Gold-Silver Today | బంగారం, వెండి ధర మరింత పతనం.. వెండి కిలోకు రూ.27వేలు డౌన్..!
Gold-Silver Today | ఇటీవల గతంలో ఎన్నడూ లేనివిధంగా సరికొత్త జీవితకాల గరిష్టాలకు చేరిన బంగారం ధరలు ప్రస్తుతం నేల చూపులు చూస్తున్నాయి. ఆదివారం సైతం బులియన్ మార్కెట్‌లో ధరలు కుప్పకూలాయి. బడ్జెట్‌కు ముందు స్టాక్ మార్కెట్‌తో పాటు కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో ట్రేడింగ్ కొనసాగుతోంది.
Gold-Silver Today | ఇటీవల గతంలో ఎన్నడూ లేనివిధంగా సరికొత్త జీవితకాల గరిష్టాలకు చేరిన బంగారం ధరలు ప్రస్తుతం నేల చూపులు చూస్తున్నాయి. ఆదివారం సైతం బులియన్ మార్కెట్‌లో ధరలు కుప్పకూలాయి. బడ్జెట్‌కు ముందు స్టాక్ మార్కెట్‌తో పాటు కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో ట్రేడింగ్ కొనసాగుతోంది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే ధరలు నేలచూపులు చూశాయి. వెండి ధర భారీగా పతనమైంది. వెండి కిలోకు రూ.27వేలకుపైగా తగ్గింది. దాంతో పెట్టుబడిదారులు భయాందోళనలకు గురవుతున్నారు. బంగారం సైతం రూ.13వేలకుపైగా తగ్గింది. కేంద్ర బడ్జెట్ 2026-27కు ముందు ఆదివారం ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధరలు 9 శాతం వరకు పడిపోయాయి.
శనివారం బంగారం, వెండి ధరలు భారీగా పతనమైన విషయం తెలిసిందే. గురువారం వెండి తొలిసారిగా కిలోకు రూ.4 లక్షలు దాటింది. వెండి ధర రూ. 4,20,048 వద్ద జీవితకాల గరిష్ట స్థాయికి చేరిన విషయం తెలిసిందే. బడ్జెట్ రోజున సైతం పతనం కొనసాగింది. వెండి ధర సుమారు 9 శాతం.. రూ. 26,273 కంటే ఎక్కువ తగ్గి కిలోకు రూ.2,65,652 లక్షలకు చేరుకుంది. మరో వైపు బంగారం పరిస్థితి దాదాపు ఇలానే ఉన్నది. గురువారం ఏప్రిల్ డెలివరికి సంబంధించి ఎంసీఎక్స్‌లో తులం బంగారం రూ.1,93,096 వద్ద రికార్డు స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత రూ. 42,247 తగ్గి రూ.1,50,849కి చేరుకుంది. ఆదివారం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే, మరోసారి అమ్మకాలతో ధర 8.80శాతం పడిపోయింది. 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 13,711 తగ్గి రూ.1,38,634కి చేరింది.
పార్లమెంట్‌లో బడ్జెట్‌కి మార్కెట్‌లో ట్రేడింగ్ కొనసాగుతుంది. గతంలో ఎన్నడూలేని విధంగా పెరుగుతూ వచ్చిన ధరలు ఒక్కసారిగా పతనమవుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. ఇప్పటికే భారీగా తగ్గిన ధరలు మరింత తగ్గుతాయన్న భయాందోళనలున్నాయి. ధరల పతనంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఫలితంగా ఆదివారం భారీ అమ్మకాలు జరగవచ్చని భావించారు. ఫ్యూచర్స్ ట్రేడింగ్ ప్రారంభమైన ఊహించినట్లుగా ధరలు తగ్గాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




