RBI | రూ.2 వేల నోట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన
RBI | రూ.2వేలనోట్ల (Rs 2,000 Notes)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటన చేసింది.
RBI | రూ.2వేలనోట్ల (Rs 2,000 Notes)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకూ చలామణి నుంచి దాదాపు 98.42 శాతం నోట్లు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని తెలిపింది. ఈ మేరకు నిన్న ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంకా రూ. 5,609 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని, అవి రావాల్సి ఉందని స్పష్టం చేసింది.
2023 మే 19న చలామణి నుంచి రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు (Denomination Banknotes) ఆర్‌బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. నాడు చలామణిలో ఉన్న ఈ నోట్ల విలువ రూ.3.56 లక్షల కోట్లు. ఇదిలావుంటే 2023 అక్టోబర్ దాకా దేశంలోని అన్ని బ్యాంక్ శాఖల్లో రూ.2,000 నోట్ల మార్పిడి జరిగింది. ఆ తర్వాత నుంచి హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో మాత్రమే ఈ మార్పిడికి వీలుంది.
అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలోని ఆర్బీఐ శాఖల్లో రూ.2వేల నోట్లు మార్చుకోవచ్చు. కాగా, కేంద్ర ప్రభుత్వం నవంబర్ 2016లో రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అప్పుడు చలమాణిలో ఉన్న రూ. 1,000, రూ.500 నోట్లను రద్దు చేసి రూ.2వేల నోట్లను చలామణిలోకి తెచ్చింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






