AEPS Scam | ఓటీపీ లేదు.. పాస్‌వర్డ్ లేదు.. అయినా బ్యాంక్ ఖాతా ఖాళీ..
AEPS Scam | మీ ఆధార్ నంబర్, వేలిముద్ర (ఫింగర్‌ప్రింట్) మాత్రమే ఉపయోగించి ఓటీపీ లేకుండా, పాస్‌వర్డ్ లేకుండా మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు కొట్టేస్తే ఎలా ఉంటుంది? ఇదే ప్రస్తుతం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విస్తరిస్తోంది. దీన్నే AEPS (ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్) మోసంగా పిలుస్తున్నారు.
AEPS Scam | మీ ఆధార్ నంబర్, వేలిముద్ర (ఫింగర్‌ప్రింట్) మాత్రమే ఉపయోగించి ఓటీపీ లేకుండా, పాస్‌వర్డ్ లేకుండా మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు కొట్టేస్తే ఎలా ఉంటుంది? ఇదే ప్రస్తుతం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విస్తరిస్తోంది. దీన్నే AEPS (ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్) మోసంగా పిలుస్తున్నారు. ఇది సాధారణ ఆన్‌లైన్ మోసం కాదు. ఆధార్ బయోమెట్రిక్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ జరుగుతున్న కొత్త తరహా సైబర్ నేరం. ముందుగా మోసగాళ్లు బాధితుల ఆధార్ వివరాలు, బయోమెట్రిక్ డేటా (వేలిముద్రలు) సేకరిస్తారు. ఇవి సాధారణంగా డేటా లీక్‌ల ద్వారా లేదా నకిలీ కేంద్రాల ద్వారా చేతికొస్తాయి. తర్వాత ఆ సమాచారంతో నకిలీ వేలిముద్రలు తయారు చేస్తారు. ఈ నకిలీ బయోమెట్రిక్‌తో AEPS మైక్రో ఏటీఎం యంత్రాల్లో లావాదేవీలు జరిపి బాధితుడి ఖాతా నుంచి డబ్బు డ్రా చేస్తారు. అంటే.. ఎవరో మీ లాకర్ తాళం చెవిని రహస్యంగా దొంగిలించి దాని ద్వారా మీకు తెలియకుండా మీ డబ్బులు కొట్టేస్తారన్నమాట.
మూలాన్ని కనిపెట్టడం కష్టం..
మోసగాళ్లు తీసిన డబ్బును నేరుగా తమ ఖాతాల్లో వేయరు. దానికి బదులుగా మ్యూల్ అకౌంట్లు అనే మార్గాన్ని ఉపయోగిస్తారు. ఈ ఖాతాలు సాధారణంగా డబ్బుకు అద్దెకు ఇచ్చిన ఖాతాలు, హ్యాక్ అయిన బ్యాంక్ ఖాతాలు అయి ఉంటాయి. వీటి ద్వారా డబ్బును పంపిస్తూ అసలు నేరస్తులను గుర్తించకుండా చేస్తారు. దీంతో పోలీసులకు అసలు మూలాన్ని కనిపెట్టడం కష్టమవుతుంది. నిపుణుల సూచనల ప్రకారం, ఈ రకమైన మోసాలకు చెక్ పెట్టే ఉత్తమ మార్గం GPS ఎనేబుల్డ్ మైక్రో ఏటీఎం డివైస్‌లు మాత్రమే అని తేలింది. ఇవి ఎలా పనిచేస్తాయంటే.. ప్రతి యంత్రానికి ఒక నిర్దిష్ట లొకేషన్ రిజిస్టర్ చేస్తారు. అదే ప్రదేశం నుంచి లావాదేవీ జరగాలి. వేరే చోట నుంచి ప్రయత్నిస్తే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది. ఇది బ్యాంకులకు కూడా ఉపయోగకరం, ఎందుకంటే GPS డేటాతో మోసాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించవచ్చు.
టెక్నాలజీ మారాల్సిందే..
రాబోయే రోజుల్లో ఈ యంత్రాల్లో ఏఐ టెక్నాలజీ, బయోమెట్రిక్ లైవ్‌నెస్ చెక్ (నిజమైన వేలిముద్రనా? లేక నకిలీనా అన్నది గుర్తించడం) వంటి సదుపాయాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో నకిలీ వేలిముద్రల వాడకం దాదాపు అసాధ్యమవుతుంది. ఈ వ్యవస్థ మీ లొకేషన్‌ను ట్రాక్ చేయదు. యంత్రం ఉన్న ప్రదేశాన్ని మాత్రమే గుర్తిస్తుంది. అంటే భద్రత పెరుగుతుంది, గోప్యత కూడా ఉంటుంది. అయితే ఈ మోసాల నుంచి సురక్షితంగా ఉండాలంటే అది మీ చేతుల్లోనే ఉంటుంది. పలు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. UIDAI వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ ఆధార్, బయోమెట్రిక్స్ లాక్ చేయాలి. గుర్తు తెలియని లేదా అనుమానాస్పద కేంద్రాల్లో ఆధార్ అప్‌డేట్ చేయించవద్దు. ఆధార్ ఫోటోకాపీ ఇవ్వాల్సి వస్తే కార్డు నుంచే కాపీ తీసి ఇవ్వండి. డిజిటల్ ఫోటో పంపితే వెంటనే డిలీట్ చేయండి. ఎవరికైనా మీ వేలిముద్ర ఇవ్వడంలో అత్యంత జాగ్రత్త వహించండి. ఆధార్ మనకు ఉపయోగకరమైన డాక్యుమెంట్ అయినా, నిర్లక్ష్యం చేస్తే అదే మన ఖాతాను ఖాళీ చేసే ఆయుధంగా మారుతుంది. జాగ్రత్తే ఉత్తమ రక్షణ అని చెప్పవచ్చు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






