Samsung | చవక ధరలకే ఏఐ ఫీచర్లతో లాంచ్ అయిన శాంసంగ్ ఫ్రిజ్‌లు
Samsung | దేశంలోనే అతిపెద్ద వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్ తన Bespoke AI టాప్-మౌంట్ ఫ్రీజర్ రిఫ్రిజిరేటర్ సిరీస్‌ని భారత్‌లో మరింతగా విస్తరించింది. ఈ కొత్త సిరీస్ ఫ్రిజ్‌లకు సామర్థ్యం అధికంగా ఉండడమే కాకుండా, కనెక్టెడ్ ఫీచర్లను కూడా ఇచ్చారు. గృహ వినియోగానికి అనుకూలమైన ఆధునిక డిజైన్‌తో ఈ ఫ్రిజ్‌లను రూపొందించారు.
Samsung | దేశంలోనే అతిపెద్ద వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్ తన Bespoke AI టాప్-మౌంట్ ఫ్రీజర్ రిఫ్రిజిరేటర్ సిరీస్‌ని భారత్‌లో మరింతగా విస్తరించింది. ఈ కొత్త సిరీస్ ఫ్రిజ్‌లకు సామర్థ్యం అధికంగా ఉండడమే కాకుండా, కనెక్టెడ్ ఫీచర్లను కూడా ఇచ్చారు. గృహ వినియోగానికి అనుకూలమైన ఆధునిక డిజైన్‌తో ఈ ఫ్రిజ్‌లను రూపొందించారు. ఈ సిరీస్‌లో 236 లీటర్లు, 256 లీటర్ల సామర్థ్యం కలిగిన మోడళ్లు ఉన్నాయి. కొన్ని ఎంపిక చేసిన మోడళ్లలో వైఫై కనెక్టివిటీ అందుబాటులో ఉంది, దీని ద్వారా వినియోగదారులు స్మార్ట్ థింగ్స్ యాప్ ద్వారా రిమోట్‌గా మానిటరింగ్, కంట్రోల్ చేయవచ్చు. ఈ రిఫ్రిజిరేటర్లను ఫ్లాట్-డోర్ Bespoke డిజైన్‌తో రూపొందించారు.
ఏఐ ద్వారా ట్రాక్ చేయొచ్చు..
సమర్థవంతమైన కూలింగ్ పనితీరును అందించడంతోపాటు, తాజా ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఫ్రిజ్‌లు ఉంటాయి. ఆధునిక గృహ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, కనెక్టెడ్ ఆపరేషన్, నియంత్రిత విద్యుత్ వినియోగాన్ని అందించేలా రూపొందించారు. ఈ సిరీస్‌లో ప్రధాన ఫీచర్లుగా స్మార్ఠ్ థింగ్స్ కనెక్టివిటీ (ఎంపిక చేసిన మోడళ్లలో) ద్వారా స్మార్ట్‌ఫోన్ తో రిమోట్ మానిటరింగ్, నియంత్రణ, వినియోగ పద్ధతులను విశ్లేషించి విద్యుత్ వినియోగాన్ని అంచనా వేసే AI ఎనర్జీ మోడ్, రోజువారీ, వారాంత, నెలవారీ విద్యుత్ వినియోగాన్ని ట్రాక్ చేసే స్మార్ట్ థింగ్స్ ఎనర్జీ, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అందించే స్మార్ట్ ఫార్వార్డ్, పనితీరును పర్యవేక్షించి సమస్యలపై అలర్ట్‌లు ఇచ్చే స్మార్ట్ థింగ్స్ హోమ్ కేర్ ఉన్నాయి. అలాగే తలుపు తెరిచి ఉంచినప్పుడు అలర్ట్‌లు పంపించే ఫీచర్ కూడా ఉంది.
పవర్ కూలింగ్ టెక్నాలజీ..
కూలింగ్ పరంగా ఆల్ అరౌండ్ కూలింగ్ టెక్నాలజీతో గాలి సమానంగా పంపిణీ అవుతుంది. పవర్ కూల్, పవర్ ఫ్రీజ్ ఫీచర్లు వేగంగా కూలింగ్, ఫ్రీజింగ్‌ను అందిస్తాయి. కొన్ని మోడళ్లలో ఉన్న కన్వర్టబుల్ 2-ఇన్-1 ఫీచర్ ద్వారా ఫ్రీజర్‌ను ఫ్రిజ్‌గా మార్చుకునే అవకాశం ఉంటుంది. డెయిరీ ఉత్పత్తులు, పండ్లు, పానీయాలను నిల్వ చేయడానికి ఫ్రెష్ రూమ్ విభాగం అందుబాటులో ఉంది. పవర్ కట్ సమయంలో 12 గంటల వరకు ఫుడ్‌ను ఫ్రోజెన్‌గా ఉంచే కూల్ ప్యాక్ టెక్నాలజీ కూడా ఉంది. ఫ్లాట్-డోర్ డిజైన్ సమానమైన బాహ్య ఆకృతిని అందిస్తుంది. అలాగే 2026-2028 ప్రమాణాలకు అనుగుణంగా BEE 3-స్టార్ ఎనర్జీ రేటింగ్ తో వీటిని రూపొందించారు. ఈ రిఫ్రిజిరేటర్ మోడల్స్ స్మార్ట్ థింగ్స్ ఎకోసిస్టమ్ ద్వారా పనిచేస్తాయి. స్మార్ట్‌ఫోన్ తో రిమోట్ మానిటరింగ్, నియంత్రణ, అలర్ట్‌లు, ఎనర్జీ ట్రాకింగ్ వంటి సౌకర్యాలను అందిస్తాయి.
ధర ఎంతంటే..
ఈ Bespoke AI టాప్-మౌంట్ ఫ్రీజర్ రిఫ్రిజిరేటర్ మోడల్స్ ప్రారంభ ధర రూ.26,090గా ఉంది. దేశంలోని అన్ని ప్రధాన రిటైల్ స్టోర్లతోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్, శాంసంగ్ ఇండియా ఆన్ లైన్ స్టోర్‌లోనూ ఈ ఫ్రిజ్‌లను విక్రయిస్తున్నారు. పరిమిత కాల ఆఫర్‌గా శాంసంగ్ కేర్ ప్లస్ ద్వారా 1 నుంచి 4 సంవత్సరాల వరకు అదనపు ప్రొటెక్షన్ ప్లాన్‌లను రోజుకు కేవలం రూ.3 ఖర్చుతో తీసుకోవచ్చు. ఇందులో 13వేలకు పైగా సర్టిఫైడ్ ఇంజినీర్ల సేవలు, 2,500కు పైగా సర్వీస్ సెంటర్ల సౌకర్యం, అలాగే శాంసంగ్ యాప్ ద్వారా సర్వీస్ ట్రాకింగ్, నోటిఫికేషన్‌లు అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ఆఫర్ మే 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని శాంసంగ్ తెలిపింది. ఇక 1 సంవత్సర ఎక్స్‌టెండెడ్ ప్లాన్ ను కొనుగోలు చేసిన వినియోగదారులకు అదనంగా 2 సంవత్సరాల వారంటీ ఉచితంగా లభిస్తుంది. దీంతో మొత్తం 4 సంవత్సరాల వరకు వారంటీ వస్తుంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






