త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RBI | డిజిట‌ల్ వ్యాలెట్స్‌కు ఆర్‌బీఐ కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు..

RBI | దేశంలో డిజిటల్ లావాదేవీల భద్రతను బలోపేతం చేయడంతో పాటు వినియోగదారులకు మరింత స్పష్టత కల్పించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కొత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (పీపీఐ)గా పిలిచే డిజిటల్ వాలెట్లు, ప్రీపెయిడ్ కార్డులపై తాజా ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది.

P

Business | Published On Apr 25, 2026, 9.45 pm IST

RBI | డిజిట‌ల్ వ్యాలెట్స్‌కు ఆర్‌బీఐ కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు..
Advertisement

RBI | దేశంలో డిజిటల్ లావాదేవీల భద్రతను బలోపేతం చేయడంతో పాటు వినియోగదారులకు మరింత స్పష్టత కల్పించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కొత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (పీపీఐ)గా పిలిచే డిజిటల్ వాలెట్లు, ప్రీపెయిడ్ కార్డులపై తాజా ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త ప్రతిపాదనల ప్రకారం.. బ్యాంకేతర సంస్థలు పీపీఐ సేవలు అందించాలంటే కనీస నికర విలువ రూ.5 కోట్లుగా ఉండాలి. సేవలు ప్రారంభించిన మూడు సంవత్సరాల లోపే దీన్ని రూ. 15 కోట్లకు పెంచాల్సి ఉంటుంది. వినియోగదారుల నుంచి సేకరించిన మొత్తాలను తప్పనిసరిగా వాణిజ్య బ్యాంకుల్లోని ప్రత్యేక ఎస్క్రో ఖాతాల్లో నిల్వ చేయాలని ఆర్‌బీఐ సూచించింది.

డెబిట్ కార్డులు జారీ చేసే బ్యాంకులు కూడా ముందస్తుగా సమాచారం ఇచ్చి పీపీఐ సేవలను అందించే వీలుందని పేర్కొంది. లావాదేవీల పరిమితుల విషయంలోనూ స్పష్టమైన నిబంధనలు ప్రతిపాదించారు. సాధారణ పీపీఐ ఖాతాల్లో గరిష్ఠంగా రూ. 2 లక్షల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. నెలకు రూ. 10వేల వరకు నగదు జమ చేసుకునే అవకాశం ఉంటుంది. చిన్న మొత్తాల పీపీఐల పరిమితి రూ.10వేలు, ట్రాన్సిట్ కార్డుల గరిష్ఠ పరిమితి రూ.3వేలుగా నిర్ణయించారు. వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల ఛార్జీలు, నిబంధనలు, సేవల గడువు వంటి వివరాలను ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా స్పష్టంగా వెల్లడించాలని ఆదేశించారు. ఫెయిల్ అయిన‌, ర‌ద్ద‌యిన లావాదేవీలకు సంబంధించిన మొత్తాన్ని వెంటనే వినియోగదారుల ఖాతాల్లోకి తిరిగి జమ చేయాలని ఆదేశించింది. ఈ ముసాయిదాపై మే 22లోగా ప్ర‌జ‌లు, సంబంధిత వ‌ర్గాలు త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డించాల‌ని ఆర్‌బీఐ కోరింది.

Advertisement
Advertisement