త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Solar Power | నష్టాలొస్తున్నాయి.. ధరలు పెంచండి..

Solar Power | భారత్‌లో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరుతున్న నేపథ్యంలో దేశీయ సోలార్ పరిశ్రమ పవర్ ఎక్స్చేంజ్‌లలో విద్యుత్ ధరల పరిమితిని పెంచాలని కేంద్ర విద్యుత్ మార్కెట్ నియంత్రణ సంస్థను కోరింది. ప్రస్తుతం అమల్లో ఉన్న యూనిట్‌కు రూ.10 ధర పరిమితి కారణంగా కంపెనీల లాభదాయకత దెబ్బతింటోందని, పెట్టుబడులు కూడా మందగిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

S

Business | Published On May 20, 2026, 12.43 pm IST

Solar Power | నష్టాలొస్తున్నాయి.. ధరలు పెంచండి..
Advertisement

Solar Power | భారత్‌లో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరుతున్న నేపథ్యంలో దేశీయ సోలార్ పరిశ్రమ పవర్ ఎక్స్చేంజ్‌లలో విద్యుత్ ధరల పరిమితిని పెంచాలని కేంద్ర విద్యుత్ మార్కెట్ నియంత్రణ సంస్థను కోరింది. ప్రస్తుతం అమల్లో ఉన్న యూనిట్‌కు రూ.10 ధర పరిమితి కారణంగా కంపెనీల లాభదాయకత దెబ్బతింటోందని, పెట్టుబడులు కూడా మందగిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. నేష‌న‌ల్ సోలార్ ఎన‌ర్జీ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా కేంద్ర విద్యుత్ నియంత్రణ కమిషన్‌కు సమర్పించిన పిటిషన్‌లో, ప్రస్తుత ధర పరిమితి వల్ల ముఖ్యంగా ఎనర్జీ స్టోరేజ్ సంస్థలు ఆర్థికంగా నిలదొక్కుకోవడం కష్టమవుతోందని తెలిపింది. విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్న సమయంలో ధరలపై కఠిన పరిమితి ఉండటం వల్ల మార్కెట్‌లో సమతుల్యత దెబ్బతింటోందని పేర్కొంది.

భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం..

దేశంలో తీవ్ర వ‌డ‌గాలుల కారణంగా గత రెండు రోజులుగా విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశ పీక్ పవర్ డిమాండ్ రోజుకు 260.45 గిగావాట్లకు చేరి కొత్త రికార్డు నమోదు చేసింది. మంగ‌ళ‌వారం ఈ రికార్డుకు చేర‌గా, అంతకుముందు సోమవారం నమోదైన 257.37 గిగావాట్ల రికార్డును ఇది అధిగమించింది. అధిక ధరలకు విద్యుత్ విక్రయించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మరో మార్కెట్ సెగ్మెంట్ కూడా ఆశించిన విధంగా పనిచేయడం లేదని పరిశ్రమ సంఘం పేర్కొంది. అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు ముందుకు రావడం చాలా తక్కువగా ఉందని రెగ్యులేటర్ దృష్టికి తీసుకెళ్లింది.

న‌ష్టాల‌ను భ‌ర్తీ చేసే దారేదీ..?

డిమాండ్ తక్కువగా ఉన్న సమయంలో విద్యుత్ ఉత్పత్తిదారులు తక్కువ ధరలకు విద్యుత్ విక్రయించాల్సి వస్తోందని, కానీ డిమాండ్ పెరిగినప్పుడు ధరల పరిమితి కారణంగా ఆ నష్టాలను భర్తీ చేసుకునే అవకాశం లేకుండా పోతోందని సంస్థ వివరించింది. ప్రస్తుతం ఉన్న ధర పరిమితిని కొనసాగించడం వల్ల ఎనర్జీ స్టోరేజ్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడులు తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించింది. భవిష్యత్తులో విద్యుత్ సరఫరా-డిమాండ్ మధ్య వచ్చే హెచ్చుతగ్గులను సమర్థంగా నిర్వహించడానికి ఎనర్జీ స్టోరేజ్ కీలకమని పేర్కొంది. ఈ అంశంపై విచారణ పూర్తి చేసిన నియంత్రణ సంస్థ ప్రస్తుతం తన నిర్ణయాన్ని రిజర్వ్‌లో ఉంచింది.

Advertisement
Advertisement