త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Silver Prices Crash | వెండి ధరలకు భారీ షాక్.. రికార్డు స్థాయి నుంచి 30 శాతం పతనం.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇవే

వెండి ధరలు అమాంతం కుప్పకూలాయి. అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా ఫెడ్ చైర్మన్‌గా కెవిన్ వార్ష్ ఎంపికతో వెండి ధరల్లో భారీ పతనం చోటుచేసుకుంది. హైదరాబాద్, ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లో తాజా రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

J

Business | Published On Jan 31, 2026, 7.07 pm IST

Silver Prices Crash | వెండి ధరలకు భారీ షాక్.. రికార్డు స్థాయి నుంచి 30 శాతం పతనం.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇవే
Advertisement

Silver Prices Crash | త్రినేత్ర.న్యూస్ : గత కొన్ని వారాలుగా రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. శుక్రవారం (జనవరి 30) మార్కెట్‌లో వెండి ధరలు భారీగా కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో, దేశీయ ఎంసీఎక్స్ (MCX)లో వెండి ధరలు గరిష్ట స్థాయిల నుండి దాదాపు 30 శాతం మేర పతనమయ్యాయి. వెండి ధరలు ఇంత భారీగా తగ్గడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి.

అమెరికా ఫెడ్ ఎఫెక్ట్

అమెరికా తదుపరి ఫెడరల్ రిజర్వ్ చైర్మన్‌గా డొనాల్డ్ ట్రంప్.. 'కెవిన్ వార్ష్' (Kevin Warsh)ను నామినేట్ చేయడం మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. కఠిన ఆర్థిక విధానాలకు పెట్టింది పేరైన వార్ష్ రాకతో వడ్డీ రేట్లు పెరుగుతాయన్న అంచనాలు వెండికి ప్రతికూలంగా మారాయి.

బలపడిన డాలర్

ఫెడ్ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికన్ డాలర్ ఒక్కసారిగా పుంజుకుంది. డాలర్ బలపడటంతో వెండి వంటి కమోడిటీల ధరలు దిగివచ్చాయి.

లాభాల స్వీకరణ (Profit Booking)

గత కొన్ని రోజులుగా వెండి ధరలు విపరీతంగా పెరగడంతో, పెట్టుబడిదారులు లాభాలను వెనక్కి తీసుకునేందుకు అమ్మకాలకు దిగారు. దీంతో ధరలు ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి.

ప్రధాన నగరాల్లో వెండి రేట్లు (సుమారుగా)

హైదరాబాద్: రూ. 2,92,740, ఢిల్లీ: రూ. 2,91,770, చెన్నై: రూ. 2,93,130, బెంగళూరు: రూ. 2,92,510, కోల్‌కతా: రూ. 2,91,890.

 

Advertisement

తాజావార్తలు

Advertisement