త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SBI | స్టాక్ మార్కెట్ల ప‌త‌నంతో భారీగా న‌ష్ట‌పోయిన ఎస్‌బీఐ

SBI | గత వారం నుంచి భారతీయ ఈక్విటీ మార్కెట్లలో బలహీన ధోరణి కొనసాగడంతో దేశంలోని అత్యంత విలువైన టాప్-10 కంపెనీలలో 8 సంస్థల మార్కెట్ విలువ భారీగా పడిపోయింది. మొత్తం కలిసి రూ.2,81,581.53 కోట్ల మేర మార్కెట్ మూలధనం క్షీణించింది. ఈ క్షీణతలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అత్యధిక నష్టాన్ని చవిచూసింది.

S

Business | Published On Mar 8, 2026, 12.20 pm IST

SBI | స్టాక్ మార్కెట్ల ప‌త‌నంతో భారీగా న‌ష్ట‌పోయిన ఎస్‌బీఐ
Advertisement

SBI | గత వారం నుంచి భారతీయ ఈక్విటీ మార్కెట్లలో బలహీన ధోరణి కొనసాగడంతో దేశంలోని అత్యంత విలువైన టాప్-10 కంపెనీలలో 8 సంస్థల మార్కెట్ విలువ భారీగా పడిపోయింది. మొత్తం కలిసి రూ.2,81,581.53 కోట్ల మేర మార్కెట్ మూలధనం క్షీణించింది. ఈ క్షీణతలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అత్యధిక నష్టాన్ని చవిచూసింది. ఈ వారంలో బీఎస్ఈ సూచీ 2,368.29 పాయింట్లు లేదా 2.91 శాతం పడిపోయింది. రిలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ పరిశోధన విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా మాట్లాడుతూ.. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలు ఆకస్మికంగా పెరగడం పెట్టుబడిదారుల భావోద్వేగాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. దాంతో సెలవుల కారణంగా ఒక సెష‌న్ త‌క్కువైన‌ ఈ వారం మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి.. అని తెలిపారు.

రూ.53వేల కోట్లు త‌గ్గిన ఎస్‌బీఐ విలువ‌..

టాప్-10 కంపెనీలలో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ మాత్రమే లాభాలను నమోదు చేశాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ విలువ రూ.53,952.96 కోట్లు తగ్గి రూ.10,55,567.27 కోట్లకు చేరుకుంది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.46,936.82 కోట్లు తగ్గి రూ.9,40,049.82 కోట్లకు పడిపోయింది. అదే సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.46,552.3 కోట్లు తగ్గి రూ.13,19,107.08 కోట్లకు చేరింది. లార్సెన్ అండ్ టుబ్రో మార్కెట్ విలువ కూడా రూ.45,629.03 కోట్లు తగ్గి రూ.5,43,208.36 కోట్లకు చేరింది.

ఇత‌ర సంస్థ‌లు కూడా న‌ష్టాల్లోనే..

బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.28,934.56 కోట్లు తగ్గి రూ.5,91,136.03 కోట్లకు పడిపోయింది. అలాగే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ విలువ రూ.28,492.44 కోట్లు తగ్గి రూ.9,25,380.15 కోట్లకు చేరింది. హిందుస్తాన్ యూనిలీవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.26,350.67 కోట్లు తగ్గి రూ.5,23,042.51 కోట్లకు పడిపోయింది. భార‌తి ఎయిర్‌టెల్ మార్కెట్ విలువ కూడా రూ.4,732.75 కోట్లు తగ్గి రూ.10,67,120.50 కోట్లకు చేరింది.

రిల‌య‌న్స్‌, ఇన్ఫోసిస్ పెరుగుద‌ల‌..

అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.14,750.39 కోట్లు పెరిగి రూ.19,01,583.05 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా రూ.3,459.99 కోట్లు పెరిగి రూ.5,30,546.54 కోట్లకు చేరింది. దేశీయ కంపెనీలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికీ అత్యధిక మార్కెట్ విలువ కలిగిన సంస్థగా కొనసాగుతోంది. దాని తరువాత వరుసగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భార‌తి ఎయిర్‌టెల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, లార్సెన్ అండ్ టుబ్రో, ఇన్ఫోసిస్, హిందుస్తాన్ యూనిలీవర్ సంస్థలు నిలిచాయి.

Advertisement
Advertisement