల్మెట్ల లభ్యత విస్తరించిందని, రోడ్డు ప్రమాదాలను తగ్గించే జాతీయ లక్ష్యాలకు ఇది తోడ్పడుతోందని ఆయన తెలిపారు. దేశంలో రోజువారీ ప్రయాణాలకు స్కూటర్లు, మోటార్ సైకిళ్లు ప్రధాన వాహనాలుగా ఉండటంతో హెల్మెట్ వినియోగంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం లక్షలాది మంది రోజూ ప్రయాణిస్తున్నప్పటికీ, ప్రామాణిత హెల్మెట్ల వినియోగం ఇంకా సమానంగా విస్తరించలేదు, ముఖ్యంగా నాన్-మెట్రో ప్రాంతాల్లో ఇది మరింత తక్కువగా ఉంది.
రోడ్డు భద్రతపై పెరుగుతున్న అవగాహన..
ఇటీవలి సంవత్సరాల్లో పరిశ్రమలో కనిపిస్తున్న ధోరణులకు అనుగుణంగానే ఈ విక్రయాల పెరుగుదల చోటుచేసుకుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో స్టీల్‌బర్డ్ 87 లక్షల హెల్మెట్లు విక్రయించినట్లు తెలిపింది. భవిష్యత్తులో అధునాతన వెంటిలేషన్, కనెక్టివిటీ ఫీచర్లతో కొత్త మోడళ్లను తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 200కు పైగా ప్రత్యేక రైడర్ షాప్స్ ఉండగా, వాటిని 1వేయికి విస్తరించాలనే ప్రణాళిక ఉంది. ఈ రిటైల్ విస్తరణతోపాటు ఆన్‌లైన్ విక్రయాల ద్వారా కూడా వినియోగదారులకు మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. పట్టణాల్లో ట్రాఫిక్ పెరుగుతున్న సమయంలో, భద్రతపై అవగాహన కార్యక్రమాలు వేగవంతమవుతున్న నేపథ్యంలో, ఇలాంటి మైలురాళ్లు బాధ్యతాయుత డ్రైవింగ్ వైపు మార్పును సూచిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






