త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SBI | భారీగా పెరిగిన ఎస్‌బీఐ ఆదాయం.. ఒక్కో షేరుకు రూ.17.35 డివిడెండ్‌ ప్ర‌క‌ట‌న‌..

SBI | దేశంలోనే అతిపెద్ద రుణదాత అయిన ఎస్‌బీఐ తన 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఫలితాలతోపాటు షేర్‌హోల్డర్లకు డివిడెండ్‌ను ప్రకటించింది. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఒక్కో ఈక్విటీ షేర్‌పై రూ.17.35 డివిడెండ్‌ను ప్రకటించినట్లు వెల్లడించింది. డివిడెండ్ పొందే అర్హత కలిగిన షేర్‌హోల్డర్లను నిర్ణయించేందుకు మే 16ను రికార్డ్ డేట్‌గా నిర్ణయించగా, డివిడెండ్ చెల్లింపు తేదీగా జూన్ 4ను ఖరారు చేసింది.

S

Business | Published On May 8, 2026, 5.11 pm IST

SBI | భారీగా పెరిగిన ఎస్‌బీఐ ఆదాయం.. ఒక్కో షేరుకు రూ.17.35 డివిడెండ్‌ ప్ర‌క‌ట‌న‌..
Advertisement

SBI | దేశంలోనే అతిపెద్ద రుణదాత అయిన ఎస్‌బీఐ తన 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఫలితాలతోపాటు షేర్‌హోల్డర్లకు డివిడెండ్‌ను ప్రకటించింది. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఒక్కో ఈక్విటీ షేర్‌పై రూ.17.35 డివిడెండ్‌ను ప్రకటించినట్లు వెల్లడించింది. డివిడెండ్ పొందే అర్హత కలిగిన షేర్‌హోల్డర్లను నిర్ణయించేందుకు మే 16ను రికార్డ్ డేట్‌గా నిర్ణయించగా, డివిడెండ్ చెల్లింపు తేదీగా జూన్ 4ను ఖరారు చేసింది. సెబీ (ఎల్‌వోడీఆర్) రెగ్యులేషన్స్ 2015లోని రెగ్యులేషన్ 30(6), రెగ్యులేషన్ 43(1) ప్రకారం 31.03.2026తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేర్‌పై రూ.17.35 (1735 శాతం) డివిడెండ్‌ను బ్యాంక్ సెంట్రల్ బోర్డ్ ప్రకటించింది. డివిడెండ్ అర్హత నిర్ణయానికి రికార్డ్ డేట్ 16.05.2026 కాగా, చెల్లింపు తేదీ 04.06.2026 అని ఎస్‌బీఐ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.

డివిడెండ్ ఈల్ట్ 1.47 శాతం..

ట్రెండ్‌లైన్ డేటా ప్రకారం గత 12 నెలల్లో ఎస్‌బీఐ ఒక్కో షేర్‌పై మొత్తం రూ.15.90 ఈక్విటీ డివిడెండ్ ప్రకటించింది. ప్రస్తుత మార్కెట్ ధరల ఆధారంగా డివిడెండ్ ఈల్డ్ సుమారు 1.47 శాతంగా ఉంది. గత డివిడెండ్‌ను కంపెనీ 2025 మేలో ప్రకటించింది. 2001 నుంచి ఇప్పటివరకు ఈ ప్రభుత్వరంగ బ్యాంక్ 24 సార్లు డివిడెండ్ ప్రకటిస్తూ షేర్‌హోల్డర్లకు స్థిరంగా లాభాలు అందిస్తోంది. ఇక నాలుగో త్రైమాసిక ఫలితాల్లో స్టాండలోన్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 5.6 శాతం పెరిగి రూ.19,683.75 కోట్లకు చేరింది. నెట్ ఇంటరెస్ట్ ఇన్‌కమ్ (ఎన్‌ఐఐ) లేదా ప్రధాన రుణ ఆదాయం జనవరి-మార్చి త్రైమాసికంలో 4.1 శాతం పెరిగి రూ.44,380 కోట్లుగా నమోదైంది. త్రైమాసికంలో క్రెడిట్ వృద్ధి బలంగా కొనసాగినప్పటికీ, బాండ్ ఈల్డ్స్ పెరగడం ట్రెజరీ ఆదాయంపై ప్రభావం చూపిందని రాయిటర్స్ నివేదిక తెలిపింది. ఈల్డ్స్ పెరగడంతో బ్యాంకుల బాండ్ హోల్డింగ్స్ విలువ తగ్గింది.

లాభాలు వచ్చినా క్షీణించిన షేర్ ధ‌ర‌..

ఎస్‌బీఐ ట్రెజరీ ఆపరేషన్స్ ఆదాయం ఏడాది క్రితం రూ.8,991 కోట్లతో పోలిస్తే ఈసారి కేవలం రూ.1,259 కోట్లకు పడిపోయింది. ఇక మార్జిన్లు కూడా తగ్గాయి. ఏడాది క్రితం 3.14 శాతంగా ఉన్న మార్జిన్ ఈసారి 21 బేసిస్ పాయింట్లు తగ్గి 2.93 శాతానికి చేరింది. మొత్తం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఎస్‌బీఐ చరిత్రలోనే అత్యధిక నికర లాభాన్ని నమోదు చేసింది. పూర్తి సంవత్సర నికర లాభం రూ.80,032 కోట్లుగా నమోదై, ఏడాది ప్రాతిపదికన 12.88 శాతం వృద్ధిని సాధించింది. అదే సమయంలో ఆపరేటింగ్ ప్రాఫిట్ 11.25 శాతం పెరిగి రూ.1,23,015 కోట్లకు చేరింది. ఎన్‌ఐఐ 4.08 శాతం వృద్ధి చెందగా, పూర్తి సంవత్సరానికి మొత్తం బ్యాంక్ ఎన్‌ఐఎం 2.91 శాతం, దేశీయ ఎన్‌ఐఎం 3.03 శాతంగా నమోదైంది. ఆర్థిక ఫలితాల ప్రకటన అనంతరం బ్యాంకు షేర్లపై భారీ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. షేర్ ధర 7 శాతానికి పైగా కుప్పకూలి ఒక్కో షేర్ ధర రూ.1,011.30 వరకు పడిపోయింది.

Advertisement
Advertisement