త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Safety Summer Camp | రోడ్డు భ‌ద్ర‌త వేస‌వి శిబిరాన్ని ప్రారంభించిన జాయింట్ సీపీ

P

Hyderabad | Published On May 11, 2026, 7.45 pm IST

Road Safety Summer Camp | రోడ్డు భ‌ద్ర‌త వేస‌వి శిబిరాన్ని ప్రారంభించిన జాయింట్ సీపీ
Advertisement

Road Safety Summer Camp | చిన్నారుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన ‘రోడ్డు భద్రత వేసవి శిబిరాన్ని సోమవారం ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ ప్రారంభించారు. 10 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ శిబిరంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై అవగాహనతో పాటు ప్రాథమిక చికిత్స (BLS), వ్యక్తిత్వ వికాసం, దస్తూరి మెరుగుదల, చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, అగ్నిమాపక భద్రత వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు.

మొత్తం 100 మంది చిన్నారులు ఈ శిబిరానికి నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా జాయింట్ సీపీ జోయల్ డేవిస్ మాట్లాడుతూ చిన్న వయస్సులోనే రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమని తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని, దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆయన సూచించారు. ఇక్కడ నేర్చుకున్న రోడ్డు భద్రత నియమాలను మీ తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులకు తెలియ‌జేయాల‌ని, ట్రాఫిక్ అంబాసిడర్లుగా మారాల‌ని ఆయ‌న విద్యార్థులను సూచించారు. కార్య‌క్ర‌మంలో ట్రాఫిక్-2 డీసీపీ కాజల్ సింగ్, హోండా గ్రూప్ జీఎం శిశిర్ చతుర్వేది, ఆర్యన్ డాన్స్ అకాడమీ నుంచి సరోజ్ బాలా, రాజ్ ఈవెంట్స్‌కు చెందిన అనంత్ రాజ్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement