Stock Market | భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు.. ఆవిరైన రూ.5లక్షల కోట్ల సంపద..!
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా పతనమయ్యాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యూఎస్-ఇరాన్ చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండా ముగియడం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, రూపాయి బలహీనపడడం తదితర కారణాలతో మార్కెట్లు అస్థితరకు గురయ్యాయి.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా పతనమయ్యాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యూఎస్-ఇరాన్ చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండా ముగియడం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, రూపాయి బలహీనపడడం తదితర కారణాలతో మార్కెట్లు అస్థితరకు గురయ్యాయి. ఐటీ, మీడియా మినహా అన్నిరంగాల స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ గత సెషన్‌తో పోలిస్తే శుక్రవారం 82,220.48 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. ఆ తర్వాత మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు. ఒక దశలో వెయ్యి పాయింట్ల వరకు పతనమైంది. ఇంట్రాడేలో 81,159.15 పాయింట్ల కనిష్టానికి చేరుకుంది.
చివరకు 961.42 పాయింట్లు తగ్గి.. 81,287.19 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 317.90 పాయింట్లు తగ్గి 25,178.65 వద్ద స్థిరపడింది. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా ఒక్కొక్కటి ఒకశాతం వరకు నష్టపోయాయి. శుక్రవారం ఒకే రోజు దాదాపు 5లక్షల కోట్ల మదుపరులు నష్టపోయారు. బీఎస్ఈలో లిస్టెడ్ సంస్థల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గత సెషన్‌లో రూ.468.5 లక్షల కోట్ల నుంచి రూ.463 లక్షల కోట్లకు పడిపోయింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, భారతి ఎయిర్‌టెల్, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, సన్ ఫార్మా నిఫ్టీలో నష్టాల్లో ముగియగా.. ట్రెంట్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, అపోలో హాస్పిటల్స్ లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే ఆటో, బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, మెటల్, రియాల్టీ, టెలికాం ఒకశాతం నుంచి 2శాతం వరకు తగ్గాయి. ఐటి, మీడియా, కన్స్యూమర్ డ్యూరబుల్స్ లాభాల్లో ట్రేడయ్యాయి.
ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పి, జపాన్ నిక్కీ 225, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్ తక్కువగా కోట్ అయ్యాయి. గురువారం యూఎస్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. చిప్‌మేకర్ ఎన్‌విడియా త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఎస్ అండ్ పీ 500, యూరోపియన్ మార్కెట్లు నష్టపోయాయి. ఊహించినదాని కంటే మెరుగైన ఫలితాలు ఉన్నప్పటికీ కంపెనీ షేర్లు 5.5శాతం పడిపోయాయి. అలాగే, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గురువారం రూ.3,465.99 కోట్ల విలువైన ఉపసంహరించుకున్నారు. దాంతో మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడింది. మార్కెట్‌పై ఒత్తిడి కొనసాగుతోందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. భౌగోళిక రాజకీయ ఆందోళనలు సైతం మార్కెట్‌పై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. ట్రెహ్రాన్ అణు కార్యక్రమాల విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య గురువారం చర్చలు జరిగాయి. ఎలాంటి ఒప్పందం లేకుండా ముగియడం మధ్యప్రాశ్యంలో ఆందోళనలు పెంచాయి. అమెరికా దాడులు చేస్తుందన్న ఆందోళనలు కొసాగుతున్నాయి. దీనికి తోడు డాలర్‌తో పోలిస్తే రూపాయి 4 పైసలు తగ్గి 90.95కి చేరిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






