త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SpaceX | స్పేస్‌ఎక్స్ కు షాక్.. 903 బిలియ‌న్ డాల‌ర్లు ఆవిరి.. ఐపీఓ మార్కెట్‌ల‌కు భారీ దెబ్బ..

SpaceX | స్పేస్‌ఎక్స్ షేర్లు లిస్టింగ్ అనంతరం నమోదైన గరిష్ఠ స్థాయి నుంచి కేవలం నెల రోజుల్లోనే ఐపీఓ ధర కంటే దిగువకు పడిపోవడంతో అమెరికా కొత్త ఐపీఓ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా ఈ ఏడాది స్టాక్ మార్కెట్‌ల‌లో అడుగుపెట్టిన కంపెనీల పనితీరును కొలిచే కీలక సూచిక కూడా బలహీనపడింది.

S

Business | Published On Jul 17, 2026, 12.55 pm IST

SpaceX | స్పేస్‌ఎక్స్ కు షాక్.. 903 బిలియ‌న్ డాల‌ర్లు ఆవిరి.. ఐపీఓ మార్కెట్‌ల‌కు భారీ దెబ్బ..
Advertisement

SpaceX | స్పేస్‌ఎక్స్ షేర్లు లిస్టింగ్ అనంతరం నమోదైన గరిష్ఠ స్థాయి నుంచి కేవలం నెల రోజుల్లోనే ఐపీఓ ధర కంటే దిగువకు పడిపోవడంతో అమెరికా కొత్త ఐపీఓ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా ఈ ఏడాది స్టాక్ మార్కెట్‌ల‌లో అడుగుపెట్టిన కంపెనీల పనితీరును కొలిచే కీలక సూచిక కూడా బలహీనపడింది. కృత్రిమ మేధస్సు (ఏఐ) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి ఇటీవల అత్యంత హాట్‌గా మారిన రంగాలకు చెందిన కొత్తగా లిస్టైన కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ఈ ఏడాదిలో అమెరికాలో వచ్చిన ఐపీఓల వెయిటెడ్ యావరేజ్ రిటర్న్ జూలై 15 నాటికి కేవలం 6 శాతానికి మాత్ర‌మే పరిమితమైంది. ఇదే సమయంలో ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ 11 శాతం రాబడిని నమోదు చేసింది. ఇటీవల మార్కెట్ల‌లో పెరిగిన అస్థిరత, కొత్తగా లిస్టైన కంపెనీల షేర్ ధరల్లో క్షీణత కారణంగా ఐపీఓలపై పెట్టుబడిదారుల ఉత్సాహం తగ్గుతోంది. బ్లాక్‌స్టోన్ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ ఈ ఏడాదిని ఐపీఓల సంవత్సరంగా అభివర్ణించినప్పటికీ, గత రెండు నెలల్లో అమెరికాలో లిస్టైన కంపెనీలలో ఎక్కువ భాగం ప్రస్తుతం తమ ఐపీఓ ధర కంటే తక్కువ స్థాయిలో ట్రేడవుతున్నట్లు బ్లూమ్‌బర్గ్ గణాంకాలు వెల్లడించాయి.

903 బిలియ‌న్ డాల‌ర్లు ఆవిరి..

స్పేస్‌ఎక్స్ షేర్లు తాజాగా మరో 2.97 శాతం క్షీణించాయి. గత తొమ్మిది ట్రేడింగ్ సెషన్లలో ఇది ఎనిమిదో పతనం కావడం గమనార్హం. గత నెల నమోదైన గరిష్ఠ ముగింపు స్థాయి నుంచి కంపెనీ మార్కెట్ విలువలో సుమారు 903 బిలియన్ డాలర్లు ఆవిరయ్యాయి. ఇదే సమయంలో గత వారం రికార్డు స్థాయి 26.5 బిలియన్ డాలర్ల ఐపీఓ ద్వారా నిధులు సమీకరించిన ఎస్‌కే హైనిక్స్ షేర్లు కూడా 12 శాతం పడిపోయి, అమెరికన్ డిపాజిటరీ రిసీట్లు విక్రయించిన 149 డాలర్ల ధరకు కేవలం కొద్ది డాలర్ల దూరంలోకి చేరాయి. రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడా యూఎస్ ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ కో-హెడ్ మైఖేల్ వెంచురా మాట్లాడుతూ సమీప భవిష్యత్తులో ఐపీఓల కార్యకలాపాలు ముందుగా ఊహించినంత బిజీగా ఉండే అవ‌కాశం లేద‌ని అన్నారు. కొన్ని ప్రధాన కంపెనీల లావాదేవీలు కొనసాగినా, ప్రముఖ పేర్లకు వెలుపల మార్కెట్ కొంత నెమ్మదించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అభిప్రాయపడ్డారు.

ఆశించిన స్థాయిలో లేని ఐపీఓ మార్కెట్‌..

స్పేస్‌ఎక్స్, ఎస్‌కే హైనిక్స్ వంటి భారీ ఐపీఓలను పక్కన పెట్టినా కూడా, అమెరికా ఐపీఓ మార్కెట్ పనితీరు ఆశించినంత బలంగా లేదని గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ ఏడాదిలో లిస్టైన అమెరికా ఐపీఓల వెయిటెడ్ యావరేజ్ రిటర్న్ జూలై 15 నాటికి సుమారు 10 శాతంగా ఉండగా, ఇది కూడా ఎస్ అండ్ పీ 500 రాబడికంటే స్వల్పంగా వెనుకబడింది. గత నెల రోజులుగా మార్కెట్‌లో కనిపిస్తున్న అస్థిరత కారణంగా పెట్టుబడిదారులు గతంలో ఎక్కువ ఆదరణ పొందిన ఏఐ వంటి రంగాల నుంచి నిధులను ఇతర రంగాల వైపు మళ్లిస్తున్నారు. ఈ కాలంలో ఎస్ అండ్ పీ 500 దాదాపు 0.3 శాతం మాత్రమే పెరిగినప్పటికీ, ఫిలడెల్ఫియా సెమీకండక్టర్ ఇండెక్స్ 11 శాతం పడిపోయింది. అలాగే మొమెంటమ్ స్టాక్స్ బాస్కెట్ కూడా 8 శాతానికి పైగా క్షీణించింది. మోర్గాన్ స్టాన్లీ గ్లోబల్ ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ కో-హెడ్ ఎడ్డీ మోలాయ్ మాట్లాడుతూ ఏఐ థీమ్ కారణంగా ఐపీఓలు ప్రారంభంలో మంచి ప్రదర్శన కనబరిచాయని, అయితే ప్రస్తుతం మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా ఆ జోరు కొంత తగ్గడం సహజమేనని చెప్పారు.

వినియోగ‌దారుల రంగం కీల‌కం..

ఇప్పుడు పెట్టుబడిదారుల దృష్టి ఏఐ రంగానికి దూరంగా ఉన్న వినియోగదారుల రంగ కంపెనీలపై పడే అవకాశం ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. బ్లాక్‌స్టోన్ మద్దతు ఉన్న జెర్సీ మైక్స్ సబ్స్, గ్యాస్ స్టేషన్, కన్వీనియన్స్ స్టోర్ ఆపరేటర్ కంబర్లాండ్ ఫార్మ్స్ సంస్థలు వ‌చ్చే సోమవారం నుంచే తమ ఐపీఓల మార్కెటింగ్‌ను ప్రారంభించే అవకాశం ఉన్న‌ట్లు తెలిసింది. మే నెలలో సుజా లైఫ్ లిస్టింగ్ తర్వాత వినియోగదారుల రంగంలో పెద్ద ఐపీఓలు ఇవే కావడం విశేషం. అయితే ఈ ఏడాది లిస్టైన వినియోగదారుల కంపెనీల పనితీరు కూడా బలహీనంగానే ఉంది. సుజా లైఫ్ షేరు 48 శాతం క్షీణించగా, యెస్‌వే కేవలం 3.3 శాతం మాత్రమే లాభపడింది. అయితే రెండో అర్ధభాగంలో మార్కెట్ మళ్లీ పుంజుకునే అవకాశాన్ని విశ్లేషకులు పూర్తిగా తోసిపుచ్చడం లేదు. ఆంత్రోపిక్ అక్టోబర్ నాటికే ఐపీఓకు రావచ్చని బ్లూమ్‌బర్గ్ న్యూస్ ఇప్పటికే వెల్లడించింది. దీంతో మార్కెట్లో మళ్లీ భారీ ఉత్సాహం నెలకొనే అవకాశం ఉందని భావిస్తున్నారు.

సెప్టెంబ‌ర్‌లో ఐపీవోలు పుంజుకుంటాయా..?

కాగా వాల్ స్ట్రీట్‌కు చెందిన ప్రధాన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు రెండో త్రైమాసికంలో ఈక్విటీ ఆఫరింగ్స్‌కు సంబంధించిన సలహా సేవల ద్వారా 2021 తర్వాత అత్యధిక ఆదాయాన్ని నమోదు చేశాయి. దీనికి స్పేస్‌ఎక్స్ రికార్డు స్థాయి ఐపీఓతోపాటు ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో భారీగా నిధుల సమీకరణ జరగడం ప్రధాన కారణంగా నిలిచింది. బ్లూమ్‌బర్గ్ గణాంకాల ప్రకారం స్పెషల్ పర్పస్ అక్విజిషన్ కంపెనీలు, ఇతర ఆర్థిక వాహనాలను మినహాయించి, జూలై 16 నాటికి అమెరికా కంపెనీలు ఐపీఓల ద్వారా ఇప్పటికే 157 బిలియన్ డాలర్లకు పైగా నిధులను సమీకరించాయి. సెప్టెంబర్‌లో లేబర్ డే సెలవుల అనంతరం ఐపీఓల ప్రవాహం మళ్లీ వేగం అందుకుంటుందని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మోర్గాన్ స్టాన్లీ గ్లోబల్ ఈసీఎం కో-హెడ్ ఆర్నాడ్ బ్లాంచార్డ్ మాట్లాడుతూ మార్కెట్‌ల‌లో అస్థిరత ఐపీఓలపై ప్రభావం చూపుతున్నప్పటికీ, రాబోయే త్రైమాసికాల్లో మార్కెట్లోకి వచ్చే కొత్త ఒప్పందాలపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గినట్లు కనిపించడం లేదని పేర్కొన్నారు.

Advertisement
Advertisement