త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rupee | ఆల్‌టైమ్ క‌నిష్ఠానికి రూపాయి విలువ‌..

Rupee | రూపాయి మార‌క‌పు (Rupee) విలువ ఆల్ టైమ్ క‌నిష్ఠానికి ప‌డిపోయింది. రూపాయి 0.32 శాతం క్షీణించి డాల‌ర్‌కు రూ.95.23 వ‌ద్ద కొత్త రికార్డు స్థాయికి చేరింది.

G

Business | Published On Apr 30, 2026, 11.06 am IST

Rupee | ఆల్‌టైమ్ క‌నిష్ఠానికి రూపాయి విలువ‌..
Advertisement

Rupee | త్రినేత్ర‌.న్యూస్‌: రూపాయి (Rupee) మార‌క‌పు విలువ ఆల్ టైమ్ క‌నిష్ఠానికి ప‌డిపోయింది. రూపాయి 0.32 శాతం క్షీణించి డాల‌ర్‌కు రూ.95.23 వ‌ద్ద కొత్త రికార్డు స్థాయికి చేరింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతోంది. ఏప్రిల్‌లో ఆర్‌బీఐ తీసుకున్న చర్యల వల్ల తాత్కాలికంగా బలపడిన కరెన్సీ, ఇప్పుడు ఆ లాభాలను కోల్పోయింది. రూపాయి మరింత బలహీనపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అంత‌ర్జాతీయంగా ఏర్ప‌డిన ఉద్రిక్త‌త‌లు, పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు, బ్రెంట్ క్రూడ్ ధరను బ్యారెల్‌కు 115 డాల‌ర్ల‌కు చేరాయి. దీంతో భారతదేశం తన అవసరాలలో ఎక్కువ భాగం ఆయిల్ దిగుమతులపై ఆధారపడి ఉండటంతో డాలర్ డిమాండ్ పెరిగి, రూపాయి విలువ తగ్గింది. అదేవిధంగా విదేశీ పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ‌, ట్రేడ్ ప్రిక్ష‌న్స్ వంటివి కూడా రూపాయి విలువ ప‌డిపోవ‌డానికి కార‌ణ‌మ‌య్యాయి. దీని ప్ర‌భావంతో ఆయిల్, ఇతర వస్తువుల ధరలు పెరిగే అవ‌కాశం ఉంది. త‌ద్వారా ద్ర‌వ్యోల్బణం (Inflation) కూడా అధిక‌మ‌వ‌నుంది.

Advertisement
Advertisement