SBI Mutual Funds IPO | ఎస్‌బీఐ నుంచి భారీ ఐపీవో.. రూ.14వేల కోట్లకు ఇష్యూ.. పెట్టుబడిదారుల ఆసక్తి..
SBI Mutual Funds IPO | స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారికి ఐపీవోలు వరంగా మారుతుంటాయి. చాలా వరకు ఐపీవో లిస్టింగ్ అయ్యాక పెట్టుబడిదారులు లాభాలనే పొందుతుంటారు. ఎందుకంటే కంపెనీల పోర్ట్‌ఫోలియో, ఇతర అంశాలు పెట్టుబడిదారులకు ఆసక్తికరంగా కనిపిస్తాయి.
SBI Mutual Funds IPO | స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారికి ఐపీవోలు వరంగా మారుతుంటాయి. చాలా వరకు ఐపీవో లిస్టింగ్ అయ్యాక పెట్టుబడిదారులు లాభాలనే పొందుతుంటారు. ఎందుకంటే కంపెనీల పోర్ట్‌ఫోలియో, ఇతర అంశాలు పెట్టుబడిదారులకు ఆసక్తికరంగా కనిపిస్తాయి. దీంతో వారు ఐపీవోకు భారీ ఎత్తున దరఖాస్తు చేసుకుంటారు. కానీ కొందరికే షేర్లు అలాట్ అవుతాయి. ఈ క్రమంలో ఐపీవో లిస్ట్ అయి అందుబాటులోకి రాగానే షేర్ ధర అమాంతం పెరుగుతుంది. దీంతో అంతకు ముందు లాట్‌లను దక్కించుకున్న వారు లాభాలకు విక్రయిస్తారు. అయితే ఐపీవోలో పెట్టుబడి పెట్టడం చాలా సులభమే అయినా ప్రతి ఐపీవో లాభాలను ఇవ్వదని, ముందుగా పలు విషయాలను పరిశీలించాల్సి ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ ఏడాదిలో భారీ ఎత్తున ప్రముఖ సంస్థలకు చెందిన ఐపీవోలు లిస్ట్ కానున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు సరైన ఐపీవోను ఎంచుకోవాలని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ సంస్థలకు చెందిన ఐపీవోలను ఎంచుకుంటే లాభాలను పొందవచ్చని వారు సూచిస్తున్నారు.
రూ.14 వేల కోట్ల సమీకరణ..
ఇటీవలి కాలంలో అనేక సంస్థలకు చెందిన ఐపీవోలు లిస్ట్ అయ్యాయి. ఇకముందు కూడా అవి రానున్నాయి. అయితే అతి త్వరలోనే ప్రముఖ ప్రభుత్వ బ్యాంకింగ్ సంస్థ ఎస్‌బీఐకి చెందిన మ్యుచువల్ ఫండ్ విభాగం కంపెనీ ఐపీవో కూడా లిస్ట్ కానుంది. ఎస్‌బీఐ మ్యుచువల్ ఫండ్స్ మేనేజ్‌మెంట్ సంస్థ ఐపీవోకు సిద్ధమవుతోంది. దీంతో పెట్టుబడిదారుల ఆసక్తి ఈ సంస్థపై పెరిగింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కావడంతో ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ ఐపీవో ద్వారా రూ.14వేల కోట్ల నిధులను సమీకరించాలని ఎస్‌బీఐ మ్యుచువల్ ఫండ్స్ సంస్థ లక్ష్యంగా నిర్ణయించుకుంది. అయితే భారీ క్యాపిటల్ కావడం, ప్రముఖ సంస్థ అయినందున పెట్టుబడిదారుల నుంచి భారీ ఎత్తున నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ ఐపీవోపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది.
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌తో ఢీ..
ఎస్‌బీఐ మ్యుచువల్ ఫండ్స్ మేనేజ్‌మెంట్ సంస్థ వచ్చే వారంలోనే ఐపీవో ప్రక్రియను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ముందు ప్రీ అలాట్‌మెంట్ ద్వారా రూ.3వేల కోట్లను సమీకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. అయితే దీనిపై ప్రస్తుతం ఎస్‌బీఐ ఇతర బ్యాంకర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎస్‌బీఐ ఫండ్స్ సంస్థ వాల్యుయేషన్ సుమారుగా రూ.1.41 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్‌తో ఎస్‌బీఐ సంస్థ పోటీ పడనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మార్కెట్ విలువ రూ.1.65 లక్షల కోట్ల వరకు ఉంటుందని సమాచారం. దీంతో ఎస్‌బీఐ నేరుగా ఆ కంపెనీని ఢీకొడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎస్‌బీఐ మ్యుచువల్ ఫండ్స్ సంస్థ తన ఐపీవో కోసం 9 మర్చంట్ బ్యాంకర్లను నియమించుకుంది. కోటక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంకు, ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్, జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్, హెచ్ఎస్‌బీసీ వంటి సంస్థలు ఆ జాబితాలో ఉన్నాయి.
పెట్టుబడిదారుల ఆసక్తి..
అయితే తమ మ్యుచువల్ ఫండ్ సంస్థకు చెందిన ఐపీవో లిస్ట్ అవుతున్నందున ఎస్‌బీఐ ఓ రోడ్ షో కార్యక్రమాన్ని కూడా నిర్వహించనుంది. ఇందులో భాగంగా పెట్టుబడిదారులను పెద్ద ఎత్తున ఆకర్షించాలని ఆ సంస్థ లక్ష్యంగా నిర్ణయించుకుంది. తమ కంపెనీ షేర్లను విక్రయించే ముందు ఆ సంస్థ వివరాలను, ముఖ్యంగా లాభాలు, వృద్ధి రేటు, అభివృద్ధి అంచనాలను వివరించడం ద్వారా భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా ఆ రోడ్ షోను చేపట్టనుంది. అయితే ఎస్‌బీఐ మ్యుచువల్ ఫండ్స్ ఐపీవో ఓపెన్, క్లోజ్ తేదీలు, లాట్ సైజ్, ఇతర వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించకపోయినా, లాభాలు, వృద్ధి గణనీయంగా పెరగడంతో చాలా మంది పెట్టుబడిదారులు ఈ ఐపీవో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ నిపుణుల సలహా మేరకు పెట్టుబడులు పెట్టడం మంచిదని సూచిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



