త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Prepayment Penalties | ఇకపై ప‌ర్స‌న‌ల్ లోన్ ప్రీ పేమెంట్‌కు పెనాల్టీలు ఉండ‌వు..? నిర్ణ‌యం తీసుకోనున్న ఆర్‌బీఐ..?

Prepayment Penalties | దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం అధిక శాతం మంది ప‌ర్స‌న‌ల్ లోన్ల‌ను తీసుకుంటున్నారు. అత్య‌వ‌స‌ర ఖ‌ర్చుల‌కు ఈ లోన్ల‌ను తీసుకుని ఉప‌యోగించుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే దేశంలోని అనేక ప్ర‌భుత్వ‌, ప్రైవేటు బ్యాంకుల‌తోపాటు ఆర్థిక సంస్థ‌లు కూడా ప‌ర్స‌న‌ల్ లోన్ల‌ను ఎక్కువ‌గా ఇచ్చేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నాయి.

S

Business | Published On Feb 21, 2026, 10.51 am IST

Prepayment Penalties | ఇకపై ప‌ర్స‌న‌ల్ లోన్ ప్రీ పేమెంట్‌కు పెనాల్టీలు ఉండ‌వు..? నిర్ణ‌యం తీసుకోనున్న ఆర్‌బీఐ..?
Advertisement

Prepayment Penalties | దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం అధిక శాతం మంది ప‌ర్స‌న‌ల్ లోన్ల‌ను తీసుకుంటున్నారు. అత్య‌వ‌స‌ర ఖ‌ర్చుల‌కు ఈ లోన్ల‌ను తీసుకుని ఉప‌యోగించుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే దేశంలోని అనేక ప్ర‌భుత్వ‌, ప్రైవేటు బ్యాంకుల‌తోపాటు ఆర్థిక సంస్థ‌లు కూడా ప‌ర్స‌న‌ల్ లోన్ల‌ను ఎక్కువ‌గా ఇచ్చేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నాయి. గ‌తంలో మాదిరిగా కాకుండా ప్ర‌స్తుతం ఈ లోన్లు చాలా త్వ‌ర‌గా ల‌భిస్తున్నాయి. కొన్ని నిమిషాల‌తోపాటు కొన్ని గంట‌ల్లోనే రుణం మంజూరు కావ‌డం, త‌క్కువ ప‌త్రాలు, పూర్తిగా ఆన్‌లైన్ ప్రాసెస్ కావ‌డంతో ప‌ర్స‌నల్ లోన్ల‌ను పొందం చాలా తేలికైంది. అయితే లోన్ల‌ను తీసుకునే వర‌కు బాగానే ఉంటుంది. కానీ ఇత‌ర విష‌యాల్లో క‌చ్చితంగా జాగ్ర‌త్త‌లు వ‌హించాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా లోన్ డిఫాల్ట్‌, రీపేమెంట్‌, ఇత‌ర నిబంధ‌న‌ల‌ను పూర్తిగా తెలుసుకోవాల‌ని చెబుతున్నారు.

1 నుంచి 5 శాతం మ‌ధ్య‌..

ప‌ర్స‌న‌ల్ లోన్ల‌ను తీసుకునే వారు చాలా మంది ప్రీ పేమెంట్ పెనాల్టీ గురించి అంత‌గా పట్టించుకోరు. కానీ దీని గురించి ముందే తెలుసుకోవాల్సి ఉంటుంది. లోన్‌ను గ‌డువు తీర‌క‌ముందే పూర్తిగా రుణం లేదా కొంత మొత్తాన్ని చెల్లిస్తే బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు ఈ పెనాల్టీని వ‌సూలు చేస్తాయి. ఇది బ్యాంకుల‌ను బ‌ట్టి మారుతుంది. రుణ‌గ్ర‌హీత ముంద‌స్తుగా చెల్లింపులు చేస్తే బ్యాంకుల‌కు వ‌డ్డీ న‌ష్టం జ‌రుగుతుంది. అందుక‌నే బ్యాంకులు ముందస్తు చెల్లింపుల‌కు పెనాల్టీని వ‌సూలు చేస్తాయి. సాధార‌ణంగా ఇది బాకీ ఉన్న లోన్ మొత్తంపై 1 నుంచి 5 శాతం మ‌ధ్య ఉంటుంది. ప్రీ పేమెంట్‌ పెనాల్టీ గురించి లోన్ తీసుకునే ముందే అన్ని విష‌యాల‌ను తెలుసుకోవాల్సి ఉంటుంది.

అదే కార‌ణమా..?

చాలా వ‌ర‌కు బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు అధిక మొత్తంలో ప్రీ పేమెంట్‌ పెనాల్టీ చార్జిల‌ను వసూలు చేస్తున్నాయ‌ని, దీని వ‌ల్ల ప‌ర్స‌న‌ల్ లోన్లు, చిన్న‌-సూక్ష్మ త‌ర‌హా వ్యాపారాలు చేసేవారికి ముందస్తు లోన్ చెల్లింపుల‌కు భారం ప‌డుతుంద‌ని ఆర్‌బీఐ భావిస్తోంది. అందుక‌నే ఈ ప్రీ పేమెంట్‌ పెనాల్టీ లేదా ప్రీ పేమెంట్ చార్జిల‌ను ర‌ద్దు చేయాల‌ని ఆలోచిస్తోంది. ఆర్‌బీఐ నిజంగా అలా చేస్తే ఎంతో మంది రుణ గ్ర‌హీత‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే ప్ర‌స్తుతానికి ఈ నిర్ణ‌యం ఇంకా ప్ర‌తిపాద‌న ద‌శ‌లోనే ఉంది. కానీ దీనిపై ఆర్‌బీఐ త్వ‌ర‌లోనే ఓ నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని తెలుస్తోంది.

Advertisement
Advertisement