త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rule Changes | సిలిండర్‌ నుంచి ఫాస్టాగ్‌ వరకు.. ఫిబ్రవరి ఒకటి నుంచి మారనున్న రూల్స్‌ ఇవే..!

Rule Changes | ఈ ఏడాది మరో నెల ముగిసిపోతోంది. ఫిబ్రవరి మాసం దేశ సాధారణ బడ్జెట్‌తో ప్రారంభంకానున్నది. ఫిబ్రవరి ఒకటి నుంచి కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొత్త నెల నుంచి పలు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మార్పులతో ప్రజల జేబులపై ప్రత్యక్ష ప్రభావం పడనున్నది. గ్యాస్ సిలిండర్ల నుంచి సిగరెట్ల వరకు, ఇంధనం నుంచి బ్యాంకింగ్, ఫాస్టాగ్ వరకు ప్రతి రంగంలోనూ మార్పులు జరుగబోతున్నాయి.

P

Business | Published On Jan 31, 2026, 10.55 am IST

Rule Changes | సిలిండర్‌ నుంచి ఫాస్టాగ్‌ వరకు.. ఫిబ్రవరి ఒకటి నుంచి మారనున్న రూల్స్‌ ఇవే..!
Advertisement

Rule Changes | ఈ ఏడాది మరో నెల ముగిసిపోతోంది. ఫిబ్రవరి మాసం దేశ సాధారణ బడ్జెట్‌తో ప్రారంభంకానున్నది. ఫిబ్రవరి ఒకటి నుంచి కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొత్త నెల నుంచి పలు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మార్పులతో ప్రజల జేబులపై ప్రత్యక్ష ప్రభావం పడనున్నది. గ్యాస్ సిలిండర్ల నుంచి సిగరెట్ల వరకు, ఇంధనం నుంచి బ్యాంకింగ్, ఫాస్టాగ్ వరకు ప్రతి రంగంలోనూ మార్పులు జరుగబోతున్నాయి. రేపటి నుంచి ఏం మార్పులు జరుగబోతున్నాయో తెలుసుకుందాం రండి..!

ఎల్పీజీ సిలిండర్ ధరలో మార్పు..

ప్రతి నెలా సిలిండర్‌ ధరలు మారుతుంటాయి. గ్యాస్‌ కంపెనీలు ప్రతినెలా గ్యాస్‌ ధరలను సరి చేస్తుంటాయి. ఈ సారి 14 కిలోల డొమెస్టిక్‌ సిలిండర్ల ధరలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇటీవల కొద్దినెలలుగా 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్‌ ధరల్లో గణనీయంగా మార్పులు జరిగాయి. జనవరి ఒకటిన వాణిజ్య సిలిండర్‌ ధర రూ.14.50 తగ్గింది. దాంతో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 19 కిలోల సిలిండర్‌ ధర రూ.1,804కి తగ్గింది. ప్రస్తుతం మరోసారి సిలిండర్ల ధరలో మార్పులు చోటు చేసుకోనున్నాయి.

సీఎన్‌జీ- ఏటీఎఫ్‌ ధరలు..

ఎల్పీజీతో పాటు ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) కొత్త ధరలను కూడా ఫిబ్రవరి 1న సవరించనున్నారు. ఏటీఎఫ్ ధరల్లో మార్పులు విమాన ఛార్జీలపై నేరుగా ప్రభావం చూపుతాయి. గత నెల జనవరి 1న ఢిల్లీలో ఏటీఎఫ్ ధరలను సుమారు 7శాతం తగ్గించారు. సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలలో కూడా మార్పులు జరగనున్నాయి. ఇది వాహనాల నిర్వహణ, గృహ గ్యాస్ ఖర్చులపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

పాన్‌ మలాసాలు, సిగరేట్లపై అదనపు పన్ను

ఫిబ్రవరి ఒకటి నుంచి పొగాకు ఉత్పత్తులు, పాన్‌ మలాసాలపై అదనంగా పన్నులు విధించే అవకాశాలున్నాయి. నివేదికల ప్రకారం.. ప్రభుత్వం జీఎస్టీ పరిహార సెస్ స్థానంలో కొత్త ఎక్సైజ్ సుంకం, సెస్ విధించాలని నిర్ణయించింది. కొత్త విధానం ప్రకారం.. పాన్ మసాలా మరియు పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీతో పాటు ఆరోగ్యం, జాతీయ భద్రతా సెస్ విధించే ఛాన్స్‌ ఉంది. దాంతో వాటి ధరలు భారీగా పెరిగే ఛాన్స్‌ ఉంది.

ఫాస్టాగ్‌లో మార్పులు..

ఫిబ్రవరి ఒకటి నుంచి ఫాస్టాగ్ నిబంధనలు కూడా మారనున్నాయి. నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రకారం.. కార్లు, జీపులు, వ్యాన్ల కోసం ఫాస్టాగ్‌ జారీ చేయడానికి కేవైసీ ధ్రువీకరణ ప్రక్రియను సవరించారు. దాంతో వాహనదారులు ట్యాగ్ యాక్టివేషన్ తర్వాత ఎలాంటి అదనపు ధ్రువీకరణ అవసరం లేకుండా ఫాస్టాగ్‌ను నిరంతరాయంగా ఉపయోగించుకునే అవకాశం కల్పించింది. ఈ కొత్త రూల్‌ కారణంగా ఫిజికల్‌ కేంద్రాల్లో, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో కొనుగో చేసిన ఫాస్టాగ్‌లకు సమానంగానే వర్తించనున్నది.

ఫిబ్రవరిలో బ్యాంకు సెలవులు

సెలవుతోనే ఫిబ్రవరి మాసం మొదలుకానున్నది. ఏదైనా బ్యాంక్‌ పని ఉంటే ముందస్తుగానే సెలవులను చూసుకొని పనులను చక్కబెట్టుకోవడం మంచిది. ఆర్‌బీఐ ప్రకారం.. వారాంతపు సెలవులతో కలిసి దాదాపుగా మొత్తం పదిరోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ క్రమంలో ఏదైనా పని ఉంటే.. ముందస్తుగానే పూర్తి చేసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలుంటాయి.

యూపీఐ రూల్స్‌..

ఫిబ్రవరి ఒకటి నుంచి యూపీఐ రూల్స్‌లో భారీ మార్పులు జరుగనున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పలు యూపీఐ లావాదేవీలను బ్లాక్‌ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సర్క్యూలర్‌ను జారీ చేసింది. ఇకపై స్పెషల్‌గా అక్షరాలతో ఉన్న ఐడీలపై లావాదేవీలకు అనుమతి ఉండదు. ఫిబ్రవరి ఒకటి నుంచి లావాదేవీల్లో కేవలం ఆల్ఫాన్యూమరిక్‌ అక్షరాలు మాత్రమే ఉపయోగిస్తారు. ఇది కాకుండా మరో ఐడీని ఉపయోగిస్తే లావాదేవీలు నిలిచిపోతాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement