త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

LICHFL Home Loan | LICHFL బంప‌ర్ ఆఫ‌ర్‌.. అత్యంత త‌క్కువ వ‌డ్డీ రేటుకే ఇంటి రుణం..

LICHFL Home Loan | భార‌త‌దేశ అత్యున్నత బ్యాంకు ఆర్‌బీఐ ఇటీవ‌లే రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే బ్యాంకులు సైతం వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించాయి. దీని వ‌ల్ల ఫ్లోటింగ్ వ‌డ్డీ రేట్ల‌పై లోన్ల‌ను తీసుకునే వారికి, కొత్త‌గా లోన్ల‌ను తీసుకునే వారికి ఎంతో మేలు జ‌రుగుతోంది.

S

Business | Published On Dec 26, 2025, 9.39 pm IST

LICHFL Home Loan | LICHFL బంప‌ర్ ఆఫ‌ర్‌.. అత్యంత త‌క్కువ వ‌డ్డీ రేటుకే ఇంటి రుణం..
Advertisement

LICHFL Home Loan | భార‌త‌దేశ అత్యున్నత బ్యాంకు ఆర్‌బీఐ ఇటీవ‌లే రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే బ్యాంకులు సైతం వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించాయి. దీని వ‌ల్ల ఫ్లోటింగ్ వ‌డ్డీ రేట్ల‌పై లోన్ల‌ను తీసుకునే వారికి, కొత్త‌గా లోన్ల‌ను తీసుకునే వారికి ఎంతో మేలు జ‌రుగుతోంది. అయితే ఆర్‌బీఐ రెపో రేటు త‌గ్గించ‌డంతో ప్ర‌స్తుతం చాలా వ‌ర‌కు బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు ఇంటి రుణాల వ‌డ్డీ రేట్లను భారీ ఎత్తున త‌గ్గిస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ (LICHFL) కూడా ఇంటి రుణాల‌కు గాను వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించింది. దీంతో ప్ర‌స్తుతం వినియోగదారులు LICHFL నుంచి అతి త‌క్కువ వ‌డ్డీ రేటుకే లోన్‌ను పొంద‌వ‌చ్చు. కేవ‌లం 7.15 శాతం వ‌డ్డీ రేటుతో LICHFL ఇంటి రుణాల‌ను అందిస్తున్న‌ట్లు తెలియ‌జేసింది.

సిబిల్ బాగుండాలి..

అయితే LICHFL అందిస్తున్న ఈ త‌క్కువ వ‌డ్డీ రేటును పొందాల‌నుకుంటే వినియోగ‌దారులు క‌చ్చితంగా చక్క‌ని సిబిల్ స్కోరును క‌లిగి ఉండాలి. మంచి క్రెడిట్ హిస్ట‌రీ ఉన్న‌వారికే ఈ రేటుకు ఇంటి రుణం ల‌భిస్తుంది. ఈ క్ర‌మంలోనే సిబిల్ స్కోరు 825 లేదా అంత‌క‌న్నా ఎక్కువ ఉంటేనే 7.15 శాతం వ‌డ్డీ రేటుతో ఇంటి రుణం పొంద‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో గ‌రిష్టంగా రూ.5 కోట్ల వ‌ర‌కు రుణం ఇస్తారు. ఇక సిబిల్ స్కోరు 800 నుంచి 824 మ‌ధ్య ఉంటే వడ్డీ రేటు పెరుగుతుంది. వినియోగ‌దారులు 7.25 శాతం వ‌డ్డీ రేటుతో ఇంటి రుణం పొంద‌వ‌చ్చు. అలాగే సిబిల్ స్కోరు 600 క‌న్నా త‌క్కువ‌గా ఉన్న‌వారికి కూడా ఇంటి రుణం ఇస్తారు. కానీ వారికి వ‌డ్డీ రేటు పెరుగుతుంది. అలాంటి వారికి 10 శాతం వ‌డ్డీ రేటుకు ఇంటి రుణం అందిస్తామ‌ని LICHFL తెలిపింది. అంటే ఆ సంస్థ అందిస్తున్న త‌క్కువ వ‌డ్డీ రేటును పొందాలంటే క‌చ్చితంగా వినియోగ‌దారులు చాలా అధిక సిబిల్ స్కోరును క‌లిగి ఉండాల‌న్నమాట‌.

ఇత‌ర బ్యాంకుల్లో రుణం ఉన్నా..

కాగా దేశ‌వ్యాప్తంగా ఇంటి రుణాల‌ను అందిస్తున్న బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌ల‌తో పోలిస్తే LICHFL అందిస్తున్న ఇంటి రుణం వ‌డ్డీ రేటే చాలా త‌క్కువ‌గా ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఎస్‌బీఐలో క‌నిష్ట ఇంటి రుణ వ‌డ్డీ రేటు 7.25 శాతంగా ఉంది. అందువ‌ల్ల LICHFL అందిస్తున్న 7.15 శాతం వ‌డ్డీ రేటు అత్యంత త‌క్కువ అని చెప్ప‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే వినియోగ‌దారులు త‌మ సిబిల్ స్కోరు బాగుంటే ఇదే వ‌డ్డీ రేటుకు ఇంటి రుణం పొంద‌వ‌చ్చు. ఇక ఈ వ‌డ్డీ రేటు సిబిల్ స్కోరు బాగున్న ఏ క‌స్ట‌మ‌ర్ల‌కు అయినా స‌రే వ‌ర్తిస్తుంది. కొత్త‌గా లోన్ తీసుకునేవారితోపాటు ఇప్ప‌టికే వేరే బ్యాంకులో లేదా ఆర్థిక సంస్థ‌లో ఇంటి రుణం తీసుకుని ఈఎంఐలు క‌డుతున్న‌వారు కూడా సిబిల్ బాగుంటే LICHFL అందిస్తున్న ఈ త‌క్కువ వ‌డ్డీ రేటుకు ఇంటి రుణం పొంద‌వ‌చ్చు. దీంతో కొత్త‌వారికి చాలా సుల‌భంగా రుణం ల‌భిస్తుంది. ఇక ఇత‌ర సంస్థ‌ల్లో రుణం తీసుకున్న వారు అప్లై చేస్తే వారి లోన్ LICHFL కు మారుతుంది. దీంతో వారు త‌క్కువ వ‌డ్డీ రేటు ప్ర‌యోజ‌నాన్ని పొంద‌వ‌చ్చు. ఇలా పాత క‌స్ట‌మ‌ర్లు అయితే రూ.50 ల‌క్ష‌ల నుంచి రూ.15 కోట్ల వ‌ర‌కు LICHFL ఇంటి రుణాన్ని అందిస్తోంది. క‌నుక ఇంటి రుణాన్ని పొందాల‌నుకునే వారికి LICHFL అద్భుత‌మైన అవ‌కాశాన్ని అందిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement