త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SBI | IMPS సేవ‌ల‌కు ఇక‌పై చార్జిలు వ‌సూలు.. వెల్ల‌డించిన ఎస్‌బీఐ..

SBI | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు కీలక సమాచారం తెలియ‌జేసింది. ఇకపై కొన్ని ఆన్‌లైన్ IMPS లావాదేవీలపై సేవా రుసుములు (service charges) వసూలు చేయనున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు 2026 ఫిబ్రవరి 15 నుంచి అమలులోకి రానున్నాయి.

S

Business | Published On Jan 21, 2026, 9.24 am IST

SBI | IMPS సేవ‌ల‌కు ఇక‌పై చార్జిలు వ‌సూలు.. వెల్ల‌డించిన ఎస్‌బీఐ..
Advertisement

SBI | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు కీలక సమాచారం తెలియ‌జేసింది. ఇకపై కొన్ని ఆన్‌లైన్ IMPS లావాదేవీలపై సేవా రుసుములు (service charges) వసూలు చేయనున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు 2026 ఫిబ్రవరి 15 నుంచి అమలులోకి రానున్నాయి. ఇప్పటివరకు ఉచితంగా కొనసాగుతున్న కొన్ని లావాదేవీలపై ఇక నుంచి ఛార్జిల‌ను వ‌సూలు చేయ‌నున్నారు. ఆన్‌లైన్ SBI ద్వారా నిర్వ‌హించే IMPS లావాదేవీలలో రూ.25వేల కంటే ఎక్కువగా రూ.5 లక్షల వరకు ఉన్న మొత్తాలపై ఈ సేవా రుసుములు వర్తిస్తాయి. రూ.25వేల నుంచి రూ.1 లక్ష వరకు ట్రాన్స్‌ఫర్ చేస్తే రూ.2 ప్ల‌స్ జీఎస్టీ క‌లిపి ఛార్జ్ విధించనున్నారు. రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పంపితే రూ.6 ప్ల‌స్ జీఎస్టీ, రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ట్రాన్స్‌ఫర్ చేస్తే రూ.10 ప్ల‌స్ జీఎస్టీ క‌లిపి చార్జ్‌ వసూలు చేయనున్నారు.

అయితే బ్రాంచ్ ద్వారా చేసే IMPS లావాదేవీలపై ఇప్పటికే ఉన్న చార్జిల్లో ఎలాంటి మార్పులు లేవని SBI స్పష్టం చేసింది. బ్రాంచ్‌లో రూ.1వేయి వరకు చేసే లావాదేవీలు ఉచితమ‌ని పేర్కొంది. రూ.1వేయి నుంచి రూ.1 లక్ష వరకు ట్రాన్స్‌ఫర్ చేస్తే రూ.4 ప్ల‌స్ జీఎస్టీ, రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రూ.12 ప్ల‌స్ జీఎస్టీ, రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రూ.20 ప్ల‌స్ జీఎస్టీ ఛార్జిలు కొనసాగుతాయ‌ని తెలిపింది.

కొన్ని ప్రత్యేక శాలరీ ప్యాకేజ్ ఖాతాలకు మాత్రం ఈ కొత్త ఛార్జిల నుంచి మినహాయింపు ఇచ్చారు. డిఫెన్స్, పారా మిలిటరీ, ఇండియన్ కోస్ట్ గార్డ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్, రైల్వే, కార్పొరేట్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర యూనివర్సిటీ శాలరీ ప్యాకేజ్ ఖాతాలు, SBI రిష్తే ఖాతాదారులకు IMPS ఛార్జిలు వర్తించవు. IMPS ద్వారా రోజుకు గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చని ఈ సంద‌ర్భంగా బ్యాంక్ తెలిపింది. అయితే ప్రతి బ్యాంక్ తన విధానాల ప్రకారం డైలీ లిమిట్‌ను నిర్ణయించుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది.

Advertisement

తాజావార్తలు

Advertisement