PMS Investors | పీఎంఎస్ ఇన్వెస్టర్లకు సెబీ గుడ్‌న్యూస్.. షేర్లను తాకట్టు పెట్టి రుణం పొందవచ్చు..
PMS Investors | భారత మార్కెట్ నియంత్రణ సంస్థ (SEBI) నాన్-డిస్క్రిషనరీ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (ఎన్‌డీ-పీఎంఎస్) కింద ఉన్న ఇన్వెస్టర్లకు కీలక స్పష్టత ఇచ్చింది. ఇకపై పీఎంఎస్ అకౌంట్లలో ఉన్న షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు క్లయింట్లకు అవకాశం ఉందని సెబీ వెల్లడించింది. దీంతో వెల్త్ మేనేజ్‌మెంట్, పీఎంఎస్ రంగాలకు పెద్ద ఊరట లభించినట్టైంది.
PMS Investors | భారత మార్కెట్ నియంత్రణ సంస్థ (SEBI) నాన్-డిస్క్రిషనరీ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (ఎన్‌డీ-పీఎంఎస్) కింద ఉన్న ఇన్వెస్టర్లకు కీలక స్పష్టత ఇచ్చింది. ఇకపై పీఎంఎస్ అకౌంట్లలో ఉన్న షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు క్లయింట్లకు అవకాశం ఉందని సెబీ వెల్లడించింది. దీంతో వెల్త్ మేనేజ్‌మెంట్, పీఎంఎస్ రంగాలకు పెద్ద ఊరట లభించినట్టైంది. జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో సెబీ ఈ స్పష్టత ఇచ్చింది. సెబీ రిజిస్టర్‌డ్ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌గా ఉన్న జియోజిత్, పీఎంఎస్ ఖాతాల్లోని షేర్లను క్లయింట్లు రుణాల కోసం తాకట్టు పెట్టవచ్చా? అది ప్రస్తుత నిబంధనలకు విరుద్ధమా? అనే అంశంపై మార్గదర్శకత్వం కోరింది. పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్ అంటే నిపుణులు క్లయింట్ల తరఫున షేర్ పోర్ట్‌ఫోలియోను నిర్వహించే ఇన్వెస్ట్‌మెంట్ సర్వీస్. నాన్-డిస్క్రిషనరీ మోడల్‌లో పెట్టుబడి నిర్ణయాలన్నీ క్లయింట్ కే ఉంటాయి. పోర్ట్‌ఫోలియో మేనేజర్ కేవలం ట్రేడ్లను అమలు చేస్తారు.
మేనేజర్‌కు సంబంధం ఉండదు..
సెబీ తాజా స్పష్టీకరణలో షేర్ల యాజమాన్యం పూర్తిగా క్లయింట్ పేరులోనే కొనసాగుతుందని పేర్కొంది. అందువల్ల క్లయింట్లు తమ నిర్ణయంతో వాటిని కొలెటరల్‌గా ఉపయోగించి రుణాలు పొందవచ్చని తెలిపింది. ఈ ప్రక్రియను పోర్ట్‌ఫోలియో మేనేజర్ తీసుకున్న అప్పుగా పరిగణించబోమని కూడా సెబీ స్పష్టం చేసింది. సాధారణంగా పీఎంఎస్ నిబంధనల ప్రకారం పోర్ట్‌ఫోలియో మేనేజర్లు అప్పులు తీసుకోవడం నిషేధం. ఇంకో కీలక అంశంగా, తాకట్టు పెట్టిన షేర్లను కూడా అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ (ఏయూఎం)లో కొనసాగించి లెక్కించేందుకు సెబీ అనుమతి ఇచ్చింది. అయితే ఇందుకు ఒక షరతు విధించింది. రుణదాతలు ఆ షేర్లపై ప్లెడ్జ్‌ను ఇన్వోక్ చేయకపోతేనే వాటిని ఏయూఎంలో చూపించవచ్చు. దీంతో పీఎంఎస్ సంస్థల ప్రకటించే ఏయూఎం గణాంకాలపై ప్రభావం ఉండదు.
పూర్తిగా క్లయింట్ నిర్ణయమే..
అయితే సెబీ ఒక స్పష్టమైన గీత కూడా గీసింది. రుణ ప్రక్రియలో పోర్ట్‌ఫోలియో మేనేజర్‌కు ఎలాంటి పాత్ర ఉండకూడదని తెలిపింది. షేర్లను తాకట్టు పెట్టే నిర్ణయం పూర్తిగా క్లయింట్ స్వచ్ఛంద నిర్ణయమే కావాలని పేర్కొంది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ నిర్ణయం పీఎంఎస్, వెల్త్ మేనేజ్‌మెంట్ రంగాలకు అనుకూలంగా మారనుంది. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను విక్రయించకుండా లిక్విడిటీ పొందే అవకాశం కలుగుతుంది. అలాగే పీఎంఎస్ క్లయింట్లను లక్ష్యంగా చేసుకుని లోన్ అగెనెస్ట్ షేర్స్ ఉత్పత్తులను విస్తరించేందుకు రుణదాతలకు కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. అయితే రిస్క్‌లు కూడా ఉన్నాయని సెబీ పరోక్షంగా హెచ్చరించింది. రుణ చెల్లింపులో డిఫాల్ట్ జరిగితే రుణదాతలకు తాకట్టు పెట్టిన షేర్లను విక్రయించే హక్కు ఉంటుంది. మార్కెట్‌లో ఒత్తిడి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇది వోలాటిలిటీ పెరగడానికి కూడా కారణమయ్యే అవకాశం ఉంటుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026

Nithin Kamath | బ్రోకరేజీ సంస్థలకు జీరోధా నితిన్ కామత్ హెచ్చరిక.. ఎంటీఎఫ్లపై అంత ఎక్స్పోజర్ వద్దు..
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



